RangaReddy

News November 14, 2024

HYD: త్వరలో NIMSలో గుండె కవాటాల బ్యాంక్!

image

HYD NIMSలో త్వరలో గుండె కవాటాల భద్రత కోసం ప్రత్యేక బ్యాంక్ సిద్ధం అవుతుంది. చికిత్స సైతం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం గుండె కవాటాలు వైఫల్యం చెందితే కృత్తిమ కవాటాలని ఆమర్చుతున్నారు. కొన్ని రోజుల తర్వాత వాటిని మళ్లీ మార్చుకోవాల్సి వస్తోంది. ఇకపై ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి గుండె కవాటాలను సేకరించి, బ్యాంకులో భద్రపరిచి అవసరమైన వారికి అమరుస్తారు.

News November 14, 2024

HYD: మరో 8 నెలల్లో రైల్వే స్టేషన్ల పనులు పూర్తి..!

image

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ.1830.4 కోట్లతో 38 స్టేషన్లను అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కేవలం రాజదాని పరిధిలోనే 12 స్టేషన్లు ఉండటం గమనార్హం. మల్కాజిగిరి, బేగంపేట, యాకుత్‌పుర, ఉమ్దానగర్ రైల్వే స్టేషన్ల పనులు మరో 8 నెలల్లో పూర్తికానున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇప్పటికే చర్లపల్లి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పూర్తయి ప్రారంభానికి సిద్ధమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

News November 14, 2024

HYD: గోల్డెన్ హవర్.. మిస్ చేయకండి!

image

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. సైబర్ నేరానికి గురై, డబ్బు పోగొట్టుకుంటే గంటలోపు 1930, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని HYD పోలీసులు సూచించారు. డబ్బు అకౌంట్‌ నుంచి మాయమైన గంట లోపు ఉండే సమయాన్ని గోల్డెన్ హవర్ అంటారని తెలిపారు. ఈ సమయంలో ఫిర్యాదు చేస్తే, డబ్బులు ఫ్రీజ్ చేసి, దర్యాప్తు చేయడానికి ఎక్కు ఆస్కారం ఉంటుందన్నారు. రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువన్నారు.

News November 14, 2024

HYDలో డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు

image

HYD నగరంలో 3 హబ్ ఆస్పత్రులైన నిమ్స్, గాంధీ, ఉస్మానియాల్లో వాస్క్యులర్ ఆపరేషన్లు, డయాలసిస్ చేయనున్నారు. మొత్తం రాష్ట్రంలో 7 కేంద్రాల ఏర్పాటు కోసం రూ.32.7 కోట్లను వెచ్చించనున్నారు. HYDలోని ప్రధాన ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు సిద్ధమవుతున్నట్లుగా అధికారులు తెలిపారు. సెంటర్లు అందుబాటులోకి వస్తే వేలాది మందికి ప్రయోజనం చేకూరనుంది.

News November 14, 2024

HYD‌లో కిలో చికెన్ రూ.162

image

HYDలో చికెన్ ధరలు‌ భారీగా తగ్గాయి. గత నెల రోజులుగా మాంసం KG రూ. 200కు పైగానే పలికింది. కార్తీక మాసం 2వ వారంలో ధరలు ఒక్కసారిగా తగ్గాయి. గతవారం స్కిన్‌లెస్ రూ. 234 నుంచి రూ. 245, విత్ స్కిన్ రూ. 200 నుంచి రూ. 215 మధ్య విక్రయించారు. గురువారం స్కిన్ లెస్ KG రూ. 185, విత్ స్కిన్ రూ. 162కి పడిపోయింది. కార్తీక మాసంలో మాంసానికి దూరంగా ఉండడంతో గిరాకీ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.

SHARE IT

News November 14, 2024

మాజీ ఉపరాష్ట్రపతి నివాసంలో కులగణన సర్వే

image

భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాసంలో కులగణన సర్వేను విజయవంతంగా నిర్వహించారు. సర్వేను ఎన్యుమరేటర్ ఉమాదేవి, శివ కుమార్ పర్యవేక్షణలో జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షణలో సర్కిల్ నోడల్ అధికారి సాయి శ్రీనివాస్ కలిసి పర్యవేక్షించారు. సర్వేలో పాల్గొనడానికి సమయాన్ని వెచ్చించినందుకు వెంకయ్య నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు.

News November 14, 2024

HYD: అక్కడేమో పూజలు.. ఇక్కడేమో ఇలా..!

image

VKB అనంతగిరి కొండల్లో పుట్టిన మూసికి అక్కడికి వెళ్లిన పర్యటకులు పూలు చల్లి పూజలు చేసి, స్వచ్ఛమైన నీటితో దైవాభిషేకం చేస్తున్నారు. మరి అదే మూసీ.. VKB ప్రాంతంలో పూజలు చేసిన వారే.. HYDలో మూసీని చూడగానే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. PCB ప్రమాణాలకు మించి మూసీ కలుషితమైంది. దీంతో HYDలో 55KM మూసీ పునరుజ్జీవం చేసి తీరుతామని ప్రభుత్వం అంటుంది.

News November 13, 2024

HYD: సీపీ ఫోటోతో సైబర్ నేరగాళ్ల దందా.. జాగ్రత్త..!

image

HYD సీపీ ఆనంద్ ఫోటోతో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారు. ఫేక్ నంబర్లతో కాల్ చేసి, అమాయక వ్యక్తులకు వలవేస్తున్నారు. దీనిపై స్పందించిన సీపీ.. డబ్బు, బ్యాంకు వివరాలు అడగటం కోసం, ఇతర పర్సనల్ సమాచారం అడగటానికి ఏ అధికారి కాల్ చేయరని, అలాంటి వాటిని నమ్మొద్దని, సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.

News November 13, 2024

ఓయూలో త్వరలో సంస్కరణలు: వీసీ

image

తార్నాక ఉస్మానియా యూనివర్సిటీలో త్వరలో సంస్కరణలను ప్రవేశపెట్టనున్నట్లు వీసీ ప్రొ.ఎం.కుమార్ వెల్లడించారు. ఆన్‌లైన్ లావాదేవీలు, డిజిటల్ హాజరు తదితర అంశాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. VC బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఠాగూర్ ఆడిటోరియంలో అధ్యాపకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న న్యాక్ గుర్తింపులో ఉత్తమ రేటింగ్ సాధించాల్సిన అవసరం ఉందన్నారు.

News November 13, 2024

RR: ప్రతి గ్రామంలో విత్తనోత్పత్తికి రంగం సిద్ధం..!

image

గ్రామాల్లో విత్తనోత్పత్తికి రంగం సిద్ధమైంది. RR,MDCL,VKB జిల్లాల్లో వచ్చే ఏడాది వానకాలం నుంచి ప్రతి గ్రామంలో 5-10 మంది అభ్యుదయ రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేసేలా రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఇందుకు, విత్తన విభాగాన్ని ఏర్పాటు చేసి, వర్సిటీ సైంటిస్టులు తయారు చేసిన విత్తనాలను పంపిణీ చేస్తారు. అనంతరం రైతులు పండించిన పంట నుంచి విత్తనాలను ఉత్పత్తి చేస్తారు.