RangaReddy

News November 13, 2024

HYD: ప్రజా కవికి 1992లోనే పద్మవిభూషణ్‌: KTR

image

ప్రజాకవి కాళోజి నారాయణరావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్, MLA KTR నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 1992లో భారతదేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ను పొందారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

News November 13, 2024

మాజీ MLA పట్నం నరేందర్ అరెస్ట్ దుర్మార్గం: హరీశ్ రావు

image

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదన్నారు. పట్నం నరేందర్ రెడ్డిని, రైతులను వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

News November 13, 2024

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

image

గచ్చిబౌలిలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH) ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హతగల భారతీయ పౌరులు, భారతీయ విదేశీ పౌరులు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ 9 డిసెంబర్ 2024. అప్లై చేసిన హార్డ్ కాపీ డిసెంబర్ 16 లోపు పంపించాలి. మరిన్ని వివరాలకు https://uohyd.ac.in/careers-uoh/ సందర్శించవచ్చు. SHARE IT

News November 13, 2024

HYD: KCR పాలనలో అవినీతిపై విచారణ జరిపించాలి: TRS

image

మాజీ సీఎం KCR పాలనలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం CBIతో విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణ సమితి(TRS) చీఫ్ నరాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. HYD బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్, కరెంట్ అగ్రిమెంట్, ల్యాండ్ ట్రాన్సఫర్మేషన్‌‌లో KCR రూ.వేల కోట్లు అవినీతి చేశారని ఆరోపించారు. KCR అవినీతి తెలియజేసేందుకు DEC 6 నుంచి భద్రాచలం-చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు పాదయాత్ర చేస్తామన్నారు.

News November 13, 2024

సీఎం రేవంత్ రెడ్డితో నెదర్లాండ్స్ రాయబారి భేటీ

image

నెదర్లాండ్స్ దేశ రాయబారి మరిసా జెరార్డ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఢిల్లీలోని వారి అధికారిక నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికల పట్ల నెదర్లాండ్స్ రాయబారి జెరార్డ్ ఆసక్తి కనబర్చారు. ఈ భేటీలో టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ పాల్గొన్నారు.

News November 13, 2024

HYD: బైకులు ఎత్తుకుపోతున్నారు జాగ్రత్త..!

image

HYDలో 2024లోనే దాదాపు 1,400లకు పైగా వాహనాల చోరీ జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. గతేడాది మొత్తం 1,400 చోరీల కేసులు నమోదైతే ఈ ఏడాది ఇప్పటికే 1,400 దాటడం గమనార్హం. ముఖ్యంగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో, ఇంటి ముందు పార్కు చేసినవి, కొన్నేళ్లుగా మూలకు పడి ఉన్న వాహనాలను ఎత్తకెళ్తున్నారు. అయితే బైకులకు అలారమ్, సెన్సార్లు ఏర్పాటు చేసుకోవడం మేలని అధికారులు సూచిస్తున్నారు.
# SHARE IT

News November 13, 2024

HYD: మూసీపై MASTER ప్లానింగ్, డిజైన్లపై కసరత్తు!

image

HYD మూసీకి తూర్పున గౌరెల్లి నుంచి పశ్చిమాన నార్సింగి వరకు 55KM మేర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. నదికి ఇరువైపుల కిలోమీటర్ మేర గ్రోత్ ఏరియాగా గుర్తించారు. మొత్తంగా 125 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాణిజ్య కేంద్రాలు, రవాణా, లాజిస్టిక్ పార్కులు, గ్రీన్ జోన్ లాంటివి ఏర్పాటు చేయనున్నారు. మరో నెలలో మూసీ డిజైన్లు పూర్తవుతాయని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

News November 12, 2024

HYD:ఇంటర్నేషనల్ లైసెన్సుల పై వాహనదారుల ఆసక్తి!

image

అంతర్జాతీయ లైసెన్సులపై వాహనదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. గ్రేటర్ HYD పరిధిలో ఈ ఏడాది ఏకంగా 10,000 వరకు జారీ అయినట్లు అధికారులు తెలిపారు. వీటి కోసం ఆర్టీఏ వెబ్‌సైట్, లేదంటే స్థానికంగా ఉన్న కార్యాలయం వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కనీసం 18 ఏళ్ల వయసు ఉండాలని, దరఖాస్తు చేసిన తేదీ నుంచి కనీసం 6 నెలల పాటు చెల్లుబాటు అయ్యేలా పాస్ పోర్ట్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.

News November 12, 2024

HYD: ఓవైపు కోర్టు నుంచి స్టే.. మరోవైపు 2BHK

image

HYD, RR, MDCL జిల్లాల్లో 2,166 నివాసాలు మూసీ నది గర్భంలో ఉన్నట్లు 2018 డ్రోన్ సర్వే ద్వారా అధికారులు గుర్తించారు. వాటిలో 68% ఇళ్లకు ఇప్పటి వరకు రివర్‌బెడ్ RB-X మార్కింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. చైతన్యపురి, కొత్తపేటలో దాదాపు 620 మంది పిటిషన్లు దాఖలు చేయగా.. వారిలో సుమారు 400 మందికి పైగా కోర్టులో స్టే తెచ్చుకున్నారు. మరికొందరు ప్రభుత్వం కేటాయించిన 2BHKకు వెళ్తున్నారు.

News November 12, 2024

HYD: ఫోన్ల రికవరీలో తెలంగాణ TOP-2

image

HYD నగరలో క్రైమ్ రివ్యూ మీటింగ్ డీజీపీ డాక్టర్ జితేందర్ అధ్యక్షతన జరిగింది. 557 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోగొట్టుకున్న 50,788 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు సైబర్ క్రైమ్ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ తెలిపారు. ఫోన్లు రికవరీ చేయడంలో భారతదేశంలోనే తెలంగాణ రెండో ర్యాంక్ సాధించిందని తెలిపారు. తెలంగాణలో సరాసరిగా రోజుకు 91 మొబైల్ ఫోన్లు రికవరీ అవుతున్నట్లు తెలిపారు.