India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను జారీ చేస్తామని పేర్కొన్నారు. ఈనెల 21 నుంచి 24 వరకు వార్డు సమావేశాల్లో దరఖాస్తులను సమర్పించవచ్చని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ అన్నారు. మీ సేవా కేంద్రాలకు వచ్చిన 2,05,019 దరఖాస్తులను పరిశీలిస్తామని, ప్రజా పాలనలో వచ్చిన అభ్యర్థనలను కూడా పరిశీలిస్తామన్నారు.
OYO హోటల్స్ బంద్ చేయాలని HYD శివారులో ఆందోళన చేపట్టారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఓయో హోటల్‌లో మైనర్ బాలికపై అత్యాచారం, మంగళపల్లిలోని ఓ హాస్టల్‌లో ఉన్న విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ CPI నిరసన వ్యక్తం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు యాదయ్య అత్యాచారం జరిగిన OYO ముందు ధర్నా చేపట్టారు. ప్రధాన నిందితుడు, హోటల్ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సినిమాల్లో ఛాన్స్ అంటూ ఇటీవల ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆడిషన్స్ పేరుతో ఆశ చూపించి గదికి పిలిచి ఓ దుండగుడు అత్యాచారానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు అసిస్టెంట్ డైరెక్టర్ రాజు మీద BNS 64,79,115,351(2) కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు.
ఉమ్మడి RR జిల్లాలో 6.3 లక్షల మంది రైతులు ఉండగా, గత చివరి సీజన్లో RR జిల్లా పరిధిలో 3.04 లక్షల మంది రైతులకు రూ.343.97 కోట్లు రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో జమ చేశారు. వికారాబాద్ జిల్లాలో 2.70 లక్షలమంది రైతులకు రూ.319.36కోట్లు పంపిణీ చేశారు. మేడ్చల్ జిల్లా పరిధిలో 44,792 మంది రైతులకు రూ.39.74కోట్లు రైతులఖాతాల్లో జమ చేశారు. ప్రస్తుతం రైతుభరోసాకు సంబంధించి సర్వే జరుగుతోంది.
RR, MDCL, VKB జిల్లాల వ్యాప్తంగా రైతు భరోసా పథకం అమలు చేసేందుకు ప్రభుత్వ వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గ్రామ గ్రామాల్లో తిరుగుతూ సర్వే నిర్వహిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. జనవరి 20 తేదీ నాటికి సర్వేను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు దారులను సైతం కలిసి వివరాలు సేకరిస్తున్నారు.
త్వరలో చేవెళ్ల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. చేవెళ్లతో పాటుగా పార్టీ మారిన 10 ఎమ్మెల్యేల స్థానాల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతాయని, ప్రజలందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలయ్యేంత వరకు BRS పార్టీ నిర్విరామంగా పోరాడుతుందని KTR అన్నారు. కాగా, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య BRS నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఎవరెన్ని కుట్రలు చేసినా.. ఢిల్లీ పీఠం మాదే అని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం HYDలో బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల అవసరాలు తీర్చడం, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఆప్ ఫెయిల్ అయిందని, ఢిల్లీలో పరిపాలన గాడి తప్పింది. అవినీతి ఆరోపణలతో అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసిన ఢిల్లీలో బీజేపీ విజయం ఖాయం అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ డీకే అరుణ హాట్ కామెంట్స్ చేశారు. నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో ఆమె మాట్లాడుతూ.. KCR పై వ్యతిరేకతతో తప్పి దారిన రేవంత్ సీఎం పీఠంపై కూర్చున్నారు అంతే తప్పా కాంగ్రెస్ పై ప్రేమతో ప్రజలు ఓట్లు వేయలేదని అన్నారు. తెలంగాణలో పథకాల అమలుపై మహారాష్ట్ర, హర్యానాలో చెప్పిన అబద్ధాలనే రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పారని మండిపడ్డారు. ఢిల్లీలో మరోసారి కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదన్నారు.
డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ సార్వతిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ, 2nd, 3rd ఇయర్ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు చెల్లించడానికి చివరితేదీ జనవరి 25 అని విద్యార్థి సేవల విభాగాల అధిపతి డా. వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులు ఇప్పటికే అడ్మిషన్ పొంది సకాలంలో ఫీజు చెల్లించలేకపోయినవారు ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలని కోరారు. సందేహాలుంటే 040-236080222 హెల్ప్ లైన్ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని సూచించారు.
JNTU అఫిలియేటెడ్ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి సంబంధించి అఫిలియేటెడ్ ఆడిట్ సెల్ డైరెక్టర్ తారా కళ్యాణి ఆధ్వర్యంలో వర్సిటీలో ఫ్యాకల్టీలకు ఇంటర్వ్యూలో నిర్వహించారు. ఈనెల 17వ తేదీ నుంచి 20 వరకు ఈ ఇంటర్వ్యూలు కొనసాగుతాయని వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ బాలకిష్టారెడ్డి తెలిపారు. రసాయన, ఆంగ్ల, గణిత శాస్త్ర విభాగానికి సంబంధించి అభ్యర్థులకు వీసీ ఇంటర్వ్యూ నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.