RangaReddy

News November 7, 2024

HYD: డిసెంబర్ నుంచి మహిళా శక్తి వారోత్సవాలు: మంత్రి

image

డిసెంబర్ నుంచి మహిళా శక్తి వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. HYDలో నిర్వహించిన సమావేశంలో అధికారులతో ఆమె చర్చించారు. స్వయం సహాయక సంఘాల్లో ప్రతి మహిళను చేర్పించడమే లక్ష్యంగా ప్రోగ్రాం నిర్వహిస్తామని,పంచాయతీరాజ్, నిర్వహిస్తామని, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల సంస్థలు ఇందులో భాగమని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

News November 7, 2024

HYD: డెడ్‌బాడీకి చికిత్స.. మెడికవర్ వైద్యుల క్లారిటీ

image

మాదాపూర్ మెడికవర్‌లో చికిత్స పొందుతూ మరణించిన జూ. డాక్టర్ నాగ ప్రియ (28) మృతిపై ఆస్పత్రి వైద్యులు వివరణ ఇచ్చారు. ఠాగూర్ సినిమాను తలపించేలా ఆస్పత్రిలో డెడ్ బాడీకి చికిత్స, బాధితుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని మృతదేహాన్ని అప్పగించారంటూ వచ్చిన కథనాలను మెడికవర్ వైద్యులు, యాజమాన్యం ఖండించారు. అడ్మిట్‌కు ముందే పేషెంట్ పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, బతికించేందుకు తీవ్రంగా కృషి చేశామన్నారు.

News November 7, 2024

HYD: ‘డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం సోదరులు

image

రేపు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా HYD బడంగ్‌పేట్ మాజీ వైస్ ఛైర్మన్ చిగురింత నర్సింహా రెడ్డి, యువజన కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గం అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జీవిత చరిత్ర డైనమిక్ లీడర్ పుస్తకాన్ని సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఆయన సోదరులు కృష్ణారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News November 7, 2024

HYD: మత్తువైపు మళ్లుతోన్న యువత..! 

image

HYD సహా ఇతర జిల్లాల్లో గంజాయి, డ్రగ్స్ లాంటి అలవాట్ల వైపు యువత దారి మళ్లుతోంది. ఒక్క అక్టోబర్ నెలలోనే HYD జిల్లాలో దాదాపు 2167 కిలోలు, మేడ్చల్ జిల్లాలో 411 కిలోల గంజాయితో పాటు, హాష్ ఆయిల్, నీట్ ఆయిల్, నల్లమందు, MDMA తదితర మత్తు పదార్థాలు పట్టుబడ్డట్లుగా పోలీసులు తెలిపారు. తాజాగా వాటిని ప్రత్యేక పద్ధతుల్లో దహనం చేసినట్లు పేర్కొన్నారు.

News November 7, 2024

గచ్చిబౌలి: క్రీడా శిక్షణ శిబిరంగా మారునున్న TIMS

image

రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో TIMS ప్రాంగణాన్ని క్రీడాకారుల గురుకుల శిక్షణ శిబిరం, స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సుగా మార్చనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. 2002లో ప్రారంభమైన GMC బాలయోగి స్టేడియం,మళ్లీ క్రీడల కోసం నూతన పుంతలు తొక్కనుంది.

News November 7, 2024

HYD: పూర్తికాని చెరువు హద్దుల ప్రక్రియ.. త్వరలో విచారణ..!

image

HMDA పరిధిలో 3,532 చెరువులు ఉండగా..ఇప్పటి వరకు 2,525 చెరువులకు మాత్రమే ప్రాథమిక హద్దులు నిర్ణయించారు. మిగిలిన 230 చెరువులకు మాత్రం పూర్తి స్థాయి బఫర్ జోన్, FTL నిర్ధారించారు. మిగిలిన చెరువులకు కనీస హద్దుల నిర్ధారణ పూర్తి కాలేదు. మరోవైపు నవంబర్ 2వ వారంలో హైకోర్టులో చెరువుల హద్దులపై విచారణ జరగనుంది. అయితే హద్దుల నిర్ధారణ ప్రక్రియ పూర్తికాక పోవటంతో HMDA హైకోర్టులో చెబుతుందో..! చూడాలి.

News November 7, 2024

HYD: AIIMSలో డెంగ్యూ వ్యాక్సిన్‌పై పరిశోధనలు

image

బ్రెయిన్ ఫీవర్, డెంగ్యూకు త్వరలోనే పరిష్కారం దొరకనుంది. HYD ఘట్కేసర్ శివారులోని బీబీనగర్ AIIMS విశ్వ విద్యాలయంలో వైద్య పరిశోధనలపై ప్రత్యేక దృష్టి సారించామని డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా వివరించారు. వైద్యులు బ్రెయిన్ ఫీవర్, డెంగ్యూ వ్యాక్సిన్‌పై పరిశోధనలు చేస్తున్నారని పేర్కొన్నారు. పరిశోధనల ద్వారా వైద్య విధానంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందని తెలిపారు.

News November 7, 2024

HYD: అడ్వాన్స్ టికెట్ బుకింగ్..ఇది మీకు తెలుసా?

image

రైల్వే టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ 60 రోజుల ముందు చేసుకునే నిర్ణయం తాజాగా అమలులోకి తెచ్చినట్లుగా రైల్వే బోర్డు పేర్కొంది. గతంలో 120 రోజుల వరకు ఉండేదని, అయితే ఎక్కువ శాతం క్యాన్సిలేషన్ జరుగుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని SCR సూచించింది. అయితే విదేశీయులు 365 రోజుల ముందు రైల్వే టికెట్లు బుక్ చేసుకునే విధానంలో ఎలాంటి మార్పు లేదంది.

News November 7, 2024

HYD: సీఎం 2.5 కి.మీ. పాదయాత్ర: ఎంపీ

image

సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లాలో 8వ తేదీన తలపెట్టిన పర్యటనను విజయవంతం చేయాలని పార్లమెంటు ప్రజలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. బొల్లెపల్లి సంఘం బ్రిడ్జిపై సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎం, భీమ లింగాన్ని దర్శించుకుని ధర్మారెడ్డి కాలువ వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల పాదయాత్ర చేసేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు.

News November 7, 2024

HYD: నూతన సంవత్సరంలో ప్రజల్లోకి కేసీఆర్

image

నూతన సంవత్సరం జనవరిలో కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వంపై కొట్లాడడానికి ప్రజల్లోకి వెళ్లనున్నట్లు వివరించారు. కొత్త ఏడాది నూతన కమిటీలు ఏర్పాటు చేసి పార్టీ మారిన 10మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించనున్నారు. యువతకు అవకాశాలు ఇచ్చి.. పార్టీని మరింత బలోపేతం చేయనున్నారని సమాచారం.