India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD రెండో దశ మెట్రో DPR కేంద్రం వద్దకు చేరింది. రూ.24,269 కోట్లతో 76.4KM మేర 5 కారిడార్లలో మెట్రో రెండోదశ నిర్మాణం జరగనుంది. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్(DPR)కేంద్రం అనుమతికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. దీనితో పాటు HMDA పరిధిలోని కాంప్రహెన్సీవ్ మొబిలిటీ ప్లాన్, ట్రాఫిక్ అధ్యయన నివేదికన జత చేసి పంపినట్లు పేర్కొంది.
నాచారంలోని ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఆధునికరిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్‌లో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఫుడ్ సేఫ్టీ విభాగంతో మంత్రి మాట్లాడారు. తనిఖీలను మరింత ముమ్మరం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
HYD మహానగరంలో సీఆర్ఎంపీ విధానంలో భాగంగా రూ.1,839 కోట్ల అంచనా వ్యయంతో 812 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారుల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఐదేళ్ల కాల వ్యవధికి GHMC గంతంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. 2024 డిసెంబర్ నాటికి ఈ కాలం గడువు ముగియనుంది. గడువు ముగిసిన తర్వాత జిహెచ్ఎంసీతో మరోసారి చర్చలు జరగనున్నట్లు సమాచారం.
నేడు బెంగళూరుకు హైడ్రా బృందం వెళ్లనుంది. బెంగళూరులో 2 రోజులపాటు హైడ్రా బృందం పర్యటించనుంది. బెంగళూరులో చెరువుల పునరుజ్జీవంపై క్షేత్రస్థాయిలో స్థితిగతులను అధ్యయనం చేసి, మురుగు నీటిని స్వచ్ఛంగా మార్చడం, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో అనుసరించిన విధానాలను తెలుసుకునేందుకు కమిషనర్ రంగనాథ్ సారథ్యంలో హైడ్రా బృందం పర్యటించనుంది.
జూబ్లీహిల్స్, వెంగళరావునగర్ డివిజన్ మధురానగర్‌లోని ఆంజనేయ స్వామి ఆలయానికి శ్రీదేవి కుమార్తె, దేవర ఫేమ్ జాన్వీ కపూర్ వచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు అర గంటపాటు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న అభిమానులు భారీగా గుడి వద్దకు చేరుకున్నారు. స్థానికులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. కాసేపు అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
HYD నగర ప్రజలకు మంచి నీటి సమస్య రాకుండా జలమండలి చర్యలు చేపడుతోంది. గండిపేట కాండ్యూట్ లీకేజీలతో 8ఎంజీడీ (30 లక్షల లీటర్లు) నీరు వృథా అవుతుందని గుర్తించిన అధికారులు, గ్రౌటింగ్ పద్ధతిలో కెమికల్ ట్రీట్మెంట్ టెక్నాలజీ ఉపయోగించి నీటి సరఫరాకు అంతరాయం కలిగించకుండా మరమ్మతులు చేస్తున్నారు. ఈ లీకేజీలు దాదాపు 14.5 కిలోమీటర్ల పొడవున ఉన్నట్లు గుర్తించామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.
HYD శివారులో RRR దక్షిణ భాగంపై రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అలైన్మెంట్ సహా ఇతర అన్ని పనుల పర్యవేక్షణ కోసం త్వరలో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. RRR దక్షిణ భాగాన్ని తన ఆధ్వర్యంలోనే నిర్మించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేక IAS అధికారులతో ఉన్నత స్థాయి కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసింది.
18 ఏళ్లు నిండి, ఇప్పటికీ ఓటు హక్కు లేని వారు వెంటనే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని CEO సుదర్శన్ రెడ్డి సూచించారు. నవంబర్ 28 వరకు నూతన ఓటరు దరఖాస్తు, మార్పు చేర్పులకు అవకాశం ఉందన్నారు. జనవరి 6న SSR-2025 విడుదల చేస్తామన్నారు. తాజాగా హైదరాబాద్‌లో-1,81,875, రంగారెడ్డి-1,18,513, మేడ్చల్ మల్కాజిగిరి-99,696 మంది నూతన ఓటర్లు కొత్తగా నమోదయినట్లుగా పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఈసారి 24 శాతం సైబర్ నేరాలు పెరిగాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో వార్షిక సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బాగా చదువుకున్న వారే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారని చెప్పారు. 36 రకాల సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయన్నారు. దాదాపు రూ.36 కోట్లను బాధితులకు తిరిగి ఇచ్చామని, ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ ఆందోళన కలిగిస్తోందన్నారు.
శంకర్‌పల్లి పరిధి సింగాపురంలో నూతనంగా నిర్మించిన మరకత కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయస్వామి శిఖర ధ్వజ విగ్రహనాభిషీల (బొడ్రాయి) ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి భీమ్ భరత్, జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.