RangaReddy

News August 3, 2024

తిరుగులేని నగరంగా మారనున్న హైదరాబాద్!

image

HYD త్వరలో తిరుగులేని నగరంగా మారుతుందా అంటే నిపుణులు అవుననే చెబుతున్నారు. నగర శివారులో 200 ఎకరాల్లో AI సిటీ, 100 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ, 100 ఎకరాల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, హెల్త్ హబ్, ఫార్మా విలేజెస్, మూసి ప్రక్షాళన, 800 ఎకరాల్లో టెక్స్ టైల్ వెల్ స్పన్, 300 ఎకరాల్లో కైటెక్స్, 250 ఎకరాల్లో ఫాక్స్ కాన్, 15 ఎకరాల్లో ఒలెక్ట్రా లాంటి భారీ కంపెనీల ఏర్పాటు పూర్తైతే HYDకు తిరుగు లేదంటున్నారు.

News August 3, 2024

సగానికి పైగా గంజాయి, డ్రగ్స్ కేసులు HYD నగరంలోనే!

image

విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ వంటివి యువతకు చేరడం, అర్థరాత్రిళ్లూ మద్యం అమ్మకాలు నేరాలకు కారణమవుతున్నాయి. మూడు కమిషనరేట్లలో మాదకద్రవ్యాలను అడ్డుకుంటున్నా ఏదో ఒక రూపంలో చేరుతున్నాయి. టీజీన్యాబ్ ఈ ఏడాది ఇప్పటి వరకూ 788 కేసుల్లో 1580 మందిని అరెస్టు చేసి రూ.74 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకుంది. ఇందులో సగానికి పైగా రాజధాని HYD పరిధిలో స్వాధీనం చేసుకున్నవే కావడం గమనార్హం.

News August 3, 2024

GHMC: 225 బస్తీ దవాఖానల్లో ఉచిత పరీక్షలు

image

ముందస్తు జాగ్రత్తలతో డెంగ్యూ, మలేరియా, ఇతర వ్యాధులను కట్టడి చేయగలమని HYD నగరంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగూ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. నగరంలోని 225 బస్తీ దవాఖానాల్లో జ్వరాలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. నీరసం, జ్వరం వంటి సమస్యలు ఉన్నవారు బస్తీ దవాఖానల్లో చూపించుకోవాలని సూచించారు.

News August 3, 2024

HYD: BRS ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకోవాలి: దానం

image

BRS ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకోవాలని ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ అన్నారు. MLA క్వార్టర్స్‌లో ఈరోజు CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిన్న అసెంబ్లీలో BRS వాళ్లు కావాలనే తనను టార్గెట్ చేశారని, HYD అభివృద్ధిపై మాట్లాడనీయలేదన్నారు. సీఎంను, తనను కించపరిచారని, అందుకే సహనం కోల్పోయి అలా మాట్లాడానని, క్షమాపణ చెప్పానని పేర్కొన్నారు. పదేళ్లలో ఏనాడూ తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాలేదన్నారు.

News August 3, 2024

HYD: యూనివర్సిటీలో 85 శాతం సీట్లు తెలంగాణ వారికే!

image

HYD మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఈ విద్యాసంవత్సరం 2024-25 నుంచి 85% సీట్లు తెలంగాణ స్థానికత ఉన్నవారికే కేటాయించనున్నట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ రమేష్ బాబు తెలిపారు. తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇది అమలులోకి వచ్చిందని తెలిపారు. 15% అన్ రిజర్వుడ్‌గా ఉంటుందని పేర్కొన్నారు.

News August 3, 2024

HYD: హెరిటేజ్ భవనంగా ఉస్మానియా ఆసుపత్రి

image

సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా హాస్పిటల్‌ను గోషామహల్‌లోని పోలీస్ క్వార్టర్స్‌కు తరలిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాత ఉస్మానియా భవనాన్ని హెరిటేజ్ భవనంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు. కాగా, ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారని పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

News August 3, 2024

గాంధీ జిరియాట్రిక్ విభాగానికి నాలుగు పీజీ సీట్లు మంజూరు

image

గాంధీ ఆసుపత్రి జిరియాట్రిక్​ వైద్య విభాగానికి నాలుగు పీజీ సీట్లు మంజూరు చేస్తూ నేషనల్​ మెడికల్ కౌన్సిల్(NMC) ఉత్తర్వులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ర్టంలో ఇప్పటికే నిమ్స్​, ఉస్మానియా ఆసుపత్రుల్లో జిరియాట్రిక్​ వార్డులుండగా, ఇటీవల గాంధీ ఆసుపత్రిలో వయో వృద్ధులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడానికి గాంధీ మెయిన్​ బిల్డింగ్​ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఈ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు.

News August 3, 2024

HYD: రెండేళ్లలోపే పూర్తి చేస్తాం: మంత్రి

image

HYD నగరం సహా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. HYD టీమ్స్ ఆసుపత్రులను 14 అంతస్తులకే పరిమితం చేస్తామని, ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాల హాస్టల్స్ భవనాలను రెండేళ్లలోపే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక ప్రణాళికతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు.

News August 3, 2024

RR: హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటుకు ముందడుగు!

image

సీఎం ఆదేశాల మేరకు హెల్త్ టూరిజం హబ్ నిర్మించడం కోసం RR జిల్లాలోని షాబాద్, శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని ప్రభుత్వ భూములను అధికారులు పరిశీలిస్తున్నారు. దాదాపు 500 నుంచి 1000 ఎకరాలు ఉంటే బాగుంటుందని ప్లాన్ చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నెలకొల్పనున్న పరిశ్రమలు, ఐటి, ఫార్మా విలేజెస్ అంశాలను సైతం అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు.

News August 3, 2024

HYD: జ్వరాలొస్తున్నాయ్.. జాగ్రత్త!

image

వాతావరణంలోని మార్పుల కారణంగా భాగ్యనగర ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఈక్రమంలోనే సాధారణంగా HYD ఫీవర్ ఆస్పత్రిలో 100-200 ఓపీ కేసులు నమోదవుతాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 300 నుంచి 600కు చేరింది. జులై నెల మొదటి 19 రోజుల్లోనే 7089 ఓపీలు, 54 డెంగ్యూ కేసులు, 108 డిఫ్తీరియా కేసులు నమోదైనట్లు రిపోర్ట్ విడుదల చేశారు. 4 రోజులకు మించి జ్వరం ఉంటే అశ్రద్ధ చేయొద్దని వైద్యులు చెబుతున్నారు.