India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. బైక్ నడిపే వారిపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. దీనికి నేటి నుంచి స్పెషల్‌డ్రైవ్ నిర్వహించనున్నారు. 3 రోజులుగా జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారని, ఇందుకు హెల్మెట్ లేకపోవడమే కారణమని సిటీ ట్రాఫిక్ చీఫ్ విశ్వ ప్రసాద్ తెలిపారు. హెల్మెట్ లేకపోతే రూ.200, రాంగ్ రూట్లో వెళితే రూ.2వేలు చలానా విధిస్తామన్నారు.
డబుల్ బెడ్ రూం ఇళ్లతో పాటు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ దరఖాస్తులు, రెవెన్యూ అంశాల పరిష్కారానికి వేగవంతంగా చర్యలు చేపట్టాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆర్డీఓలు, తహశీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ధ్రువీకరణ పత్రాలు సత్వరమే అందించాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ప్రారంభంలో గ్రేటర్ HYDలో DEC-28 నుంచి JAN-6వ తేదీ వరకు తొలి విడతగా ప్రజాపాలన ప్రోగ్రాం నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.ప్రతి 4 నెలలకోసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పినప్పటికీ, అది సాధ్యం కాలేదు. దీంతో మొదటి విడతలో దరఖాస్తు చేసుకొని వారు ఉప్పల్, మల్కాజ్‌గిరి సహా GHMC సర్కిల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
HYD నగర శివారు మంచిరేవుల వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో మిడ్ కెరీర్ ట్రైనింగ్ ప్రోగ్రాంను డీజీపీ జితేందర్ ప్రారంభించారు. ఫేజ్-4 ప్రోగ్రాం అద్భుతంగా జరుగుతుందన్నారు. నేర్చుకోవడంలో ఉన్న ఆత్మ సంతృప్తి ఎందులో దొరకదని DGP అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్ అధికారులు సైతం పాల్గొన్నారు.
HYD నగర శివారులో రానున్న ఆర్ఆర్ఆర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ కన్సల్టెన్సీలతో మెగా మాస్టర్ ప్లాన్-2050 తయారు చేస్తోంది. దాదాపు 12 వేల చదరపు కిలోమీటర్ల మేర మొబిలిటీ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. నివాస ప్రాంతాలపై అధికారులు దృష్టి సారించారు. 2050 నాటికి నగరంలో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక ప్రణాళిక సైతం తయారు చేస్తున్నట్లు వారు తెలిపారు.
గ్రేటర్ HYDలో మ్యాన్ హోళ్ల క్లీనింగ్ డ్రైవ్‌పై విస్తు పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మ్యాన్ హోళ్లలో బ్లేడ్లు, ప్యాంపర్లు, క్లాత్, ప్లాస్టిక్ కవర్లు, సానిటరీ ప్యాడ్లు ప్రమాదకర గుండు సూదులు, మొక్కలు బయటపడ్డాయి. కార్మికులు తీవ్ర అవస్థలు పడుతూ క్లీనింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటితోనే నాలాల పైపులు పదేపదే జాం అవుతున్నట్లు తెలుస్తోంది. వీటిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిందే..!
వాష్ రూమ్‌కు వెళ్లిన 20 ఏళ్ల యువతిపై మార్ట్ సూపర్‌వైజర్ ఖాజాబషీర్ (35) అత్యాచారం చేసిన దారుణ ఘటన HYD ఘట్కేసర్ పీఎస్ పరిధిలో జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. ఈ ఘటన నెల క్రితం జరిగింది. యువతి ఇటీవల కళ్లు తిరిగి పడిపోవడంతో పరీక్షలు నిర్వహించగా గర్భం దాల్చినట్లు తేలింది. యువతిని నిందితుడు బెదిరించడంతో ఎవరికీ చెప్పలేదు. పోలీసులు కేసు నమోదు చేసి బషీర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
చెరువుల పునరుద్ధరణపై అధ్యయనానికి హైడ్రా బృందం బెంగళూరుకు స్టడీ టూర్ వెళ్లనుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సహా మరి కొంతమంది ఇందులో పాల్గొననున్నారు. అక్కడచెరువుల పునరుజ్జీవం ఎలా జరిగిందో స్టడీ చేస్తారు. ఈ టూర్ అనంతరం ఇక్కడకు వచ్చి బాచుపల్లిలోని ఎర్రకుంటచెరువు, మాదాపూర్ సున్నంచెరువు, కూకట్‌పల్లిలోని నల్లచెరువు, రాజేంద్రనగర్‌లోని అప్పా చెరువుల పునరుద్ధరణ చేపడతారు.
మన హైదరాబాద్‌ను జీహెచ్ఎంసీ మరింత అందంగా ముస్తాబుచేస్తోంది. బల్దియా పరిధిలోని అన్ని జంక్షన్లను సుందరీకరిస్తున్నారు. ఎల్బీనగర్, బషీర్‌బాగ్, ఖైరతాబాద్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డినగర్‌తో పాటు ఇతర ఏరియాల్లోని ఫ్లై ఓవర్లు, జంక్షన్ల వద్ద రంగు రంగుల బొమ్మలు గీస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఈ చిత్రాలు వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి.
హైదరాబాద్‌లోని సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న మెహ్ ఫిల్ రెస్టారెంట్లో స్విగ్గి ద్వారా అనిరుద్ అనే వ్యక్తి చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రై, తదితర ఆర్డర్ చేయగా.. చికెన్ ఫ్రైలో పురుగు వచ్చిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీకి ఫిర్యాదు అందించగా, యంత్రాంగం కదిలింది. పూర్తిగా తనిఖీలు చేపట్టిన అధికారులు, అసురక్షిత ఆహార పదార్థాలను గమనించి, టెస్టింగ్ కోసం శాంపిల్స్ సేకరించారు. దీనిపై కోర్టులో కేసు వేస్తామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.