RangaReddy

News August 1, 2024

వెజ్ ఆర్డర్లలో HYDకు మూడో స్థానం

image

శాఖాహార వంటల ఆర్డర్లలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచిందని స్విగ్గీ ప్రకటించింది. మసాలా దోశ, ఇడ్లీలను హైదరాబాదీలు ఎక్కువమంది ఇష్టపడుతున్నారని తెలిపింది. దేశంలో అత్యధికంగా ఆర్డర్ అవుతున్న 10 వంటకాల్లో 6 శాఖాహారం వంటకాలు ఉన్నాయని పేర్కొంది. తొలి రెండు స్థానాల్లో బెంగళూరు, ముంబై నగరాలు నిలిచాయి.

News August 1, 2024

HYD నగరవాసులకు BIG ALERT

image

ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సులభతరం చేసేందుకు ప్రభుత్వం GHMC ప్రజాపాలన సేవాకేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి సమాచారం, అప్లికేషన్ స్టేటస్ కోసం 6 జోన్లలోని 30 సర్కిళ్లలో 150 వార్డుల్లో కేంద్రాల్లో సంప్రదించేలా వీటిని తీసుకొచ్చింది. అంతేకాకుండా ఇటీవల సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని, సందేహాలకు నగర ప్రజలు ఏ సేవాకేంద్రంలో అయినా సంప్రదించవచ్చని తెలిపింది.

News July 31, 2024

HYD: వనస్థలిపురంలోని హోటల్‌లో అత్యాచారం.. ఒకరు అరెస్ట్

image

వనస్థలిపురంలోని ఓ హోటల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు యువకుల్లో గౌతమ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుడు శివాజీ రెడ్డి పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

News July 31, 2024

హైదరాబాద్‌: పంజాగుట్టలో ACB రైడ్స్

image

నగరంలోని పంజాగుట్ట సర్కిల్ ప్రాంతంలో ACB అధికారులు రైడ్స్ చేశారు. పంజాగుట్ట సర్కిల్ వన్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ.2,00,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఫైనల్ ఆడిట్ క్లియర్ చేసేందుకు డబ్బులు అడిగినట్లు ఫిర్యాదు రావడంతో‌ రైడ్స్ చేసినట్లు వెల్లడించారు.

News July 31, 2024

HYD: రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం: BRS నేత

image

మహేశ్వరం MLA, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి బతుకు బస్టాండ్ అంటూ అసెంబ్లీలో అగౌరవపరిచేలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని BRS సీనియర్ నేత, ఆ పార్టీ మీర్‌పేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. సీఎం మాటలకు నిరసనగా రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని ఆయన నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి భవిష్యత్తు మరిచి మాట్లాడటం సరికాదన్నారు.

News July 31, 2024

HYD: విద్యార్థిని వేణుశ్రీ మృతి

image

HYD చైతన్యపురి PS పరిధిలో ఇటీవల <<13674948>>శ్రీ చైతన్య విద్యార్థిని<<>> వేణుశ్రీ (16) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. కాగా చికిత్స పొందుతున్న ఆమె మృతి చెందిందని పోలీసులు తెలిపారు. ఈనెల 20న వేణుశ్రీ ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించగా మలక్‌పేటలోని ఓ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో రాత్రి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టమ్ అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

News July 31, 2024

HYD: కొడుకు వదిలేసినా.. కడుపుతీపి చంపుకోలేదు!

image

తల్లికి జబ్బు చేస్తే సేవచేయాల్సిన కుమారుడు రోడ్డుపై వదిలేసిన ఘటన మేడ్చల్ పరిధిలో జరిగింది. స్థానికంగా నివసించే అరవింద్ తన తల్లి అనారోగ్యంతో ఉంటే ఆస్పత్రికి తీసుకెళ్తానని బోయిన్‌పల్లిలో ఓ ఫుట్‌పాత్‌పై వదిలేశాడు. ఆ తల్లి స్పృహతప్పి పడిపోగా పోలీసులు గాంధీకి తరలించారు. కర్కశంగా ప్రవర్తించినా కడుపు తీపి చంపుకోలేక చనిపోయే ముందు కొడుకునే చూడాలనుకుంది. ఘటన స్థానికులను కంట తడిపెట్టించింది.

News July 31, 2024

HYD: బ్యాంకులో భారీ స్కామ్.. మేనేజర్ ARREST

image

శంషాబాద్ ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో రూ.40 కోట్ల స్కామ్‌ జరిగిన విషయం తెలిసిందే! ఈ భారీ స్కామ్‌లో బ్యాంక్ మేనేజర్ రామస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో బ్యాంకు ఉద్యోగి రాజేశ్‌తో కలిసి రూ.40 కోట్లు స్వాహా చేశారు. సినీ నిర్మాత షేక్ బషీద్‌కు మేనేజర్ రూ.40కోట్లు బదిలీ చేశాడు. అక్కడినుంచి మరికొన్ని అకౌంట్లకు సొమ్ము ట్రాన్స్‌ఫర్ అయినట్లు తేలింది.

News July 31, 2024

నేడు HYDకు నూతన గవర్నర్

image

తెలంగాణ కొత్త గవర్నర్ మధ్యాహ్నం 2గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలకుతారు. సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు, బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

News July 31, 2024

RR: వ్యవసాయ పనుల్లో రైతన్నలు బిజీ.. బిజీ!

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రైతన్నలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు నాట్లు వేస్తున్నారు. రైతన్నలు వ్యవసాయ పొలంలో బిజీ.. బిజీగా గడుపుతున్నారు. దుక్కులు సిద్ధం చేయడంతో పాటు కంది, జొన్న పంటలకు రైతులు కలుపుతీత, ఎరువులు వేస్తున్నారు. విత్తనాల కోసం రైతులు ఫర్టిలైజర్ దుకాణాలకు పరుగులు తీస్తున్నారు.