RangaReddy

News November 3, 2024

RR: రైతులకు గుడ్ న్యూస్.. వారికి FREE

image

RR, MDCL,VKB జిల్లాలోని రైతులకు ఎలక్ట్రిసిటీ అధికారులు ఓ గుడ్ న్యూస్ తెలిపారు. రైతులు పొలం వద్ద వ్యవసాయ మోటార్ ఉన్న స్థలంలో వెలుగు కోసం 15 వాట్ల సామర్థ్యం ఉన్న ఒక లైట్, లేదా 5 వాట్ల సామర్థ్యం ఉన్న మూడు లైట్లు వాడుకోవచ్చని ERC తెలిపింది. వీటిని వ్యవసాయానికి ఇచ్చే ఉచిత కరెంటు కిందనే పరిగణించాలని డిస్కంలకు వెల్లడించినట్లు పేర్కొంది.

News November 3, 2024

HYD: సికింద్రాబాద్-వాడి మధ్య..రూ.4453 కోట్లతో!

image

HYD నగరం సికింద్రాబాద్ నుంచి వాడి వెళ్లేందుకు ప్రస్తుతం 2 లైన్లుగా ఉన్న 194 కిలోమీటర్ల రైల్వే లైన్ 4 లైన్లుగా మార్చడం కోసం యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే DPR(డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం చేసి, రైల్వే బోర్డుకు అందించారు. ప్రాజెక్టుకు రూ.4453 కోట్లు అవుతుందని అంచనా వేశారు. బోర్డు పచ్చజెండా ఊపితే,ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ప్రాజెక్టు మంజూరు కానుంది.

News November 3, 2024

HYD: త్వరలో ఉప ముఖ్యమంత్రి బస్సు యాత్ర

image

త్వరలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బస్సు యాత్ర చేపట్టనున్నారు. డిసెంబర్ లేదా జనవరిలో తెలంగాణాలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన నేపథ్యంలో 2023లో చేసిన పాదయాత్రలో తాను పర్యటించిన ప్రదేశాలను తిరిగి సందర్శించి.. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారమయ్యాయో లేదో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలుసుకొనున్నారు.

News November 3, 2024

HYD: త్వరలో ఫుడ్ సేఫ్టీ మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్!

image

HYDలో షవర్మా ఘటనలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల మయోనైజ్‌పై ఏడాది పాటు నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్, మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఒకే గొడుగు ఎందుకు తీసుకువచ్చి డ్రగ్స్ అథారిటీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల కార్యాలయాలు కలెక్టరేట్లో ఏర్పాటు చేస్తామన్నారు.

News November 3, 2024

ఎయిర్పోర్టులో కలిసిన తెలుగు రాష్ట్రాల స్పీకర్‌లు

image

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగే 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్(CPA) కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వెళ్తూ ఎయిర్పోర్ట్ లాంజ్‌లో తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కలుసుకున్నారు. వీరితో పాటు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, లేజిస్లేచర్ సెక్రస్లేచర్ సెక్రటరీ డా.వి.నరసింహా చార్యులు ఉన్నారు.

News November 3, 2024

HYD: వామ్మో.. చికెన్ ఫ్రైలో పురుగు!

image

ఆర్డర్ చేసిన ఫుడ్‌లో పురుగు రావడంతో ఓ వ్యక్తి అవాక్కయ్యాడు. బాధితుడి ప్రకారం.. హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ నుంచి ఓ వ్యక్తి స్విగ్గిలో చికెన్ ఫ్రై, చికెన్ న్యూడిల్స్, మెజెస్టిక్స్ ఆర్డర్ చేశారు. ఆర్డర్ ఓపెన్ చేసి తింటుండగా పురుగు రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఇంత పెద్ద రెస్టారెంట్లో ఇదా పరిస్థితి? అంటూ GHMC ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు చేపట్టాలని అనిరుద్ అనే వ్యక్తి కోరాడు.

News November 3, 2024

HYD: డ్రగ్స్ దందాల్లో నైజీరియన్ల హస్తం!

image

గత మూడేళ్లలో డ్రగ్స్ సరఫరా కేసుల్లో 31 మంది విదేశీయులను HYD నగర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో అధిక శాతం నైజీరియన్లే గోవా, ముంబై, బెంగళూరు నుంచి HYD నగరానికి కొకైన్, హెరాయిన్ చేరవేస్తున్న 10 మంది డ్రగ్ డ్రాగన్లను పోలీసులు కట్టడి చేశారు. నైజీరియన్లు హైదరాబాద్లో బంజారాహిల్స్, టోలిచౌకి, బండ్లగూడ జాగిర్, బాలాపూర్, బర్కాస్, మాసబ్ ట్యాంక్, సికింద్రాబాద్లో మకాం వేసినట్లు తేలింది.

News November 3, 2024

ఎల్బీనగర్: సైబర్ నేరాలకు సెంటర్ పాయింట్ ఆ దేశాలే!

image

సింగపూర్, కంబోడియా, థాయిలాండ్, చైనా తదితర దేశాల కేంద్రంగా హైదరాబాద్‌లో నేరగాళ్లు సైబర్ మోసాలు చేస్తున్నారు. సైదాబాద్, ఎల్బీనగర్, పాతబస్తీ, చార్మినార్ సహా అనేక ప్రాంతాల్లో ప్రజలు సైబర్ మోసాలకు బలయ్యారు. పెట్టుబడులు, పార్ట్ టైం ఉద్యోగాలు, ఫెడెక్స్ మాయలతో కొట్టేసిన డబ్బు, సొమ్మును నిల్వ ఉంచేందుకు ఇండియన్ ఖాతాలు ఉపయోగిస్తున్నట్లు HYD పోలీసులు గుర్తించారు.

News November 3, 2024

HYD: IIITHలో పార్ట్ టైం MS చేసే ఛాన్స్!

image

HYD నగరం గచ్చిబౌలిలోని IIITHలో పార్ట్ టైం MS రీసర్చ్ ప్రోగ్రాం చేసేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వింటర్ బ్యాచ్ 2025 JANలో ఈ ప్రోగ్రాం ప్రారంభం కానుండగా సైన్స్, ఇంజినీరింగ్2లో టెక్నికల్ ప్రొఫెషనల్ డిగ్రీ+1సం. EXP ఉన్న వారికి ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఇండస్ట్రీ MS ప్రోగ్రాంలో అత్యధికంగా ప్రాజెక్టు వర్క్ పై ఫోకస్ పెట్టారు. మిగతా వివరాలకు outreach.iiit.ac.in/industryms సంప్రదించాలన్నారు.

News November 3, 2024

HYD: 100 రోజులన్నారు.. 300 రోజులైంది: హరీశ్ రావు

image

ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల అమలు విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలతో పాటు దేశాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉద్యోగ నియామకాల అంశంలో సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన తర్వాత సాధించిన ప్రగతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ట్యాగ్‌ చేస్తూ సీఎం రేవంత్‌ శనివారం ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు.