India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ శుభవార్త తెలిపింది. HYD నగరంలో మరో స్కైవాక్ అందుబాటులోకి రానుంది. పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ సమీపంలో కొత్తగా స్కైవాక్ నిర్మించనున్నారు. మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఆ ప్రాంతంలో ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ స్కైవాక్ నిర్మించనుంది.
సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసులో న్యాయస్థానం నిందితుడికి రిమాండ్ విధించింది. ప్రధాన నిందితుడైన సల్మాన్ సలీంకు 14 రోజులు రిమాండ్ విధించడంతో అతడిని చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసు విచారణను సిట్‌కు బదిలీ చేయగా ఈ ఘటనపై సిట్ 3 కేసులను నమోదు చేసింది.
HYD ఘట్‌కేసర్ పరిధిలో యువతిపై అత్యాచారం జరిగింది. సీఐ పి.పరశురాం తెలిపిన వివరాలు.. ఓ మార్ట్‌లో పని చేసే యువతిపై కజా బషీర్ (35) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట పెడితే చంపుతానని ఆమెను బెదిరించాడు. ఈ క్రమంలో బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పడంతో ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ముషీరాబాద్‌లో గోలు టూ దున్నరాజు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని BRS నేత ఎడ్ల హరిబాబు యాదవ్ తెలిపారు. నారాయణగూడ సదర్ సమ్మేళనంలో ఈ దున్నరాజుని ప్రదర్శించనున్నారు. గోలు టూ 7 అడుగులకు పైగా ఎత్తు, 14 అడుగుల పొడవు, 2 వేల కిలోల బరువుతో భారీ ఆకారంలో ఉంది. సాయంత్రం ముషీరాబాద్ నుంచి నారాయణగూడ వరకు ర్యాలీగా వెళ్తారు. అక్కడి యాదవ సోదరులతో ‘అలయ్.. బలయ్’ తీసుకోనున్నట్లు హరిబాబు యాదవ్ తెలిపారు.
డా. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరడానికి నవంబరు 15 వరకు గడువు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. వర్సిటీలో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజు, అంతకు ముందు వర్సిటీలో చేరి ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు సైతం నవంబరు 15వ తేదీలోపు ట్యూషన్ ఫీజును www.braou.ac.in ఆన్‌లైన్‌లో చెల్లించాలని పేర్కొన్నారు.
గ్రేటర్ HYDలో సకుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. ఈ సర్వేలో గ్రేటర్ వ్యాప్తంగా 21 వేల ఎన్యుమరేటర్లు, రిసోర్స్ పర్సన్లు, సూపర్‌వైజర్లు పాల్గొంటారని మున్సిపల్ & అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్ గౌరీ శంకర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు.ఈ నెల 6 నుంచి సర్వే ప్రారంభం కానుండగా.. 100 శాతం ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఆదేశించారు.
HYD NIMSలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఉచిత స్క్రీనింగ్ క్యాంపును నిర్వహిస్తోంది. శుక్రవారం ప్రారంభమైన ఈ క్యాంపు నవంబర్ 9వ తేదీ వరకు కొనసాగుతుంది. పిల్లలలో ఉన్న లోపాలను గుర్తించి, అవసరమైన వారికి సర్జరీలు చేయనున్నట్లు NIMS డైరెక్టర్ డా. నగరి బీరప్ప, ప్లాస్టిక్ సర్జరీ HOD డా.పార్వతి తెలిపారు. CMRF, LOC, ఆరోగ్య శ్రీ, PMRF కింద ఈ ఆపరేషన్లు చేయనున్నారు.
SHARE IT
సదర్‌కు HYD ముస్తాబైంది. సా. 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నగర వీధుల్లో దున్నరాజుల భారీ ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ‘బహుబలి’ (హరియాణా) దున్నరాజు ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రాత్రి నారాయణగూడ సెంటర్‌కు నగర నలువైపుల నుంచి యాదవ సోదరులు వేలాదిగా తరలివస్తారు. YMCAలో జరిగే ఈ వేడుకను హైదరాబాదీలు పెద్ద సదర్‌గా పిలుచుకుంటారు. అధికారికంగా సదర్ అని ప్రభుత్వం ప్రకటించడంతో అంచనాలు మరింత పెంచింది.
దీపావళి,ఛత్ పండగల వేళ 7,296 స్పెషల్ రైళ్లను నడిపిస్తూ ఇండియన్ రైల్వేస్ రికార్డు సృష్టించింది.గత ఏడాది ఇండియన్ రైల్వేస్ 4500 స్పెషల్ ట్రైన్లు నడిపించగా, ఈ సారి ఏకంగా 7,296 స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు పేర్కొంది. ఇంకోవైపు SCR సౌత్ సెంట్రల్ రైల్వే గత ఏడాది 626 స్పెషల్ రైళ్లు నడపగా..ఈసారి రికార్డ్ స్థాయిలో 854 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు పేర్కొంది. ఇందుకు రద్దీ పెరగటమే కారణమంది.
HYD నగరంలో కల్తీ మహమ్మారి ప్రజలను భయపెడుతోంది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ కమిషన్, FSSAI అధికారులు కల్తీ పాలను గుర్తించే విధానాన్ని వివరించారు.చల్లార్చిన పాలలో 2-3 చుక్కల అయోడిన్ టింక్చర్ కలపాలి. కాసేపటి తర్వాత పాలు నీలిరంగు కలర్‌లో మారితే కల్తీ జరిగినట్లని గుర్తించాలి. పన్నీర్ లాంటి ఇతర పాల ఉత్పత్తుల టెస్టింగ్లో 2-3ML శాంపిల్లో 5ML నీటిని కలిపి కాచి చల్లార్చి, 2-3 చుక్కల అయోడిన్ టింక్చర్ కలపాలన్నారు.
Sorry, no posts matched your criteria.