RangaReddy

News September 6, 2025

బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర రూట్ ఇదే..!

image

HYDలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రధాన రూట్‌ను పోలీసులు ప్రకటించారు. బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రాసెషన్ కట్ట మైసమ్మ ఆలయం, కేశవగిరి, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి, అలియాబాద్, చార్మినార్, అఫ్జల్‌గంజ్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ మార్గాలుగా సాగి అంబేద్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్, పీవీ ఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) వద్దకు చేరుకోనుందని అధికారులు తెలిపారు.

News September 5, 2025

ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న మహేశ్‌గౌడ్

image

ఖైరతాబాద్ బడా గణేశ్‌ను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుడి ఆశీర్వాదం పొందారు. అనంతరం ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి నాయకులు, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ఆయనను సత్కరించి విఘ్నేశ్వరుడి ప్రతిమను బహుకరించారు.

News September 4, 2025

వ్యవసాయ వర్సిటీకి 24వ ర్యాంక్

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎన్‌ఐఆర్‌ఎఫ్- 2025 ర్యాంకింగ్స్‌లో దేశంలోనే 24వ స్థానంలో నిలిచింది. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ నివేదికలో వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల పనితీరును పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి అల్దాస్ జానయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఈ ర్యాంక్ సాధించడం తమ కృషికి నిదర్శనమని తెలిపారు.

News September 3, 2025

జూబ్లీహిల్స్ ముసాయిదా ఓటర్ లిస్ట్ రిలీజ్

image

జూబ్లీహిల్స్ ఓటరు ముసాయిదా జాబితాను జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ విడుదల చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉండగా వారిలో.. పురుషులు 2,04,228, మహిళలు 1,88,356, ఇతరులు 25 ఉన్నారన్నారు. సెప్టెంబర్ 17 వరకు అభ్యంతరాల స్వీకరణ, మార్పులు చేర్పులు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉంటుందని, సెప్టెంబర్ 30న జాబితా విడుదల చేస్తామని స్పష్టంచేశారు.

News September 2, 2025

లండన్‌లో యాక్సిడెంట్.. HYD వాసులు మృతి

image

లండన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో HYDకు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను నాదరుల్ చెందిన తర్రె చైతన్య (22), ఉప్పల్‌కు చెందిన రిషితేజ (21)గా పోలీసులు గుర్తించారు. గణేశ్ నిమజ్జనం చేసి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.

News September 2, 2025

HYD: నేరాలు నివారించడానికి నిఘా: సీపీ

image

ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని HYD సీపీ సీవీ ఆనంద్ అన్నారు. మధురానగర్ PSలో గణేశ్ నిమజ్జన బందోబస్తుపై పోలీసులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక శక్తులు, పిక్ పాకెటింగ్, ఈవ్ టీజింగ్, గొలుసు దొంగతనం తదితర నేరాలు నివారించడానికి పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలన్నారు.

News September 2, 2025

HYD: గణేశ్ నిమజ్జనానికి ముమ్మర ఏర్పాట్లు

image

గణేశ్ నిమజ్జనానికి GHMC ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం కమిషనర్ కర్ణన్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా, లేక్ వ్యూ పార్క్, బతుకమ్మ కుంట తదితర ప్రాంతాలను పరిశీలించారు. బారీకేడింగ్, లైటింగ్, క్రేన్లు, కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. నగరంలోని 20 ప్రధాన చెరువులతో పాటు చిన్న విగ్రహాల కోసం 72 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేశామన్నారు.

News September 1, 2025

RR: వేతనాలు మంజూరు చేయండి సారూ.!

image

తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో గంటల ప్రాతిపదికన పనిచేస్తున్న బోధన, ఇతర సిబ్బంది వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4 నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరు ఉద్యోగుల వేతనాలు మంజూరు చేయడంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి, పెండింగ్‌లోని వేతనాలను విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

News August 30, 2025

రంగారెడ్డి జిల్లా ముసాయిదా ఓటర్ లిస్ట్ ఇదే

image

స్థానిక సంస్థల ఓటర్ల ముసాయిదా జాబితాను జిల్లా ఎన్నికల అధికారి విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 21 మండలాల పరిధిలో 526 గ్రామపంచాయతీలు ఉండగా వీటి పరిధిలో 7,52,254 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 3,76,873 మంది పురుషులు, 3,75,353 మంది మహిళలు, 28 మంది ఇతర ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. వార్డుల వారీగా మొత్తం 4,682 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. అభ్యంతరాల స్వీకరణ ఇవాళ్టితో లాస్ట్.

News August 30, 2025

రంగారెడ్డి: ఆశవర్కర్లు జ్వర సర్వే చేపట్టాలి: కలెక్టర్

image

సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, జ్వర సర్వే చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. జిల్లాలో డెంగ్యూ కేసులు ప్రబలే ప్రాంతాలను గుర్తించాలని, ఫాగింగ్, రెసిడ్యుల్ స్ప్రే చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఖాళీ స్థలాల్లో చెత్త తొలగించాలని, ఆశవర్కర్లు ప్రతిరోజు 50 ఇళ్లను సందర్శించి జ్వర సర్వే చేపట్టాలన్నారు.