RangaReddy

News January 14, 2025

HYD: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో..

image

సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 9100153883 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.

News January 13, 2025

HYD: మిసెస్ ఇండియా తెలంగాణగా మిథాలీ అగర్వాల్

image

హైదరాబాద్ వేదికగా నిర్వహించిన మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణకు చెందిన మిథాలీ అగర్వాల్.. మిసెస్ ఇండియా తెలంగాణగా నిలిచారు. అండర్ 40లో 3వ స్థానంలో నిలిచి ఆమె రన్నరప్లో నిలిచారు. మిసెస్ మమత త్రివేది నిర్వహించిన ఈ ఈవెంట్‌లో వివిధ వయసు కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. మిథాలీ అగర్వాల్ గతంలో ఐఐటీ హైదరాబాద్ PROగా విధులు నిర్వహించారు. ఆమె విజయంపై పలువురు అభినందనలు తెలిపారు.

News January 13, 2025

HYD: రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సుల రయ్ రయ్..!

image

హైదరాబాద్‌లోని ఉప్పల్, KPHB, ఎల్బీనగర్ క్రాస్ రోడ్, గచ్చిబౌలి, JBS, MGBS నుంచి హనుమకొండ, వరంగల్, తొర్రూరు, కరీంనగర్, సిద్దిపేట వెళ్లే రోడ్డు మార్గంలో RTC ఎలక్ట్రిక్ బస్సులు రయ్ రయ్ మంటూ.. తిరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో 3,200 ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. వారం క్రితమే నూతన ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించారు.

News January 13, 2025

HYD: పండ్లు, కూరగాయలు కొంటున్నారా..ఇలా చేయండి!

image

హైదరాబాద్‌లో పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసి, తినే వారికి GHMC, ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు సూచనలు చేశారు. శుభ్రమైన నీటితో మొదట కడగాలన్నారు. కడగటానికి ఉపయోగించే నీటిలో ఏవైనా విష పదార్థాలు ఉంటే, మనం తినే ఆహారం కలుషితం అయ్యే అవకాశం ఉందన్నారు. తద్వారా ఫుడ్ పాయిజనింగ్ జరగటం, అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందన్నారు. నీటిలో కాస్తంత ఉప్పు వేసి, కడిగితే మరింత మేలని సూచించారు.

News January 13, 2025

HYD: మాజీ ఎంపీ భౌతికకాయానికి మంత్రి నివాళులు

image

నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం భౌతికకాయానికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈరోజు నివాళులు అర్పించారు. HYDచంపాపేట్‌లోని ఆయన నివాసానికి వెళ్లి జగన్నాథం కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చారు. జగన్నాథంతో తనకున్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి బాధాకరమని, ఎంపీగా ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారని, ఓ సీనియర్ నాయకుడిని రాష్ట్రం కోల్పోయిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

News January 13, 2025

HYD: చైనా మాంజా.. జర జాగ్రత్త గురూ!

image

సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు చిన్నా పెద్ద తేడా లేకుండా, ఈలలతో గోల చేస్తూ పోటాపోటీగా పతంగులు ఎగరేస్తారు. చైనా మాంజా అమ్మినా.. కొన్నా.. జైలు శిక్షే అని ఇప్పటికే HYD,ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. చైనా మాంజా కారణంగా పక్షులతో పాటు మనుషులు కూడా ప్రమాదాల బారిన పడుతున్నారు. పంతంగులను ఎగురవేసేందుకు మాంజాను విక్రయించినా, ఎగురవేసినా అరెస్టులు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది.

News January 13, 2025

HYD: కాస్త ఆగండి.. 4 నెలల్లో సమస్యలు తీరతాయి

image

HYD దుర్గంచెరువు FTL వివాదాలకు 4 నెలల్లో శాశ్వ‌త‌ ప‌రిష్కారం చూపుతామ‌ని లేక్ ప్రొటెక్ష‌న్ క‌మిటీ ఛైర్మెన్‌, హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ తెలిపారు. HYD రాయదుర్గం చెరువు FTL నిర్ధార‌ణ‌లో సంబంధిత ప్ర‌భుత్వ శాఖ‌ల‌తో పాటు, ఐఐటీ, బిట్స్‌పిలానీ, జేఎన్‌టీయూ వంటి విద్యా సంస్థ‌ల ఇంజినీర్ల‌ను కూడా భాగ‌స్వామ్యం చేస్తామ‌న్నారు. వాస్త‌వానికి 65.12 ఎక‌రాలు కాగా, ఒక్కో శాఖ ఒక్కో లెక్క చెబుతోంద‌ని స్థానికులన్నారు.

News January 13, 2025

రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

image

రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో చందనవెల్లిలో 13.8℃, రెడ్డిపల్లె, తాళ్లపల్లి 14.2, కాసులాబాద్ 14.3, ఎలిమినేడు, రాచులూరు 14.4, షాబాద్ 14.5, రాజేంద్రనగర్, మీర్‌ఖాన్‌పేట 14.6, ఇబ్రహీంపట్నం వైట్‌గోల్డ్ ప్రాంతం, మంగళపల్లె 14.9, అమీర్‌పేట, కేతిరెడ్డిపల్లిలో 15℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News January 13, 2025

HYD: నుమాయిష్‌కు ఇప్పటివరకు 2.75 లక్షల మంది

image

HYDలో జరుగుతున్న 84వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనశాల నుమాయిష్‌కు ఆదివారం సందర్శకులు భారీగా తరలివచ్చినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. దాదాపు 75 వేల మంది సందర్శించారని పేర్కొన్నారు. 80 సీసీ కెమెరాలతో ఎగ్జిబిషన్‌లో నిఘాను ముమ్మరం చేసినట్లు అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, సీఐ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు 2.75 లక్షల మంది ఎగ్జిబిషన్‌కు వచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

News January 13, 2025

HYDలో విదేశీయులు.. అందు కోసమే..!

image

HYDలో నేటి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగనున్న నేపథ్యంలో, 3 రోజులకు ముందుగానే విదేశీయులు హైదరాబాద్ చేరుకున్నట్లుగా తెలంగాణ టూరిజం శాఖ తెలిపింది. చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, గోల్కొండ కోట లాంటి చారిత్రాత్మక ప్రాంతాలను సందర్శించిన కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశస్థులు మన సంస్కృతిని కొనియాడారు.