RangaReddy

News October 27, 2024

అంజన్ కుమార్‌ను గెలిపిస్తే మంత్రి అయ్యేవారు: CM

image

ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న తెలంగాణ సదర్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్‌లో అంజన్‌ కుమార్‌ యాదవ్‌ను గెలిపిస్తే మంత్రి అయ్యేవారని పేర్కొన్నారు. అయినప్పటికీ యాదవ సోదరులు రాజకీయాల్లో రాణించాలి, వారికి ఒక అండ కావాలన్న మంచి ఉద్దేశంతో హైదరాబాద్‌ నుంచి అనిల్ కుమార్‌ యాదవ్‌ను రాజ్యసభకు పంపామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

News October 27, 2024

HYD: దాంట్లో రేవంత్ రెడ్డి రికార్డ్ సాధించారు: KTR

image

రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం నడపరాదని మాజీ మంత్రి KTR విరుచుకుపడ్డారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలీసులనే కొడుతున్నారని, ఈ అంశంలో రేవంత్ రెడ్డి రికార్డ్ సాధించారన్నారు. HYD ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని నాచారం వద్ద నిర్మించిన STP (సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) ను BRS వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పరిశీలించారు.

News October 27, 2024

సదర్: దద్దరిల్లనున్న హైదరాబాద్!

image

సదర్‌ ఉత్సవాలకు హైదరాబాద్ ముస్తాబైంది. నేటి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు NTR స్టేడియంలో తెలంగాణ సదర్ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఇక దీపావళి వేళ నగరానికి దున్నపోతుల విన్యాసాలు ప్రత్యేక శోభను తీసుకొస్తాయి. నారాయణగూడ, ఖైరతాబాద్, ముషీరాబాద్‌, అమీర్‌పేట‌తో పాటు HYDలోని యాదవ సోదరులు నార్త్ ఇండియా నుంచి బలమైన దున్నరాజులను తీసుకొస్తున్నారు. ఈ ఏడాది సదర్ సయ్యాటలతో హైదరాబాద్‌ దద్దరిల్లనుంది.

News October 26, 2024

HYDలో చుట్టూ 5 డంపింగ్ యార్డులు!

image

HYDలో నలువైపులా 5 కొత్త డంపింగ్ యార్డులు రాబోతున్నాయి. త్వరలో దాని కావాల్సిన భూముల సేకరణ చేపడతామని అధికారులు తెలిపారు. ఐదింటిలో దుండిగల్ సమీపంలోని ప్యారానగర్లో భూ కేటాయింపు పూర్తయింది. మరో 4 చోట్ల భూ కేటాయింపులు జరగాల్సి ఉంది. రోజూ ఉత్పన్నమయ్యే 7,500 టన్నుల గార్బేజి, 17 మున్సిపాలిటీల్లో 1500 టన్నుల గార్బేజిని రీసైక్లింగ్ చేయడం సులభం కానుంది. దీంతో జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై ఒత్తిడి తగ్గనుంది.

News October 26, 2024

రాష్ట్రానికి వెన్నుదన్నుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా..!

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అర్ధ వార్షిక ఆదాయంలో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రానికి వెన్నుదన్నుగా మారిందని ఉప రవాణా శాఖ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. రవాణా శాఖ అర్ధ వార్షిక ఆదాయం రూ.1438 కోట్లు సమకూరింది. ఇందులో రంగారెడ్డి రూ.802 కోట్లు, మేడ్చల్ రూ.595 కోట్లు, వికారాబాద్ నుంచి రూ.39 కోట్లు సమకూరింది. రాష్ట్ర ఆదాయంలో ఉమ్మడి RR జిల్లా నుంచి ఏకంగా 45% ఆదాయం రావడం గమనార్హం.

News October 26, 2024

FLASH: HYDకు సెమీ హై స్పీడ్ రైల్

image

HYD నుంచి విశాఖ మధ్య సెమీ హై స్పీడ్ రైలు నిర్మించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. HYD నగర శివారులోని శంషాబాద్ నుంచి విశాఖ సమీపాన ఉన్న దువ్వాడ వరకు ఈ రైల్వే లైన్ నిర్మాణం జరుగునుంది. దాదాపుగా 220 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు నడవనుందని ఇంజినీరింగ్ వర్గాలు తెలిపాయి. దీని ద్వారా ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సేవలు మరింత మెరుగుపడునున్నాయి.

News October 26, 2024

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో హీరోయిన్ సాయి పల్లవి

image

కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి హీరోయిన్ సాయిపల్లవి, హీరో శివ కార్తికేయన్ చేరుకున్నారు. అక్టోబర్ 31న హైదరాబాద్‌లో అమరన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనడానికి హీరో హీరోయిన్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి సాయి పల్లవి రావడంతో అభిమానులు కేరింతలతో స్వాగతం పలికారు.

News October 26, 2024

HYD: అక్టోబర్ 31 లాస్ట్.. త్వరపడండి!

image

గ్రేటర్ HYDలోని జలమండలి పరిధిలో పేరుకుపోయిన దీర్ఘకాలిక పెండింగ్ నల్లా బిల్లులను చెల్లించేందుకు OTS వన్ టైం సెటిల్మెంట్ అవకాశం అక్టోబర్ 31 వరకు ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. పెండింగ్ బిల్లులపై ఎలాంటి వడ్డీ, అదనపు ఛార్జీలు లేకుండా ఒకటేసారి చెల్లించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ అవకాశం కల్పించారు. చివరి క్షణం వరకు వేచి ఉండకుండా, అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News October 26, 2024

HYD: 4 గ్రేటర్ కార్పొరేషన్లపై మీ అభిప్రాయం ఏంటి?

image

ORR అంతర్భాగంలోని GHMCతో పాటు శివారు ప్రాంతాల్లోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలను కలిపి కొత్తగా 4 గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి పురపాలక, ప్లానింగ్ శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తుంది. ORR లోపల దాదాపు 2 కోట్ల జనాభా నివసిస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. మరి 4 కార్పొరేషన్ల ఏర్పాటుపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

News October 26, 2024

HYDలో సోలార్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు: భట్టి

image

HYDలో సోలార్ ప్లాంట్లతో పాటు, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇటీవల జపాన్ పరిధిలోని టోక్యోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న యమనాషీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును సందర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటు జరిగేలా చూస్తామన్నారు.