RangaReddy

News October 26, 2024

HYD: విదేశంలో ఉన్నవారికి గిఫ్ట్ పంపాలా..? ఇదిగోండి!

image

అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, UK లాంటి ఇతర దేశాల్లో ఉంటున్న వారికి ఇప్పుడు గిఫ్టులు పంపించడం చాలా ఈజీ. HYD నగరం సహా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఏడాది జనవరి 15 వరకు దేశ, విదేశాలకు దీపావళి, గురునానక్ జయంతి, క్రిస్మస్ నూతన సంవత్సరం వేళ పోస్ట్ పార్సెల్ పంపడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అసిస్టెంట్ డైరెక్టర్ శరత్ కుమార్ తెలిపారు. మిగితా వివరాలకు దగ్గరలో ఉన్న మీ స్థానిక పోస్ట్ ఆఫీసులో సంప్రదించాలన్నారు.

News October 26, 2024

RR: తేమ రాక గోస.. ఇదే అదునుగా దళారీతనం!

image

RR, VKB, MDCL జిల్లాలలో పత్తి పండించిన రైతులకు తేమ శాతం తలనొప్పిగా మారింది. కొద్దిరోజుల క్రితమే వర్షం కురవడంతో పత్తి అధిక తేమతో ఉంది. పత్తి పంట 8-12% తేమ ఉంటేనే సీసీఐ క్వింటా పత్తికి మద్దతు ధరగా రూ.7,521 చెల్లిస్తోంది. తేమ రాకపోవడాన్ని దళారులు అదునుగా చేసుకొని రూ.6500-7000లకే కొనుగోలు చేసి దండుకుంటున్నారు.

News October 26, 2024

HYD: చీర కొంగులో చీటీలు.. FIR నమోదు

image

నిన్న జరిగిన గ్రూప్-1 పరీక్షలో ఇస్లావత్ లక్ష్మి అనే అభ్యర్థి ఇబ్రహీంపట్నం CVR కాలేజ్‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ విషయం తెలిసిందే. కాలేజ్ సూపరింటెండెంట్ శివారెడ్డి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు FIR నమోదు చేశారు. నేడు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు ఆమెను హాజరు పరిచారని ఎస్సై రామకృష్ణ తెలిపారు.

News October 26, 2024

HYD: GHMC టెక్నాలజీ ఎక్కడ..? మళ్లీ పాత పద్ధతే!

image

గ్రేటర్ HYDలో మ్యాన్ హోల్ క్లీనింగ్ కోసం అనేకచోట్ల ఇన్ని రోజులు బకెటింగ్ యంత్రాలను ఉపయోగించారు. తాజాగా 90 రోజుల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పలుచోట్ల మళ్లీ పాత పద్ధతిని అవలంబించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మ్యాన్ హోల్ క్లీనింగ్ కారణంగా భారతదేశంలో 1993-2021 వరకు 971 మంది మరణించారని రికార్డులు చెబుతున్నప్పటికీ, ఎందుకు మళ్లీ పాత పద్ధతినే కొనసాగిస్తున్నారని..? ప్రజలు ప్రశ్నించారు.

News October 26, 2024

HYDలో తగ్గిన చికెన్ ధరలు

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు తగ్గాయి. ఈ వారం ప్రారంభంలో KG రూ.243కు విక్రయించారు. గత 3 వారాలుగా మాంసం ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ శనివారం ధరలు మాంసం ప్రియులకు ఊరట కలిగించాయి. నేడు స్కిన్‌ లెస్ KG రూ.226, విత్‌ స్కిన్ KG రూ.199గా ధర నిర్ణయించారు. రిటైల్‌లో రూ. 137, ఫాంరేటు ధర రూ. 115 ఉంది. నగరంలోని కొన్ని హోల్ సేల్ దుకాణాల్లో రూ. 5 నుంచి రూ. 15 వరకు తగ్గించి అమ్మకాలు చేస్తుంటారు.

News October 26, 2024

HYD: ఓయూ దూర విద్యలో దరఖాస్తులకు ఆహ్వానం

image

దూర విద్య ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 5వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుంతో 8వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రవేశ పరీక్ష నవంబర్‌ 9న జరగనుందని తెలిపారు. వెబ్‌సైట్‌: www.ouadmissions.com

News October 26, 2024

HYD: బలవంతంగా వ్యభిచారం.. మహిళకు జీవిత ఖైదు

image

HYD హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపి, బంధించి చిత్రహింసలు పెట్టిన మహిళకు న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నిందితురాలు కే.ఆశ(24) పై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట ఈరోజు హాజరుపర్చగా జీవిత ఖైదు శిక్ష విధించారు. ఈ కేసులో నిందితురాలికి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.3,19,000 జరిమానా విధించారు.

News October 26, 2024

RR:వరి ధాన్యం కొనుగోలు షురూ.. అధికారుల సూచనలు!

image

వరి ధాన్యం ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని RR,MDCL, VKB పౌర సరఫలాల శాఖ అధికారులు సూచించారు. ✓క్వింటా(100KG)ధాన్యంలో మట్టి, పెళ్లలు,రాళ్లు -1KG✓చెత్త, తాలు-1KG ✓రంగులు మారిన, మొలకెత్తిన, పురుగులు తిన్న వరి ధాన్యం-5KG✓పూర్తిగా తయారు కానీ, ముడుచుకొని ధాన్యం-3KG✓తక్కువ రకాల మిశ్రమం-6KG✓తేమ-17%లోపు ఉండాలి ✓క్వింటా సాధారణ వరి రకం రూ.2,300, ఏ గ్రేడ్ రూ.2,320, సన్న రకం వడ్లకు రూ.500 బోనస్

News October 25, 2024

HYD: ఉస్మానియా ఆసుపత్రిలో డెర్మటాలజీ సేవలు

image

HYD అఫ్జల్‌గంజ్ ఉస్మానియా ఆస్పత్రిలో డెర్మటాలజీ ప్రత్యేక విభాగం అందుబాటులోకి తెచ్చినట్లు డెర్మటాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ భూమేశ్ కుమార్ వెల్లడించారు. ఉచిత చికిత్స అందిస్తున్నామని నిత్యం 100 మంది ఓపీ వస్తుంటారని, తీవ్రమైన చర్మవ్యాధి లక్షణాలు ఉంటే బయాప్సి పరీక్షలు చేస్తామని తెలిపారు. పిల్లల కోసం పీడియాట్రిక్ డెర్మటాలజీ చికిత్స కేంద్రం ప్రారంభించినట్లు తెలిపారు.

News October 25, 2024

HYD: డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తుల వెల్లువ

image

HYD బేగంపేట్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణిలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. శుక్రవారం నాటి ప్రజావాణిలో మొత్తం 509 అర్జీలు దాఖలు అయ్యాయి. ప్రజావాణి ఇన్‌ఛార్జ్ డాక్టర్ జీ.చిన్నారెడ్డి ప్రజల నుంచి దరఖాస్తులను తీసుకుని సంబంధిత అధికారులకు అందించారు. ఆయా శాఖల అధికారులకు ఫోన్ చేసి మాట్లాడి అర్జీదారుల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నారు.