India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ గుడిలో వారం క్రితం దాడి ఘటన అందరికీ తెలిసిన విషయమే. కాగా దేవాదాయ శాఖ నుంచి ఐఏఎస్ అధికారిణి శైలజ రామయ్యర్ వచ్చి గుడి రేనోవేషన్ పనులను ఈరోజు పరిశీలించారు. ఈ రేనోవేషన్ పనులు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేయిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గుడిలో ప్రహరీ, గ్రిల్స్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
GHMC పరిధిలో ఇంజినీరింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలే నూతనంగా ఉద్యోగ పత్రాలు పొందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు 125 మంది జీహెచ్ఎంసీకి రిపోర్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి 146 మంది కొత్తగా నియామకమైనట్లు అధికారులు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
HYD నగరంలో నెల రోజుల్లో జరిగిన సైబర్ నేరాల్లో అత్యధికంగా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, స్టాక్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్, పార్ట్ టైం టైం వంటి వివిధ మోసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారీ లాభాలు వస్తాయని, ఎవరైనా ఆఫర్లు చెబితే, నమ్మొద్దని పోలీసులు సూచించారు. ప్రతి దానికి పాస్ కోడ్ చేసుకుని పదేపదే మార్చుకోవాలని తెలిపారు. నెల రోజుల్లో సుమారు రూ.11 కోట్ల వరకు కొట్టేశారని, జాగ్రత్తగా ఉండాలన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయాలను తెలుసుకునేందుకు తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం నవంబర్ 7న రంగారెడ్డి జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ శశాంక తెలిపారు. ఇందులో భాగంగా రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి నవంబర్ 7న రంగారెడ్డి కలెక్టరేట్లో కమిషన్ ఛైర్మన్ నిరంజన్ నేతృత్వంలో ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 1.67 కోట్ల ఓటర్లు ఉన్నట్లు SEC తెలిపింది. వికారాబాద్-6,71,940 మంది, RR-7,94,653 మంది గ్రామ పంచాయతీల్లో ఓటర్లు ఉండగా, మేడ్చల్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 64,396 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది.
HYD రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ యూనివర్సిటీలో 2024-25లో B.Sc (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో సెల్ఫ్ ఫైనాన్స్ కోటా సీట్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం 227 సీట్లు ఉండగా మరో 200 పెంచినట్లు వీసీ ఆల్దాస్ జానయ్య తెలిపారు. ఈ సీట్లకు వార్షిక ఫీజులు సైతం తగ్గించామని, పెరిగిన సీట్లను వ్యవసాయ కళాశాలలో సర్దుబాటు చేస్తామన్నారు. కన్వీనర్ కోటా సీట్ల భర్తీ అనంతరం వీటికి ప్రత్యేక కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.
ప్రభుత్వం ఇటీవల 9 యూనివర్సిటీలకు నూతన వీసీలను నియమించింది. తాజాగా వారందరూ ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టారు. HYDలోని రాజ్‌భవన్ నుంచి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపుమేరకు వీసీలు రాజ్ భవన్లో గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. స్కిల్ ఎడ్యుకేషన్‌పై దృష్టి పెట్టాలని వారికి సూచించారు. ఇందులో వీసిలు కుమార్, నిత్యానందరావు, యాదగిరి రావు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు ప్రాంతాలకు రూ.2,245 కోట్లతో 57 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మించేందుకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని HYD DRM లోకేష్ విష్ణోయ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా HYD, చెన్నై, కలకత్తా ప్రాంతాల నుంచి అమరావతికి డైరెక్ట్ కనెక్టివిటీ జరగనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు లోకల్ రీజియన్ రాకపోకలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు.
ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్,ఈ-ఇన్-సీ అనిల్, చీఫ్ ఇంజినీర్లతో కలిసి శుక్రవారం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది లేకుండా సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌పై మరో భూకుంభకోణంపై ఫిర్యాదు నమోదైంది. దాదాపు రూ.1,000 కోట్ల విలువ చేసే భూమిని అమోయ్ కుమార్ మాయం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా తట్టిఅన్నారం గ్రామంలోని మధురానగర్ కాలనీ ఫ్లాట్స్ ఓనర్ అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు చేశారు.
Sorry, no posts matched your criteria.