India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ట్యాంక్ బండ్ వద్ద ఉన్న బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం చుట్టూ ప్రహరీ నిర్మాణాన్ని దళిత సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ప్రహరీ నిర్మాణంతో దళితుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించడం మానుకోవాలని జీహెచ్ఎంసీని కోరుతూ కమిషనర్ ఇలంబర్తికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రహరీ నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలని కోరారు.
సచివాలయంలో అక్టోబర్ 26న సాయంత్రం CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరుగనుంది. ఈ సమావేశం అక్టోబర్ 23వ తేదీన జరగాల్సి ఉండగా.. మంత్రులు అందుబాటులో లేకపోవడంతో శనివారానికి వాయిదా పడింది. సౌత్‌కొరియా పర్యటనకు వెళ్లిన పలువురు మంత్రులు అక్టోబర్ 25న తిరిగి హైదరాబాద్ చేరుకొని, 26న జరిగే సమావేశానికి హాజరవుతారు.
HYD, RR, MDCL, VKB జిల్లాల పరిధిలోని ట్రాన్స్‌జెండర్ల ఆధార్ నమోదు, వివరాల్లో మార్పుల కోసం HYD మలక్‌పేట ఆధార్ సెంటర్ హెడ్ ఆఫీస్ వద్ద అవకాశం కల్పించినట్లు ట్రాన్స్‌జెండర్ల సంక్షేమశాఖ తెలిపింది. నేటితో ప్రత్యేక క్యాంపు ముగియనుంది. వివరాలక కోసం 040-24559048 సంప్రదించాలని అధికారిక యంత్రాంగం సూచించింది. సాధ్యమైనంత మందికి ఈ సమాచారాన్ని చేరవేయాలని కోరారు. SHARE IT
దేశ అభివృద్ధికి చిరునామాగా కేంద్రం పనిచేస్తుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. అనేక రాష్ట్రాల్లో జాతీయ రహదారుల నిర్మాణాలు చేపట్టి ప్రజలకు సేవలు మెరుగు పరిచిందన్నారు. ప్రస్తుతం తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో రైల్వే సేవల విస్తరణపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
HYD మెట్రో 2వ దశ ప్రాజెక్ట్ DPR ఇప్పటికే సిద్ధం చేశారు. నాగోల్-RGIA ఎయిర్‌పోర్ట్ 36.6KM, ఎంజీబీఎస్-చంద్రాయణగుట్ట ఓల్డ్ సిటీ కారిడార్ 7.5KM, రాయదుర్గం-కోకాపేట 11.6KM, మియాపూర్ -పటాన్‌చెరు 13.4KM, ఎల్బీనగర్ -హయత్‌నగర్ 7.1KM, ఎయిర్‌పోర్ట్-ఫోర్త్ సిటీ 40KM పనులను రూ.32,237 కోట్ల అంచనాతో చేపట్టనున్నారు. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత, కేంద్రానికి పంపి అనుమతులు వచ్చాక పనులు మొదలుపెట్టనున్నారు.
HYD వాసులకు ముఖ్య గమనిక. కృష్ణా తాగునీటి సరఫరా ఫేజ్-3లో మరమ్మతుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రేపు ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నారు. సరూర్‌నగర్, ఆటోనగర్, బోడుప్పల్, చెంగిచెర్ల, పెద్ద అంబర్‌పేట, లాలాపేట, షేక్‌పేట, మల్లికార్జుననగర్, శంషాబాద్, జూబ్లీహిల్స్, బండ్లగూడ, బోజగుట్ట, శాస్త్రిపురం, ఫిల్మ్‌నగర్, ప్రశాసన్‌నగర్‌లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు.
SHARE IT
చలికాలం మొదలులోనే హైదరాబాద్ వణికిపోతోంది. గురువారం ఉదయం OU, KBR పార్క్, HCU, ఇందిరా పార్క్, ట్యాంక్‌బండ్ పరిసరాల్లో పొగ మంచు అలుముకుంది. గతేడాది కంటే ఈసారి చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2024, JANలో సిటీలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఏకంగా 5 నుంచి 6కు పడిపోయే అవకాశం ఉందని అంచనా. ఇప్పటికే పగటి పూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలిలో బీ కేర్ ఫుల్.
లిబర్టీలోని అంబేడ్కర్ విగ్రహం చుట్టూ అడ్డు గోడ కట్టారని పలువురు కూల్చివేశారు. ఈ వివాదంపై జీహెచ్ఎంసీ వివరణ ఇచ్చింది. నగరంలోని వివిధ జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా పార్లమెంట్ నమూనాను అంబేడ్కర్ విగ్రహం చుట్టూ నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. HYD DRDOకు చెందిన రిసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో(RCI) తాత్కాలిక పద్ధతిన ఖాళీల భర్తీ చేస్తున్నారు. SEP-27న నోటిఫికేషన్ విడుదలైంది. 30 రోజుల్లోగా దరఖాస్తు(OCT-26) చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. BE, B.TECH, M.TECH, MSC, PHD చేసిన వారు అర్హులు.
LINK: www.drdo.gov.in/drdo/careers
SHARE IT
అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యుడు, TTD మాజీ ఈఓ LV.సుబ్రమణ్యం తెలిపిన విషయం తెలిసిందే. కాగా గతంలో ఈ యాగం NOV 2 నుంచి అని ప్రకటించగా తేదీలను పోస్ట్ పోన్ చేశారు. NOV 18 నుంచి JAN 1 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.