RangaReddy

News October 23, 2024

HYDలో భారీగా పెరిగిన చికెన్ ధరలు

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్‌‌లో స్కిన్‌లెస్ KG రూ. 200కే విక్రయించారు. గత 3 వారాలుగా మాంసం ధరలు పెరుగుతూ వచ్చాయి. బుధవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్‌ లెస్ KG రూ. 243, విత్‌ స్కిన్ KG రూ. 213గా ధర నిర్ణయించారు. రిటైల్‌లో రూ. 147, ఫాంరేటు ధర రూ. 125 ఉంది. నగరంలోని కొన్ని హోల్ సేల్ దుకాణాల్లో రూ. 5 నుంచి రూ. 15 వరకు తగ్గించి అమ్మకాలు చేస్తుంటారు.

News October 22, 2024

HYD: విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్‌‌లో ల్యాండింగ్

image

బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఆకాశ ఎయిర్ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. అప్రమత్తమైన సిబ్బంది అత్యవసరంగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. సీఐఎస్ఎఫ్ భద్రత అధికారులు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందాలు విమానంలో సోదాలు చేశాయి. చివరకు ఫేక్ కాల్ అని తేలడంతో‌ ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

News October 22, 2024

HYD: బాలికపై సవతి తండ్రి అత్యాచారం.. శిక్ష

image

గతేడాది నవంబర్‌లో 9వ తరగతి బాలికపై ఆమె సవతి తండ్రి మహమ్మద్ ఖాజా పలుమార్లు అత్యాచారం చేశాడు. దీనిపై అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మంగళవారం న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. ఎల్బీనగర్‌లోని స్పెషల్ సెషన్స్ జడ్జి పోక్సో చట్టం కింద రూ. 30 వేల జరిమానా, జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. బాధితురాలికి నష్టపరిహారంగా రూ. 12 లక్షలు ప్రభుత్వం నుంచి అందజేయాలన్నారు.

News October 22, 2024

చార్మినార్ బ్యూటిఫికేషన్ పనులకు NTPC నిధులు

image

చారిత్రాత్మక కట్టడం చార్మినార్​ బ్యూటిఫికేషన్​ పనుల నిర్వహణకై NTPC సంస్థ తమ CSR​లో భాగంగా స్వచ్ఛ్​ ఐకానిక్​ ప్లేసేస్​ ప్రాజెక్ట్ కింద GHMCతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు సంస్థల ప్రతినిధులు MOUలపై సంతకాలు చేశారు. NTPC AGM అఖిల్​ పట్నాయక్​, కులీకుత్​బ్​‌షా అర్బన్​ డెవలప్​మెంట్ అథారిటీ చీఫ్​ ఇంజనీర్​ జి.గురువీర లు ఫైళ్ల సంతకాలు చేసి, పరస్పరం మార్చుకున్నారు. దీనికి నిధులను NTPC సంస్థ సమకూర్చనుంది.

News October 22, 2024

HYD: కాంగ్రెస్ పాలనలో రైతాంగం మోసపోతుంది: హరీశ్‌రావు

image

కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రైతాంగం అన్ని రకాలుగా మోసపోతున్నారాని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతు బంధు ఇయ్యక, రుణమాఫీ చెయ్యక, బోనస్ అందక.. చివరకు పంట కొనుగోలు కూడా చేయకపోవడం అన్నదాతకు శాపంగా మారిందని మండిపడ్డారు. వెంటనే హామీలను నిలుపుకోవాలని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

News October 22, 2024

HYD: BRS చేసిన అప్పులకు వడ్డీలతో సరిపోతుంది: TPCC చీఫ్

image

‘పంటల కొనుగోలు ఇంకా స్టార్ట్ కాలేదు.. ఇప్పుడే బోనస్ ప్రస్తావన ఎందుకు హరీశ్‌రావు గారూ.. మా ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తుంది. మీరు చేసిన అప్పులకు మిత్తిలు, కట్టుకుంటూ రైతులకు ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తున్నాం’ అని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ వివరణ ఇచ్చారు. అందులో భాగంగానే రైతుబంధు, రుణమాఫీ, రైతు భరోసా ఇస్తున్నామన్నారు.

News October 22, 2024

BREAKING.. గ్రూప్-1 అభ్యర్థులకు బెయిల్

image

HYD అశోక్ నగర్ వద్ద గ్రూప్-1 అభ్యర్థులు G.O.29 రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు పలువురిని అరెస్టు చేసి, కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.అక్రమ కేసుల్లో అరెస్టైన జనార్దన్, సురేశ్, దామోదర్, రవి రాథోడ్లకు నాంపల్లి కోర్టులో బెయిల్ లభించినట్లు లాయర్ లక్ష్మణ్ తెలిపారు.

News October 22, 2024

HYD: గుడ్ న్యూస్ చెప్పిన జలమండలి

image

HYD నగర ప్రజలకు జలమండలి గుడ్ న్యూస్ తెలిపింది. నగరంలో పనికిరాని చేతిపంపుల వద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. 90 రోజుల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వరద నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో జలమండలి, చేతి పంపులను ఇంజక్షన్ బోర్లుగా మార్చనుంది.

News October 22, 2024

HYDలో త్వరలో సీవేరేజ్ టన్నెలింగ్ ప్రాజెక్ట్ పూర్తి

image

HYDలో జలమండలి 90 రోజుల స్పెషల్ డ్రైవ్లో సీవేరేజ్ టన్నెలింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేయనుంది. జనవరి వరకు 90 % పనులు పూర్తి చేసి, మార్చి నాటికి ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. కింగ్ కోఠి, కాచిగూడ, బషీర్‌బాగ్ వద్ద 200 మీటర్ల మేర టన్నెలింగ్ పనులతో మురుగు సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి తెలిపారు.

News October 22, 2024

సికింద్రాబాద్: దోమల బెడద నివారణకు ఇలా చేయండి!

image

✓ఇంటి పరిసరాలు ఎల్లప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి✓పూల కుండీలు, చెత్త డబ్బాలు, కొబ్బరి బోండాలు, కూలర్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించండి✓పరిసర ప్రాంతాల్లో మురుగునీరు లేకుండా చూడండి✓వాటర్ ట్యాంకులు, సంపులను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి ✓ఇంటి కిటికీలు, తలుపులకు జాలీలు ఏర్పాటు చేసుకోండి ✓శరీరం పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తువులు ధరించండి •ఎంటమాలజీ అధికారి పై విధంగా రాంబాబు సూచించారు.