India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
70,585 విద్యుత్ శాఖ ఉద్యోగులు, పెన్షనర్లు తమ ఒకరోజు మూల వేతనం రూ.18.69 కోట్లు సీఎం సహాయనిధికి ప్రకటించారు. ఈరోజు సచివాలయంలో డిప్యూటీ సీఎంకు చెక్కును అందజేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమాలకు అండగా నిలిచినందుకు విద్యుత్ శాఖ ఉద్యోగులకు వారి కుటుంబసభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్పీడీసీఎల్ సీఎండీ తదితరులు ఉన్నారు.
ఆదివాసీ పోరాటయోధుడు, గిరిజనుల ఆరాధ్య దైవం కొమురం భీమ్ జయంతి సందర్భంగా శాసనసభ మెంబర్స్‌లాంజ్‌లో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మధుసూదనా చారి తదితరులు పాల్గొన్నారు.
HYD కూకట్‌పల్లి MLA మాధవరం కృష్ణారావు నేడు తన క్యాంపు కార్యాలయంలో BRS నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 10 ఏళ్లలో KCR చేసిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోరని, రూ.వేల కోట్లతో HYDను అభివృద్ధి చేసుకున్నామని గుర్తు చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లాలన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది.. కాంగ్రెస్ నాయకుల ఆదాయం అమాంతం పెరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పదేళ్లపాటు బుల్లెట్ వేగంతో పరుగులు పెట్టిన తెలంగాణకు.. అసమర్థ, అవినీతి పాలనే శాపంగా మారిందన్నారు. అనాలోచిత విధానాలతో ఆర్థిక వృద్ధికి బ్రేకులు వేసి పాతాళానికి పడిపోయేలా చేసిన పాపం ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ‘X’ వేదికగా ఫైర్ అయ్యారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని నేడు వందలాది మంది విద్యార్థులతో హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించనున్నట్లు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ తెలిపారు. ఉదయం 10 గంటలకు బర్కత్‌పుర చౌరస్తా నుంచి లక్డికపూల్‌లోని కలక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.
బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వెంటే నడుస్తామని ఉమ్మడి RR, VKB బీసీ సంఘం నాయకులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నివర్గాల ప్రజాభిప్రాయ సేకరణతో త్వరలో కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు తెలిపారు. సోమవారం తాండూరుకు చెందిన బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్, సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేశ్ HYDలో ఆర్.కృష్ణయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు.
గ్రూప్ -1 మెయిన్ పరీక్షలకు మొదటిరోజు 2,157 మంది డుమ్మా కొట్టారు. రంగారెడ్డి జిల్లాలో 11 పరీక్ష కేంద్రాల్లో 8,011 మంది అభ్యర్థులను కేటాయించింది. ఇందులో 5,854 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరు కాగా.. 2,157 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 గంటల వరకు పరీక్ష కేంద్రానికి వచ్చిన అభ్యర్థులనే అనుమతించినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ సచివాలయంలో డిప్యూటీ CM భట్టివిక్రమార్కని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆస్కార్ అవార్డులో భాగం అయిన రాహుల్‌కు డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఆయనతో పాటు నిర్మాత బండ్ల గణేశ్ ఉన్నారు. డిప్యూటీ సీఎంను కలవటంతో వారిద్దరు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వెంటే నడుస్తామని తాండూరు బీసీ సంఘం నాయకులు అన్నారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. అన్నివర్గాల ప్రజాభిప్రాయ సేకరణతో త్వరలో కొత్త పార్టీని ఏర్పాటు ప్రకటించనున్నట్లు తెలిపారు. సోమవారం తాండూరుకు చెందిన బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్, సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేశ్ HYDలో ఆర్.కృష్ణయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు.
తొలిరోజు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు హైదరాబాద్ జిల్లాలో 5,613 మంది అభ్యర్థులకు గానూ 4,896 మంది హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 87.23% హాజరైనట్లు అధికారులు తెలిపారు. పలుచోట్ల పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పోలీసులు కేంద్రాల్లోకి అనుమతించలేదు. ఈ నెల 27 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. కాగా మెయిన్స్‌కు మొత్తం 31,383 అభ్యర్థులు అర్హత సాధించగా, సోమవారం 22,744 మంది మాత్రమే పరీక్ష రాశారు.
Sorry, no posts matched your criteria.