India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అశోక్‌నగర్‌లో సోమవారం రాత్రి గ్రూప్-1 అభ్యర్థులు నిరసన చేపట్టారు. గ్రూప్ మెయిన్ పరీక్షలు నిర్వహించడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తామని పిలుపునిచ్చారు. రానున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బస్సు యాత్ర ద్వారా ప్రచారం చేస్తామని వెల్లడించారు.
సుప్రీంకోర్టు తీర్పుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్‌పై మభ్యంతర ఉత్తర్వులకు సుప్రీం నిరాకరణ హర్షణీయమన్నారు. ప్రభుత్వం తెలంగాణ యువతకు ఉన్నత ఉద్యోగాలు ఇవ్వాలన్న ప్రయత్నాలను హైకోర్టు, సుప్రీంకోర్టులు సమర్థించాయని పేర్కొన్నారు. 13 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని అభ్యర్థులంతా సద్వినియోగం చేసుకొని ఉన్నత అవకాశాలు పొందాలన్నారు.
నేటినుంచి గ్రూప్-1 అభ్యర్థులకు పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో గ్రూప్-1 అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అభ్యర్థులు అందరూ ఆందోళన చెందకుండా, ఏకాగ్రతతో పరీక్ష రాయాలని సూచించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
నాచారంలో త్వరలో ప్రారంభించబోతున్న వ్యాల్యూ జోన్ హైపర్ మార్ట్‌లో పని చేయుటకు FMCG, ఫ్యాషన్, జనరల్ మర్చంటైజ్ విభాగంలో అనుభవం కలిగిన సేల్స్ పర్సన్స్, హెల్పర్స్, MIS, ఇన్వెంటరీ, లాజిస్టిక్స్, CSD టీమ్స్, ఆల్ట్రేషన్ టైలర్స్ కావలెను. Oct 23, 24 తేదీల్లో 11AM – 4PM వరకు ఇంటర్య్వూకు హాజరుకావచ్చు. అడ్రస్: వాల్యూజోన్ హైపర్ మార్ట్, నాచారం, మల్లాపూర్ రోడ్, హైదరాబాద్, పూర్తి వివరాలకు: 63097-77895
అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి ఆహ్వానించి హౌస్ అరెస్ట్ చేస్తారా అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి తనను ఆహ్వానించి వెళ్లనివ్వకుండా రాత్రి నుంచి హౌస్ అరెస్టు చేశారని వాపోయారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులర్పించే అర్హత కూడా తనకు లేదా అంటూ ప్రశ్నించారు. తామంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకంత భయమని ప్రశ్నించారు.
గోషామహల్‌లో పోలీసు అమరవీరుల స్మారకం వద్ద ఫ్లాగ్ డే పరేడ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు విడిచిన యోధులందరికీ పోలీసు అమరవీరులకు, కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. త్యాగానికి, సేవకు ప్రతీక పోలీసులు అని, కర్తవ్యాన్ని నిర్వర్తించడంతో పాటు సమాజానికి తోడ్పాటు అందించడంలో పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రొఫెసర్ డా.జె.భూపేందర్ సింగ్ రాథోడ్ రెండు గోల్డ్ మోడల్స్ సాధించారు. హైదరాబాదులో జరిగిన 19th సౌత్ ఇండియా కాన్ఫరెన్స్‌లో బెస్ట్ సర్జికల్ వీడియో ప్రజెంటేషన్.., బెస్ట్ పేపర్ బై సీనియర్ టీచింగ్ ఫ్యాకల్టీ.. రెండు విభాగాల్లో రాథోడ్ రెండు గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు ENT హెచ్ ఓ డి ప్రొ.రాథోడ్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
HYD బాచుపల్లిలోని ఓ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి, కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లెకు చెందిన అనూష బాచుపల్లి చౌరస్తాలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. దసరాకు ఇంటికెళ్లి తిరిగి.. తల్లిదండ్రులు నిన్న కాలేజీలో వదిలివెళ్లిన కొద్ది నిమిషాలకే కూతురు స్పృహ కోల్పోయిందని సిబ్బంది తెలిపారు. వారు కళాశాలకు చేరుకోగానే అనూష మరణించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఫోటోగ్రఫీ అంటే ఇష్టమై, వీడియో, ఫోటోగ్రాఫర్ కోర్స్ పూర్తి చేయాలనుకున్న వారికి HYD బషీర్ బాగ్ ఫోటోగ్రఫీ అకాడమీ ఛైర్మన్ శేఖర్ శుభవార్త తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ డిప్లమా కోర్సులు అందిస్తున్నారు. అక్టోబర్ 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని 2వ బ్యాచ్ నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుందని, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు.
గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు ఒక వ్యక్తి అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేయగా..ఒకదానికొకటి మూడు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన దారిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.