India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పంచాయతీ ఎన్నికల సమరానికి ఓటర్ జాబితా విడుదలైంది. ఈ జాబితాలో పొరపాట్లు ఉన్నా, కొత్తగా నమోదు చేసుకోవాలన్నా, అభ్యంతరం వ్యక్తం చేయాలన్నా MPDO, పంచాయతీ అధికారికి దరఖాస్తు ఇవ్వాలి.
→ Form-6: కొత్తగా పేరు చేర్చుకోవడానికి
→ Form-7: చెల్లని పేరు తొలగించే అభ్యంతరానికి
→ Form-8: పేరు, అడ్రస్, ఇతర కరెక్షన్స్‌కు
→ Form-8A: ఒక వార్డు నుంచి మరో వార్డుకు మారడానికి
నేడే దీనికి ఆఖరు తేది.
మీసేవ కేంద్రాల ఏర్పాటుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని RR జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. గండిపేట మండలం వట్టినాగులపల్లి, గండిపేట, కిస్మత్ పూర్, గంధంగూడ, మొయినాబాద్‌లోని అజీజ్ నగర్, హిమాయత్‌నగర్, కనకమామిడి, చౌదరిగూడలోని తుంపల్లి, ఎదిర, సరూర్‌నగర్‌లోని తుమ్మబౌలి, మంచాలలోని లోయపల్లిలో మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్ల కలకలం రేపిన విషయం తెలిసిందే. అమృత్‌సర్ ప్రయాణికుడి లగేజీలో సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు 8 లైవ్ బుల్లెట్లు గుర్తించారు. 32 ఏళ్ల పంజాబ్ వాసి సుఖ్దీప్‌సింగ్ ఇండిగో విమానంలో ఢిల్లీ మీదుగా అమృత్‌సర్ వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. లగేజీలో చెకింగ్‌లో పట్టుబడగా అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
యాలాల మండలం అన్నసాగర్ గ్రామం ఐక్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ సుమారు 200 కుటుంబాలు ఏకతాటిపై పండుగలు జరుపుకుంటాయి. ప్రతి సంవత్సరం అంజనేయస్వామి ఆలయంలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఐదు రోజుల పాటు పూజలు, అన్నదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం గ్రామస్థుల మధ్య సోదరభావాన్ని పెంచుతోంది.
మంగళవారం సాయంత్రి నుంచి నగరవ్యాప్తంగా విస్తారంగా వర్షం కురుస్తోంది. శేరిలింగంపల్లి, మియాపూర్, హఫీజ్‌పేట, కొండపూర్, గచ్చిబౌలి, లింగంపల్లి, నల్లగండ్ల, హైటెక్‌సిటీ, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి పండగ వేల మార్కెట్లకు వెళ్లే ప్రజలు, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది గత ఐదు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఇలా కఠినంగా వ్యవహరించడం ఎంతమాత్రం సరికాదని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఉస్మానియా వర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయ పదమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓయూలో హాస్టల్ భవనాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఉస్మానియా వర్సిటీ, తెలంగాణ అవిభక్త కవలలు లాంటివని.. పీవీ నరసింహారావు, చెన్నారెడ్డి, జైపాల్‌రెడ్డి ఉస్మానియా వర్సిటీ నుంచి వచ్చిన వారేనన్నారు. తెలంగాణలో ఏదైనా సమస్య వచ్చిన ఉద్యమానికి పురిటిగడ్డ ఉస్మానియా వర్సిటీయేనని తెలిపారు.
మరో 2 రోజుల్లో వినాయకచవితి రానుంది. ఈ నేపథ్యంలో వీధుల్లో ఎత్తైన గణనాథుడి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు యువకులు సన్నాహాలు చేస్తున్నారు. మండపాల ఏర్పాటు, అలంకరణ, పూజారిని నియమించడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. యువకులు, పిల్లలు ‘అన్నా.. అక్కా చందా ప్లీజ్’ అంటూ ఇళ్లకు క్యూ కడుతున్నారు. మరోవైపు కొంత మంది యువత వినూత్నంగా డప్పులతో చందా అడుగుతున్నారు.
పర్యావరణాన్ని కాపాడటానికి మట్టి విగ్రహాలను పూజించాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. జై గణేష్ భక్తి సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పర్యావరణహిత గణేశ్ విగ్రహాల ప్రచార పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. 3,24,000 పర్యావరణహిత విగ్రహాలు పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, రాష్ట్ర ఛైర్మన్ ఆనంద్ రావు, జాతీయ అధ్యక్షులు పాల్గొన్నారు.
ముసీనది పునరుజ్జీవానికి అడుగులు పడుతున్నాయి. రెండో త్రైమాసికంలో MRDCLకు రూ.375 కోట్లను కేటాయించారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తాన్ని ప్రాజెక్టు అమలు కోసం MRDCL పీడీ ఖాతాకు జమ చేస్తారు. ఈ కేటాయింపులు రూ.1500 కోట్ల బడ్జెట్‌లో భాగమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.