India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD పంజాగుట్ట NIMSలో పదేళ్లలో వెయ్యి మందికి కిడ్నీల మార్పిడి చేసి అరుదైన ఘనత సాధించింది. 2014 నుంచి 2024 వరకు ఈ ఘనత సాధించినట్లు అధికారులు తెలిపారు.1989లో ఆసుపత్రిలో కిడ్నీల మార్పిడి ప్రారంభించగా..అప్పటి నుంచి 2014 వరకు 730 మందికి కిడ్నీల మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. జీవన్ దాన్ కేడవర్ ట్రాన్ ప్లాంటేషన్ కార్యక్రమం ప్రవేశపెట్టడంతో కిడ్నీల మార్పిడి ఆపరేషన్ల వేగం గణనీయంగా పెరిగింది.
హైదరాబాద్‌లో నకిలీ పత్రాలతో ఏకంగా రూ.528.26 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసిన శ్రీకృష్ణ స్టాకిస్ట్ అండ్ ట్రేడర్స్ పై ED విచారణ జరిపింది. ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకుల నుంచి శ్రీకృష్ణ సంస్థ ప్రతినిధులు నకిలీ పత్రాలతో రుణాలు పొంది, చెల్లింపుల్లో జాప్యం చేసి, లోన్ వచ్చాక అవసరాలకు కాకుండా వేరే ఖాతాల్లోకి సొమ్ము మళ్లించారు.
అనుమతులు ఉంటే రియల్ ఎస్టేట్ వెంచర్ల జోలికి వెళ్లమని హైడ్రా తెలిపింది. రియల్ ఎస్టేట్ వెంచర్ల యజమానులు భయపడాల్సిన అవసరం లేదని, చెరువుల దగ్గర అనుమతులు ఉన్న నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చివేస్తుందని తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. అనుమతులున్న నిర్మాణాలను కూల్చేదిలేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారని, సీఎం ఆదేశాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.
మూసీ అంశం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్న సందించారు. మూసిలోకి వచ్చే డ్రైనేజీ డైవర్ట్ చేయకుండా మూసి బ్యూటిఫికేషన్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. హైదరాబాద్ సిటీలోని శామీర్పేట, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి తదితర ప్రాంతాల డ్రైనేజీ నీరు డైరెక్ట్ మూసిలో కలుస్తుందని. GHMC, జలమండలి మూసిలోకి డ్రైనేజీ పైప్ లైన్లు వేసిందని తెలిపారు.
మూసీ కోసం సౌత్ కొరియా టూర్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించారు. ప్రభుత్వం.. ఇంజనీర్లను, నిపుణులను, హైడ్రాలజిస్టులను స్టడీ చేసేందుకు పంపుతున్నందుకు అభినందించారు. తప్పకుండా వారందరూ కలిసి మూసీకి కావలసిన రూ.1.50 లక్షల కోట్లతో వస్తారని ఎద్దేవా చేశారు. #మూసీ లూటిఫికేషన్ అంటూ ట్విట్ చేశారు. కాగా.. టూర్లో పాల్గొనే 20 మందిలో 16 మంది మీడియా బృందం ఉండడం గమనార్హం.
ఎస్సీ వర్గీకరణ చేస్తామని పీఎం మోదీ ప్రకటించి ముందుకెళ్తుండగా.. MRPS మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్వాగతించి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 1 వరకు మాలల మహా పాదయాత్ర చేస్తామని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ తెలిపారు. డిసెంబర్ 1న మాలల మహా సంగ్రామ సభ నిర్వహిస్తామన్నారు.
పుస్తకాలు చదివే సంస్కృతి మరింతగా పెరగాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంత్రి కార్యాలయంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బుక్ ఫెయిర్‌కు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. పుస్తకాభిమానులకు అనుకూలంగా నగర నడిబొద్దున పుస్తక ప్రదర్శన నిర్వహించటం అభినందనీయమని కొనియాడారు.
రాచకొండ పోలీస్ స్టేషన్లకు త్వరలో సైకిళ్లు రానున్నాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెట్రోలింగ్ వాహనాలను పెంచడం, విజబుల్ పోలీసింగ్‌పై దృష్టి పెట్టినట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఇందులో భాగంగానే దాదాపు 200 సైకిళ్లను కొనుగోలుకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. తద్వారా ప్రతి పోలీస్ స్టేషన్‌కు 2 నుంచి 5 సైకిళ్లు వస్తాయన్నారు. ప్రస్తుతం 3,000 మంది స్పెషల్ బ్లూ కొట్స్ పోలీసులు సేవలు అందిస్తున్నారు.
బేగంపేటలో జరిగిన సౌత్ ఇండియా రీజినల్ సదస్సులో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొన్నారు. HYD ఇంటర్ ఫర్ సోషల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ వద్ద జరిగిన ఈ ప్రోగ్రాంలో గవర్నర్ తెలంగాణ చాప్టర్‌పై ప్రసంగించారు. ఆర్థిక, సామాజిక అంశాలను బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రముఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ నిపుణులు పాల్గొన్నారు.
HYDలోని శేర్లింగంపల్లి రాయదుర్గం వద్ద ఏర్పాటు చేసిన T-Hub ఇన్నోవేషన్లకు పుట్టినిల్లుగా మారుతోంది. 20 దేశాలకు చెందిన 180 మంది ప్రముఖ ఇన్నోవేటర్లతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన టెక్నాలజీ, నూతన ఇన్నోవేషన్ల ద్వారా యువతకు ఉపాధి కల్పించే అంశాలపై చర్చలు జరిపినట్లుగా టెక్నోక్రాంట్ సాయి అభినయ్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.