India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత జాగృతి ఆధ్వర్యంలో నేడు HYDలో బీసీ సంఘాల సభ జరగనుంది. ఉదయం 11 నుంచి సా.4 గంటల వరకు ఇందిరాపార్క్ వద్ద BRS MLC కవిత సభను నిర్వహించనున్నారు. సభకు నిన్ననే పోలీస్ శాఖ అనుమతి ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సభ నిర్వహించనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సభలో ప్రధానంగా డిమాండ్ చేయనున్నారు.
HYD నిలోఫర్ ఆసుపత్రిలో మరో వెయ్యి పడకల పెంపునకు చర్యలు చేపడుతున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రవికుమార్ చెప్పారు. నీలోఫర్ ఆసుపత్రికి తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర దేశాల నుంచి రోగులు వస్తున్నారని అందుకు తగ్గట్టుగా పడకలు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు 1,300 బెడ్లు ఉండగా కొత్త మరో వెయ్యి పడకలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.
నగర అభివృద్ధికి ఉద్యోగులకు అంకితభావంతో పనిచేసి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని GHMC కమిషనర్ ఇలంబర్తి ఉద్యోగులకు సూచించారు. ఈ మేరకు నూతన సంవత్సరం సందర్భంగా ఖైరతాబాద్‌లోని GHMC ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ను జోనల్ కమిషనర్లు, వివిధ విభాగాల హెచ్‌వోడీలు, కార్పొరేటర్లు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని సంకల్పంతో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
HYD జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంగ్ల నూతన సంవత్సరం-2025 సందర్భంగా ముఖ్యమంత్రికి మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. దేవాదాయ శాఖ అంశాలతో పాటు వరంగల్ ఎయిర్‌పోర్ట్, వరంగల్ నగర అభివృద్ధి గురించి చర్చించినట్టు సమాచారం.
HYDకు చెందిన మరో క్రికెటర్ సత్తా చాటుతున్నాడు. ఎల్బీనగర్ వాసి రాపోల్ సాయి సంతోష్ దేశవాళీ 2024-25 సీజన్‌లో అరుణాచల్ ప్రదేశ్ అండర్-23 క్రికెట్ టీమ్‌కు ఎంపికయ్యాడు. BCCI మెన్స్ అండర్-23 స్టేట్-ఏ ట్రోఫీ కోసం జరగనున్న పోటీలకు అరుణాచల్ ప్రదేశ్ జట్టు తరఫున ఆడనున్నాడు. 21 ఏళ్ల సంతోష్ జట్టులో ఆల్ రౌండర్‌గా రాణిస్తున్నాడు. గతంలో జాతీయ స్థాయి అండర్-16,17 గేమ్స్‌లో తెలంగాణ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.
రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారని MP చామల కిరణ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గాంధీభవన్‌లో మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. కొంతమంది సీఎంలు అవినీతి చేసి అందరికీ తెలిశారన్నారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయాలు తీసుకొని ఫేమస్ అయ్యారని వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చి రైతులను బీఆర్ఎస్ మోసం చేసేందుకు ప్లాన్ చేసిందని చామల ఆరోపించారు.
HYD నగరం నుంచి ORR వరకు ఉన్న 27 మున్సిపాలిటీలపై హైడ్రాకు అధికారం ఉందని కమిషనర్ రంగనాథ్ అన్నారు. అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 27 పురపాలక సంఘాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, శాటిలైట్ చిత్రాల ద్వారా ఆక్రమణలను గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. చెరువుల్లో భవన నిర్మాణ వ్యర్థాల డంపింగ్‌పై కూడా దృష్టి పెట్టామన్నారు. హైడ్రా వచ్చినప్పటి నుంచి ప్రజలకు FTL, బఫర్ జోన్‌పై అవగాహన పెరిగిందన్నారు.
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతుంటాయ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎగరవేస్తుంటారు. అయితే HYDలో కొందరు కైట్స్ ఎగరవేయడానికి చైనా మాంజా వాడుతుండడంతో రోడ్లపై వెళ్లే వారికి అవి ప్రమాదకరంగా మారాయి. గతంలో చైనా మాంజాతో గొంతులు తెగి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా ఆసిఫ్‌నగర్‌లో ఒకరు, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన దంపతులు బైకుపై వెళ్తుండగా మాంజాతో గాయాలపాలయ్యారు.
HYD, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో జరిగిన ట్రాఫిక్ ఉల్లంఘనల్లో +80.53 శాతం ఓవర్ లోడు, అధిక ప్యాసింజర్లను తీసుకెళ్లడమే అని వార్షిక రిపోర్టు తెలిపింది. +58.47 శాతం మైనర్ల డ్రైవింగ్ చేసి, ట్రాఫిక్ నియమ నిబంధనలను వాహనదారులు ఉల్లంఘించినట్లుగా వెళ్లడైంది. ఓవర్ లోడింగ్ వద్దని, అత్యధిక ప్యాసింజర్లను వాహనాలు ఎక్కించుకోవద్దని తద్వారా ప్రమాదాలు జరిగా అవకాశం ఉందని పోలీసులన్నారు.
HYD, RR, MDCL జిల్లాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో 50% పైగా ఐరన్ లోపంతో అనీమియా బాధితులుగా ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. హిమోగ్లోబిన్ సైతం సంపూర్ణంగా లేదని, విద్యార్థుల్లో రక్తహీనత ఉన్నట్లుగా గుర్తించినట్లు డా.ఉషా తెలిపారు. 5 నుంచి 8వ తరగతి మధ్య ఉన్న పిల్లలకు సైతం ఐరన్ లోపం ఉన్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.