RangaReddy

News July 20, 2024

సికింద్రాబాద్ మహంకాళికి బోనం సమర్పించిన దీపాదాస్ మున్షీ

image

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, యూఎస్ కన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఎ.లార్సన్, మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు. పార్టీ సనత్‌నగర్ ఇన్‌ఛార్జ్ కోట నీలిమ, నాయకులు పాల్గొన్నారు.

News July 20, 2024

BREAKING: HYD: సనత్‌నగర్ సీఐపై సీపీ చర్యలు

image

HYD సనత్‌నగర్ సీఐ పురేందర్ రెడ్డిపై సైబరాబాద్ సీపీ చర్యలు తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు విషయమై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తనతో సీఐ అసభ్యకరంగా చాటింగ్ చేశాడని బాధితురాలు సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసింది. అందంగా ఉన్నావు.. చెప్పిన ప్లేస్‌కి రావాలంటూ చాటింగ్ చేశాడని పేర్కొంది. మెసేజ్‌లను చూయించింది. దీంతో సీఐను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

News July 20, 2024

HYD: అప్పులు చేసిన ఘనత KCRది: మహేశ్ కుమార్ గౌడ్

image

పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత మాజీ సీఎం KCRది అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, MLCమహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పలువురు BRS నుంచి కాంగ్రెస్‌లో చేరగా ఆయన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం HYD గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రూ.2లక్షల రుణమాఫీ చేసి సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారని కొనియాడారు. BRS హయాంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై మీ కామెంట్?

News July 20, 2024

లష్కర్‌ బోనాల ఏర్పాట్లు పరిశీలించిన పొన్నం

image

రేపు, ఎల్లుండి లష్కర్‌లో జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ అధికారులు, పోలీసులను ఆయన ఆదేశించారు. బోనాలు తీసుకొచ్చే మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్‌లు ఏర్పాటు చేయాలన్నారు.

News July 20, 2024

బోనాలు: రేపు దద్దరిల్లనున్న హైదరాబాద్

image

అమ్మ బైలెల్లినాదో.. అంటూ రేపు‌ లష్కర్ హోరెత్తనుంది. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ల నడుమ ఆడపడుచులు ఉజ్జయిని మహంకాళికి బోనాలు సమర్పిస్తారు. హైదరాబాద్‌ బలగం‌ అంతా రేపు సికింద్రాబాద్‌‌లో సందడి చేస్తారు. ఇక ఎల్లుండి ఘటాల ఊరేగింపు‌ కోసం యువత ప్రత్యేకంగా సన్నద్ధం అవుతున్నారు. నగర పోలీసులు ఆలయం వద్ద ఇప్పటికే శాంతిభద్రతల పర్యవేక్షణ చేపట్టారు. ‌

News July 20, 2024

HYD: దేశంలోనే NO.1 సీఎం రేవంత్ రెడ్డి: మల్లు రవి

image

రైతులకు రూ.2లక్షల రుణమాఫీ ప్రారంభించి రేవంత్ రెడ్డి దేశంలోనే నంబర్-1 సీఎం అయ్యారని కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, రఘురాంరెడ్డి అన్నారు. HYD గాంధీభవన్‌లో వారు మాట్లాడుతూ.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ రైతులపై తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని కొనియాడారు. కేవలం 7నెలల్లోనే ప్రజల కోసం ఎన్నో పనులు చేశారన్నారు. BRSపదేళ్లు అధికారంలో ఉన్నా రైతులు, నిరుద్యోగుల కోసం ఏం చేయలేదని మండిపడ్డారు.

News July 20, 2024

HYD: 80 మంది హెడ్ కానిస్టేబుళ్లకు పదోన్నతులు

image

చార్మినార్ జోన్‌లో 80 మంది హెడ్ కానిస్టేబుళ్లు ఏఎస్సైలుగా పదోన్నతులు కల్పిస్తూ మల్టీ జోన్-2 ఐజీపీ సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జోన్ పరిధి హైదరాబాద్, సైబరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల యూనిట్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని పదోన్నతులు కల్పించామన్నారు. అడ్ హక్ ప్రాతిపదికన కల్పించిన పదోన్నతులు ప్రభుత్వం నిబంధనల మేరకు ఆమోదం పొందుతాయని చెప్పారు.

News July 20, 2024

HYD: టీ కోసం వెళ్లి ఇంజినీరింగ్ స్టూడెంట్స్ దుర్మరణం (UPDATE)

image

దుండిగల్‌ రోడ్డు ప్రమాదంలో శుక్రవారం ముగ్గురు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. VNR విజ్ఞాన్‌ జ్యోతి‌ కాలేజీలో అక్షయ్, అశ్విత్, నవనీత్, జస్వంత్‌ బీటెక్‌ ఫస్టీయర్ చదువుతున్నారు. మరో ఫ్రెండ్‌ హరితో కలిసి ORRవైపు టీ తాగేందుకు వెళ్లారు. ORR సర్వీస్ రోడ్డులో అతివేగంగా వెళ్తున్న వీరి కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో‌ అక్షయ్, అశ్మిత్, హరి దుర్మరణం చెందారు.

News July 20, 2024

HYD: బోనాల ఉత్సవాలు.. సీఎస్‌ ఆదేశాలు

image

సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని CS శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం కల్పించాలని సూచించారు. నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు రెండు 500 KVట్రాన్స్‌ఫార్మర్లు, డీజిల్ జనరేటర్లను స్టాండ్‌లో ఉంచామన్నారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంత రావు, GHMC కమిషనర్‌ ఆమ్రపాలి ఉన్నారు.

News July 20, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓అసెంబ్లీ సమావేశంలో జాబ్ క్యాలెండర్ విడుదల: చనగాని
✓సికింద్రాబాద్: లష్కర్ బోనాలకు సీఎం, డిప్యూటీ సీఎంకు ఆహ్వానం ✓గోల్కొండ అమ్మవారి హుండీ ఆదాయం రూ.3,91,205
✓శంషాబాద్:యువకుడి అసభ్య ప్రవర్తన.. కొట్టి చంపేసిన మహిళలు
✓బాలాపూర్:సీఎం 30 వేల ఉద్యోగాలిచ్చారు:KLR
✓ఖైరతాబాద్: శరవేగంగా 70 అడుగుల గణపయ్య విగ్రహ పనులు
✓HYD-బీజాపూర్ హైవే విస్తరణకు లైన్ క్లియర్