RangaReddy

News January 1, 2025

HYD: JAN 3 నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు

image

ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలు 2025 జనవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్‌లోని HICC వేదికగా జరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారందరినీ ఏకం చేసి తెలుగు భాష, సంప్రదాయం, సాహిత్యం, కళలను బలోపేతం చేయడంతో పాటు వాటిని భవిష్యత్తు తరాలకు అందించే లక్ష్యంతో నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహకులు తెలిపారు.

News January 1, 2025

ఈనెల 3న చలో కలెక్టరేట్ల ముట్టడి: ఆర్ కృష్ణయ్య

image

విద్యార్థుల ఫీజుల బకాయిలను వెంటనే చేల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 3న రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ల ముట్టడి నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. బుధవారం బషీర్‌బాగ్‌లో ఈ ముట్టడికి సంబందించిన కరపత్రం ఆవిష్కరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి గత 2ఏళ్లు ఫీజుల బకాయిలు రూ. 4వేల కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

News January 1, 2025

సికింద్రాబాద్‌ రైల్వేలో ఉద్యోగాలు

image

రైల్వే శాఖలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. తాజాగా RRB గ్రూప్‌ D నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తంగా 32000 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇందులో మన సికింద్రాబాద్ రీజియన్‌లోనూ ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్‌‌లో రైల్వే శాఖ పేర్కొంది. స్టార్టింగ్ శాలరీ రూ. 18000 ఉంటుంది. 18-36 ఏళ్లు గలవారు అర్హులు. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అర్హత: 10th, ITI ఉత్తీర్ణత.
SHARE IT

News January 1, 2025

HYD: న్యూ ఇయర్ ఎఫెక్ట్.. ఊదితే 550

image

HYD‌లో ఓ మందుబాబు పీకలదాకా తాగి పోలీసులకు చిక్కాడు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసి ఫలితం చూసి పోలీసులే షాకయ్యారు. పూర్తి వివరాలు.. నిన్న రాత్రి పంజాగుట్టలో పోలీసులు ఓ బైకర్‌ను ఆపి చెక్ చేశారు. బ్రీత్ అనలైజర్‌లో ఏకంగా 550 మీటర్ నమోదు కావడం గమనార్హం. బైక్‌ను సీజ్ చేసి మందుబాబుకు రిసిప్ట్ ఇచ్చి పంపారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ‘ఎంత తాగావు బ్రో’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

News January 1, 2025

HYD: రెండు నెలల బాలుడి హత్య..  జీవిత ఖైదు

image

ఆడపడుచుకు పిల్లలు పుట్టారని, తనకు సంతానం కలగలేదని అసూయ, కక్షతో రెండు నెలల పసిబాలుడిని హత్య చేసిన నిందితురాలికి జీవిత ఖైదు శిక్ష పడింది. అబ్దుల్లాపూర్‌మెట్ PS పరిధిలో అనాజ్‌పూర్‌కు చెందిన ఓరుగంటి శ్వేత గౌడ్(21)ని RR జిల్లా కోర్టు జడ్జి P.ప్రదీప్ నాయక్ మంగళవారం దోషిగా నిర్ధారించారు. ఆమెకు జీవిత ఖైదు, రూ.10,000 జరిమానా విధించారు. కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ K.జ్యోతిరెడ్డి వాదనలు వినిపించారు.

News January 1, 2025

తెలంగాణలోనే మన రంగారెడ్డి TOP

image

తెలంగాణ రాష్ట్రంలోనే పాల ఉత్పత్తిలో రంగారెడ్డి జిల్లా ముందంజలో ఉందని TGFDS తెలిపింది. అంతేకాక అత్యధిక మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లను కలిగి ఉన్నట్లుగా పేర్కొంది. RR జిల్లాలోని యాచారం, మహేశ్వరం, మంచాల, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల సహా అనేక ప్రాంతాల నుంచి పాడి రైతులు పాల వ్యాపారాల ద్వారా లబ్ధి పొందుతున్నట్లు తెలిపింది. HYD నగరం రంగారెడ్డి జిల్లాకు ఆనుకొని ఉండటం గొప్ప వరంగా అభిప్రాయపడింది.

News January 1, 2025

HYD: 2025 నుంచి రైళ్ల టైమింగ్స్ చేంజ్

image

రైళ్ల నూతన టైం టేబుల్ 2025 జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని సౌత్ సెంట్రల్ రైల్వే(SCR) తెలిపింది. MMTS రైళ్లు సికింద్రాబాద్- మేడ్చల్, ఫలక్ నూమ- ఉందానగర్, ఘట్కేసర్- లింగంపల్లి మధ్య నడిచే 88రైళ్లకు మార్పు చేసినట్లు పేర్కొంది.ప్రయాణించే ముందు ఆయా రైల్వే స్టేషన్ వద్ద టైమింగ్స్ తెలుసుకోవాలని పేర్కొంది. ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు వెళ్లే పలు రైళ్ల వేళల్లో చేసిన మార్పులు సైతం JAN1 నుంచి వర్తిస్తాయంది.

News January 1, 2025

VKB: పోస్టల్ ద్వారా పాస్ పోర్ట్ సేవలు

image

VKB జిల్లా కేంద్రంలో పోస్టల్ ద్వారా పాస్ పోర్ట్ సేవలు అందిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. పాస్ పోర్ట్ రీజినల్ ఆఫీసర్ స్నేహజ, సీపీవో శ్రీనివాస్ కలిసి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. HYD నగరంలో జరిగిన చర్చల్లో, రాష్ట్రవ్యాప్తంగా 14 పోస్టల్ పాస్ పోర్ట్ సేవ కేంద్రాల ద్వారా సేవలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. వికారాబాద్‌లో గతంలో రోజుకు 40 స్లాట్లు అందుబాటులో ఉండగా ప్రస్తుతం 80కి పెంచామన్నారు. 

News December 31, 2024

HYD: రోజు రోజుకు పెరుగుతున్న నేరాలు !

image

HYD నగరంలో భారీ స్థాయిలో నేరాలు పెరుగుతున్నాయి. సైబరాబాద్ పరిధిలో 2023లో 2,859 కేసులు నమోదు కాగా.. 37,689 కేసులు ఈ ఏడాది నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు హైదరాబాద్లోనూ కేసులు పెరిగాయి. సైబర్ నేరాలతో పాటు, డ్రగ్స్ కేసులు పోలీసులకు రోజు రోజుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రత్యేక బృందలతో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

News December 31, 2024

HYD: ఏడాదిలో 3207 రోడ్డు ప్రమాదాలు

image

2024 సంవత్సరంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3207 ప్రమాదాలు జరిగినట్లుగా వార్షిక రిపోర్టులో తెలిపారు. ఈ ప్రమాదాలలో ఏకంగా 653 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదాల్లో సైతం పలువురు ప్రాణాలు కోల్పోయారు. న్యూ ఇయర్ వేడుకల వేళ, అనవసరమైన డ్రైవింగ్ వద్దని, ప్రతి ఒక్కరు కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.