India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంగ్రెస్ అధిష్ఠానానికి గానీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్‌కు గానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో చిత్తశుద్ధి లేదని మందకృష్ణ మాదిగ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో వేసిన కమిషన్లు వాటి సిఫార్సులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి విషయంలో మాదిగలు వర్గీకరణ కోసం పోరాడాలన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసేందుకు గ్రూప్-1 అభ్యర్థులు అపాయింట్‌మెంట్ కోరారు. వారి విజ్ఞప్తి మేరకు కలిసేందుకు ఆయన సమయం ఇచ్చారు. గాంధీ భవన్ ముట్టడికి వచ్చిన అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేయగా.. వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన ఆదేశించారు. నేడు గాంధీ భవన్‌లో గ్రూప్-1 అభ్యర్థులతో చర్చించనున్నారు.
సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిపై దుండగుడి దాడి విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనకు వెనకున్న సంచలన విషయాలు పోలీసులు వెల్లడించారు. మెట్రోపోలీస్ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రసంగాలకు ప్రభావితుడైన నిందితుడు దాడికి పాల్పడ్డాడని తేల్చారు. 140 మందికిపైగా అకామిడేషన్ కల్పించి, భారీ సమావేశం నిర్వహించినప్పటికీ తమకు సమాచారం ఇవ్వకపోవడంతో హోటల్ యాజమాని, మేనేజర్‌పై కేసు నమోదు చేసి, హోటల్ సీజ్‌కు సిద్ధమయ్యామన్నారు.
గ్రేటర్ HYDలో వంతెనల బ్యూటిఫికేషన్ పనులను GHMC ప్రారంభించింది. ఇప్పటికే బషీర్ బాగ్ వంతెన పిల్లర్లపై వేసిన చరిత్రాత్మక కట్టడాల పెయింటింగ్ అందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తోంది. వంతెన పిల్లర్ వద్దకు వెళ్లి చూస్తే, నిజంగా నిర్మాణం మన పక్కనే ఉన్నట్లు ఉందని పలువురు తమ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. HYDలో గ్రీనరీ పెంచడంతో పాటు, నగరాన్ని చూడముచ్చటగా మార్చేందుకు కట్టుబడి ఉన్నామని GHMC తెలిపింది.
గ్రూప్-1 మెయిన్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో తెలంగాణ సీఎస్ శాంత కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీజీపీఎస్సీ కార్యాలయం నుంచి ఛైర్మన్ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రూప్-1 మెయిన్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అణగారిన ఆదివాసీలకు, అనాథలకు అవసరమైన సహాయాన్ని అందించాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు. బుధవారం రాజ్‌భవన్లో ఆయన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అధిపతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అనాథ బాలలకు, ఆదివాసీలకు అవసరమైన సహకారమివ్వాలని సూచించారు. సీఎస్ఆర్ కింద చేయగలిగిన 11రకాల సహాయాల ప్రతిపాదనలను ప్రభుత్వరంగ సంస్థల ప్రతినిధుల ముందు పెట్టింది.
ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు చెందిన వారు స్థానికులతో చేతులు కలిపి బండ్లను కొట్టేస్తున్నట్లు పోలీసులు తాజాగా తేల్చారు. HYD పాతబస్తి, శివారు ప్రాంతాల్లో దొంగతనాల కోసం మైనర్లకు కమీషన్ల ఆశ చూపిస్తున్నారు. కేవలం 10 సెకండ్లలో హ్యాండిల్ లాక్ తీసి ఎత్తుకెళ్తున్నారు. ఈ ఏడాది HYDలో 1,300 పైగా బైక్ చోరీ కేసులు నమోదు అయ్యాయి. ఇంటి బయట బైక్‌లు పార్కింగ్ చేసేవారు జాగ్రత్త. #SHAREIT
గోవా టూర్ వెళ్లాలనుకుంటున్న వారికి సౌత్ వెస్టర్న్ రైల్వే అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. సికింద్రాబాద్ నుంచి గోవాలోని వాస్కోడిగామా మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో ఉ.10.05కి సికింద్రాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు 17039 ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఇందులో 21 LHB కొచేస్, ఫస్ట్ ఏసీ క్లాస్-1, ఏసీ-2, టైర్-2, స్లీపర్ క్లాస్-7, జనరల్ క్లాస్-4 అందుబాటులో ఉన్నాయి. SHARE IT
గచ్చిబౌలి PS పరిధిలో సోమవారం అర్ధరాత్రి జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆటో డ్రైవర్ ప్రవీణ్‌ను లింగంపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. సోమవారం RCపురంలో బస్సు దిగిన యువతి(32) నానక్‌రాంగూడకు వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆమెపై కన్నేసిన డ్రైవర్ HCU సమీపంలోని మసీద్ బండ వద్ద అత్యాచారం చేసి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదైంది. తాజాగా నిందితుడిని అరెస్ట్ చేశారు.
డాక్టర్ BR అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులో ప్రవేశాలకు గడువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ సుధారాణి తెలిపారు. 2022-23, 2023-24లో డిగ్రీలో చేరిన 2nd, 3rd ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును చెల్లించాలని, సకాలంలో ఫీజు చెల్లించని వారు 30తేది లోపు చెల్లించొచ్చని తెలిపారు. braouonline వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు ఉంటాయన్నారు.
Sorry, no posts matched your criteria.