India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు చెందిన వారు స్థానికులతో చేతులు కలిపి బండ్లను కొట్టేస్తున్నట్లు పోలీసులు తాజాగా తేల్చారు. HYD పాతబస్తి, శివారు ప్రాంతాల్లో దొంగతనాల కోసం మైనర్లకు కమిషన్లు ఆశ చూపిస్తున్నారు. కేవలం 10 సెకండ్లలో హ్యాండిల్ లాక్ తీసి ఎత్తుకెళ్తున్నారు. ఈ ఏడాది HYDలో 1,300 పైగా బైక్ చోరీ కేసులు నమోదు అయ్యాయి. ఇంటి బయట బైక్‌లు పార్కింగ్ చేసేవారు జాగ్రత్త. #SHAREIT
రంగారెడ్డి జిల్లాలో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కందుకూరు PS పరిధి కొత్తగూడ ఫామ్ హౌస్‌లో దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఉషయ్య(55), శాంతమ్మ(50)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అన్నదమ్ముళ్లలా ఐక్యంగా ఉన్న మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టేందుకే ఎస్సీ వర్గీకరణ తెచ్చారని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఛైర్మన్ రాజు వస్తాద్ ఆరోపించారు. లోయర్ బ్యాంక్ బండ్‌లోని అంబేడ్కర్ భవన్లో సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశం నిర్వహించారు. టీడీపీ, బీజేపీ వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసం మాల మాదిగలను రెండుగా విభజించారని మండిపడ్డారు.
HYD నగరానికి ORR నుంచి RRR కలుపుతూ రేడియల్ రోడ్ల నిర్మాణం జరగనుంది. రేడియల్ రోడ్ల ద్వారా ప్రయాణ సదుపాయం మరింత మెరుగుపడటమే గాక.. ట్రాఫిక్ సమస్య సైతం తగ్గుతుందని ఇంజినీరింగ్ యంత్రాంగం భావించింది. వివిధ దశల్లో ఈ నిర్మాణం పూర్తి కానుంది. రేడియల్ రోడ్ల నిర్మాణం పూర్తయితే మొత్తం 1712KM మేర 60 రోడ్లు అందుబాటులోకి రానున్నాయి.
ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ అన్నారు. మంగళవారం గాంధీ ఆస్పత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. గోషామహల్‌లో దాదాపు 32 ఎకరాల్లో రూ. 2000 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాన్ని నిర్మించే పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. కొత్త భవనం అందుబాటులోకి వస్తే పేషెంట్ల సమస్యలు తీరుతాయని శుభవార్త చెప్పారు.
HMDA పరిధిలో LRS కింద ఇప్పుడు క్రమబద్ధీకరించుకుంటే 2020 నాటి భూమి విలువ ప్రకారం ఛార్జీలు ఉంటాయి. ఆలస్యం చేస్తే మూడు రెట్ల భారం పడనుంది. నిర్మాణ అనుమతి తీసుకునే నాటి భూమి విలువతో 33 శాతం జరిమానా, 14 శాతం ఓపెన్ ప్లాట్ డెవలప్‌మెంట్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే LRS రుసుములు చెల్లించాలని సూచిస్తున్నారు.
SHARE IT
HYD మేడ్చల్ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి బాసరగడి గ్రామంలో గోనెసంచిలో బాలిక మృతదేహం లభించింది. ఈనెల 12న కుమార్తె జోష్న(7) కనిపించడం లేదంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేయడంతో ఈరోజు బాలిక మృతదేహం గోనెసంచిలో కనిపించింది. దీంతో కేసు నమోదు చేసి, బాలికను ఎవరు హత్య చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
యునైటెడ్ నేషన్స్ పీస్ క్రాఫ్టర్స్ కాంక్లేవ్‌లో HYD రామంతపూర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటినట్లు అధికారులు తెలిపారు. హైకమాండేషన్ (UNGA) ఆర్యవీర్ గుప్తా, అర్జున్‌రావు వర్బల్ మెన్షన్ (UNHRC), వైష్ణవి వర్బల్ మెన్షన్(ECOSOC), తుమ్మల అక్షయ బెస్ట్ రిపోర్టర్‌గా గెలుపొందినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా వారికి పాఠశాల యాజమాన్యం శుభాకాంక్షలు తెలిపారు.
అంటువ్యాధుల చికిత్స కోసం HYD పంజాగుట్ట NIMS ఆస్పత్రిలో ప్రతి మంగళ, గురువారం ఓపీ సేవలు అందిస్తున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, స్క్రబ్ టైఫస్, లెప్టోస్పిరోసిస్, క్షయ, బ్లాక్ ఫంగస్, వైరల్ ఇన్ఫెక్షన్లకు ఈ విభాగంలో చికిత్స అందిస్తున్నారు. న్యుమోనియా, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు, కిడ్నీ, కాలేయం లాంటి అవయవ మార్పిడి తర్వాత సోకే ఇన్ఫెక్షన్లనూ నయం చేస్తున్నట్లు తెలిపారు.
చాలకాలంగా పెండింగులో ఉన్న అన్ని శాఖల బ్యాక్‌లాగ్ పోస్టులు త్వరలో భర్తీ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతోందని HYD సెక్రటేరియట్ సమావేశంలో పేర్కొన్నారు. మహిళా సంక్షేమ శాఖలో 10 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కరుణ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జేడీ శైలజ, తదితరులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.