India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చాలకాలంగా పెండింగులో ఉన్న అన్ని శాఖల బ్యాక్‌లాగ్ పోస్టులు త్వరలో భర్తీ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతోందని HYD సెక్రటేరియట్ సమావేశంలో పేర్కొన్నారు. మహిళా సంక్షేమ శాఖలో 10 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కరుణ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జేడీ శైలజ, తదితరులు ఉన్నారు.
ప్రముఖ కవి, గాయకుడు వేమూరి అనంత రామకృష్ణశర్మ, ప్రముఖ లలిత సంగీత, సీని గాయని వేమూరి మంజుల దంపతులు భారతరత్న డా. APJ అబ్దుల్ కలాం అవార్డుకు ఎంపికయ్యారు. సంగీతం, సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్న వేమూరి దంపతులకు ఈరోజు పినాకిని సంస్థ ఆధ్వర్యంలో HYD త్యాగరాయగానసభలో అవార్డు ప్రదానం చేయనున్నారు. MLC మధుసూదనాచారి, సీల్‌వెల్ కార్పొరేషన్ CMD బండారు సుబ్బారావు తదితరులు హాజరుకానున్నారు.
దంపతులు విడాకులు తీసుకున్నా.. కలిసే మోసాలు చేస్తూ పోలీసులకు చిక్కారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కర్ణాటకకు చెందిన మహ్మద్, రేష్మ HYDకు వచ్చి జాబ్ కన్సల్టెన్సీలో పనికి కుదిరారు. 2013లో వివాహం చేసుకున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నా.. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు దిగారు. ఆమె మరో పెళ్లి చేసుకున్నా మోసాలు చేస్తూ పట్టుబడ్డారు. కేసు నమెదు చేసి ఫోన్లు, ల్యాప్‌టాప్, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీన జిల్లా కలెక్టరేట్‌లు, మండల తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. సోమవారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణతో కలిసి సమావేశమయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలన్నారు.
ఓ వైపు మూసీ నదికి CM మరణశాసనం రాస్తూ.. మరోవైపు సుందరీకరణ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. 10 ఏళ్ల పాలనలో తమపై రాడార్ స్టేషన్ నిర్మాణానికి ఎంత ఒత్తిడి తెచ్చినా అంగీకరించలేదని, జనావాసాలు లేని ద్వీపాల్లో ఏర్పాటు చేయాల్సిన రాడార్‌ను తెలంగాణలో ఏర్పాటు చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పర్యావరణవేత్తలతో కలిసి BRS పోరాటం చేస్తుందన్నారు.
సికింద్రాబాద్‌లో <<14353764>>ముత్యాలమ్మ విగ్రహాన్ని<<>> ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని BJP మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. దాడిచేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తులు, శక్తులపట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే జరిగే పరిణామాలకు రేవంత్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
సాధారణంగా గణేశ్ లడ్డూ వేలం మీరు వినే ఉంటారు.. కానీ ఆ గ్రామంలో దుర్గాదేవి లడ్డూ వేలం నిర్వహించారు. ఆశ్చర్యంగా ఉంది కదూ.. RR జిల్లా మాడుగులలో అమ్మవారి విగ్రహం వద్ద లడ్డూ ప్రసాదం పెట్టి, నవరాత్రులు పూజలు చేశారు. అనంతరం ఆదివారం వేలం వేయగా స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి సూదిని నారాయణ్ రెడ్డి రూ.5,02,116కు లడ్డూను దక్కించుకున్నారు. చీరలు, ముక్కుపుడక ఇలా అన్నింటి వేలం పాటతో మొత్తం రూ.10,85,000 వచ్చాయి.
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ABSS)లో భాగంగా చేపట్టిన మల్కాజిగిరి రైల్వే స్టేషన్ పునరభివృద్ధి శరవేగంగా సాగుతోంది. వచ్చే ఆరు నెలల్లో పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. భారతీయ రైల్వే ద్వారా పునరుద్ధరణ, పునరాభివృద్ధి కోసం భారతదేశం అంతటా 1,275 స్టేషన్లు షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి. అందులో మల్కాజిగిరి రైల్వేస్టేషన్‌ను ఎంపిక చేసి అభివృద్ధి పనులకు రూ.27 కోట్లు కేటాయించారు.
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ కార్యదర్శి హనుమంతు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. హనుమంతు మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ పూర్తి చేయాలని కోరగా.. తప్పకుండా త్వరలో విలీనం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
అనారోగ్యంతో మృతిచెందిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొ.సాయిబాబా పార్థివదేహాన్ని నేడు నిమ్స్ ఆస్పత్రి నుంచి తీసుకొని గన్ పార్క్ చేరుకుంటారు. అక్కడ కాసేపు ఉంచి అనంతరం మౌలాలిలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్తారు. మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం ఉంచి 3 గంటలకు ఇంటి నుంచి అంతిమయాత్ర బయలుదేరుతుందని, పరిశోధనల నిమిత్తం పార్థివదేహాన్ని గాంధీ మెడికల్ కళాశాలకు అప్పగిస్తామని కుటుంబ సభ్యులు, ఉద్యమ సహచరులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.