RangaReddy

News July 15, 2024

ఓఆర్ఆర్ వరకు జీహెచ్ఎంసీ విస్తరణకు ప్లాన్

image

ఓఆర్ఆర్ వరకు జీహెచ్ఎంసీని విస్తరించినందుకు ప్రభుత్వం నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ఇటీవల వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి దీనిపై నివేదిక సిద్ధం చేసి నిపుణుల కమిటీకి అందజేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, గ్రామ పంచాయతీలను కలిపి జీహెచ్ఎంసీ కిందికి తీసుకువస్తే నగరం మరింతగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తుంది.

News July 15, 2024

పూలకు కేరాఫ్ అడ్రస్@గుడిమల్కాపూర్

image

హైదరాబాద్‌లో పూలకు కేరాఫ్ అడ్రస్‌ గుడిమల్కాపూర్ మార్కెట్. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చిన వ్యాపారస్థులు పూల క్రయవిక్రయాలు చేస్తుంటారు. పండగ వచ్చింది అంటే చాలు ఇక్కడ సందడిగా మారుతుంది. రూ. లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. 11 ఎకరాల్లో విస్తరించి ఉన్న మార్కెట్ వేలాది కుటుంబాలకు ఉపాధినిస్తుంది. ఇక బోనాల సీజన్‌‌ కావడంతో రెట్టింపు వ్యాపారం జరగనుంది.

News July 15, 2024

హైదరాబాద్‌కు BRS చేసిందేమీ లేదు: CM

image

HYDకు‌ బీఆర్ఎస్ చేసిందేమీ లేదని‌ CM రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం లష్కర్‌గూడ సభలో‌ ‘కాటమయ్య రక్ష కిట్ల’ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో‌ రంగారెడ్డి జిల్లా ప్రపంచంలోనే బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అవుతదన్నారు. నగరానికి ORR, ఎయిర్‌పోర్టు, ఐటీ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. డ్రగ్స్‌, గంజాయి తెచ్చుడు తప్పా BRS చేసిందేమీ లేదన్నారు. దీనిపై మీ కామెంట్?

News July 14, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి TOP NEWS

image

✓ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డిలో భారీ వర్షం
✓ముషీరాబాద్: వరదల్లో ఇరుక్కున్న కారు.. రిస్క్ చేసి కాపాడిన యువత
✓లష్కర్ గూడ: ఈత మొక్కలు నాటిన సీఎం
✓హయత్ నగర్: బైక్ పై యువత స్టంట్లు
✓కాంగ్రెస్ ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ:KTR
✓మొహర్రం ఉత్సవాలకు HYD చేరుకున్న గజరాజు

News July 14, 2024

హైదరాబాద్‌లో NDRF బృందాలను దించండి: దాన కిషోర్

image

నగరంలోని వర్ష ప్రభావ ప్రాంతాల్లో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ పర్యటించారు. నగరంలోని శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌తో పాటు వరద ప్రభావిత ప్రాంతాలైన దుర్గంచెరువు, నెట్రన్ గార్డెన్‌కు వెళ్లారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జలమండలి ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. జలమండలి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలన్నారు.

News July 14, 2024

HYD: రేపు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపు.. హై టెన్షన్

image

నిరుద్యోగుల డిమాండ్‌ల సాధన కోసం రేపు విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య, బీసీ జన సభ‌లు‌ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ప్రతి ఒక్క నిరుద్యోగి పాల్గొని నిరసన తెలియజేయాలని బీసీ నాయకులు కోరారు. రేపటి కార్యక్రమానికి భారీ ఎత్తున సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుచోట్ల అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో‌ పోలీసులు అప్రమత్తం అయ్యారు. రేపటి సెక్రటేరియట్‌ ముట్టడి పిలుపుతో నగరంలో హైటెన్షన్ నెలకొంది.

News July 14, 2024

అనంతగిరికి పోటెత్తిన హైదరాబాదీలు

image

అనంతగిరికి పర్యాటకులు పోటెత్తారు. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉండడంతో వికారాబాద్ జిల్లాకు భారీగా తరలివచ్చారు. ఆదివారం ఉదయం ప్రఖ్యాత శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. కోట్‌పల్లి ప్రాజెక్టు‌లో బోటింగ్‌ ఉండడంతో‌ టూరిస్టులతో సందడిగా మారింది.

News July 14, 2024

HYD: ఈత మొక్కలను నాటిన సీఎం

image

గీత కార్మికులకు కాటమయ్య రక్ష కవచాలను అందించేందుకు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక తాటి వనంలో ఈత మొక్కలను స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో కలిసి నాటారు. అనంతరం కాటమయ్య రక్ష కవచాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

News July 14, 2024

HYD: డ్రైవింగ్ చేస్తున్నారా..? ఇది మీకోసమే!

image

డ్రైవింగ్ చేసే వారికి HYD రాచకొండ పోలీసులు పలు సూచనలు చేశారు. ఓటు హక్కు కోసం 18, ఉద్యోగం కోసం 25, పెళ్లి కోసం 25-30 ఏళ్లు వేచి ఉంటాం.. కానీ ఓవర్టేక్ చేసే సమయంలో, వాహనాలు నడుపుతున్నప్పుడు 30 సెకండ్లు కూడా ఆగలేకపోతున్నాం ఎందుకని..? దయచేసి సరైన వేగం సరైన దిశలో నడిపి హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి, సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.

News July 14, 2024

HYD: 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ..?: KTR

image

HYD నగరంలోని అశోక్ నగర్ ప్రాంతంలో నిరుద్యోగులు రోడ్ల పై నిరసన ధర్నాలు చేపట్టడం పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అందించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నిరుద్యోగ మోసగాళ్లు, మోసపు వాగ్దానాలు చేసి KCR ప్రభుత్వంపై రెచ్చగొట్టారన్నారు. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా ఒక్క నోటిఫికేషన్, ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదన్నారు. మీరు ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగులు ఎక్కడ..? అని X వేదికగా ప్రశ్నించారు.