India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎస్సీలలో ఎక్కువగా లబ్ది పొందింది మాదిగ కులస్తులేనని, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అవసరం లేదని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఛైర్మన్ జి.చెన్నయ్య స్పష్టం చేశారు. బషీర్‌బాగ్ సమావేశంలో పోరాట సమితి ఛైర్మన్లు వెంకటేశ్వర్లు, బేల బాలకిషన్, గోపోజు రమేశ్, బత్తుల రాంప్రసాద్‌తో కలిసి చెన్నయ్య మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యుత్సాహం తగ్గించుకోవాలని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో ఈ దసరాకు తగ్గేదే లేదు. విందుకు వినోదం జతకానుంది. రేపు దసరాతో పాటు ఉప్పల్ వేదికగా ఇండియా VS బంగ్లాదేశ్ T-20 మ్యాచ్ జరగనుంది. నగరం అంతటా ఇక సందడే సందడి. ఉదయం నుంచే ఆలయాలు, అమ్మవారి మండపాలు కిక్కిరిసిపోతాయి. మధ్యాహ్నం బలగం అంతా కలిసి విందులో పాల్గొంటారు. సాయంత్రం వరకు హైదరాబాద్ అంతటా దసరా వైభోగమే. దీనికితోడు రాత్రి మ్యాచ్ ఉండడంతో క్రికెట్ ప్రియులు డబుల్ ధమాకా అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మున్సిపల్ అధికారులు, జీహెచ్ఎంసీ అమలు చేస్తున్న పథకాలను గురువారం సమీక్షించారు. ముఖ్యంగా ట్యాక్స్, ఫైనాన్స్, కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, కంట్రోల్ రూమ్ వంటి విభాగాల్లో జీహెచ్ఎంసీ తీసుకున్న చర్యలను ప్రదర్శించారు.
జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లు వివిధ విభాగాలలో తమ విధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
హైదరాబాద్ ఖాళీ అవుతోంది. దసరా సెలవులకు ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌తో పాటు MGBS, JBS, ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద బస్టాపుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. సొంత వాహనాల్లోనూ బయల్దేరడంతో సిటీ శివారుల్లోని టోల్‌గేట్ల వద్ద కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి, బీబీనగర్, దుద్దెడ టోల్‌గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే నగరంలో ట్రాఫిక్ కాస్త తగ్గింది.
తెలంగాణ ఉద్యమకారుల సంఘానికి సంబంధించిన కమిటీని రద్దు చేస్తున్నట్లు సంఘం వ్యవస్థాపకులు డా. పిడమర్తి రవి గురువారం వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కమిటీలో ఉన్న ఛైర్మన్ ఇనుప ఉపేందర్, అధ్యక్షుడు దాసర్ల శ్రీశైలం, కన్వీనర్ MD రహీమ్ కూడిన కమిటీని వెంటనే రద్దు చేస్తున్నామని ప్రకటించారు. త్వరలోనే తదుపరి కమిటీని ప్రకటిస్తామని ఆయన వివరించారు.
తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపనలు జరగనున్నాయి. 28 ప్రాంతాల్లో ఒకేసారి భవన నిర్మాణాలకు భూమి పూజ చేస్తున్నామని సీఎస్ శాంతి కుమారి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి, మధిరలో డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేస్తారని సీఎస్ ప్రకటించారు.
విస్తారా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన 20 నిమిషాలకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు అధికారులు తెలిపారు. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు.
రాచకొండ సీపీ సుధీర్ బాబు ఐపీఎస్ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు అంబర్‌పేట పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయుధ పూజ, వాహన పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు వాహనాలు, తుపాకులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ అడ్మిన్ డీసీపీ ఇందిర, అడిషనల్ డీసీపీ శ్యాంసుందర్, ఏసీపీ, ఇతర సిబ్బంది సైతం పాల్గొన్నారు.
హైదరాబాద్ సనత్‌నగర్ ESI మెడికల్ కాలేజీలో పారా మెడికల్, బీఎస్సీ నర్సింగ్ కోర్సులు ప్రారంభానికి అనుమతి లభించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆధ్వర్యంలో 194వ ESI సమావేశంలో ఆమోదం ముద్ర వేశారు. మెడికల్ కాలేజీ ఈ కోర్సులు ప్రారంభానికి అనుమతి లభించటంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
TG ప్రభుత్వం జులై 17న హైడ్రా ఏర్పాటు చేస్తూ GO 59 జారీ చేసింది. గ్రేటర్‌తో పాటు 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, 38 పంచాయతీలు, 61 పారిశ్రామికవాడలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను హైడ్రాకు అప్పగించింది. GHMC, స్థానిక సంస్థల పరిధి పార్కులు, లే అవుట్లు, ఖాళీ స్థలాలు, పరిశ్రమల శాఖ స్థలాలు, జలవనరుల స్థలాలు పరిరక్షించడమే దీని బాధ్యత. తాజాగా 51 విలీన గ్రామాలు హైడ్రా పరిధిలోకి వచ్చాయి.
Sorry, no posts matched your criteria.