India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని రంగారెడ్డి జిల్లా DMHO డా.వెంకటేశ్వరరావు సిబ్బందికి సూచించారు. రేపటి నుంచి ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించాలన్నారు. ఇంటింటికి తిరిగి జ్వర పీడితులను గుర్తించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. ముందు జాగ్రత్తగా శుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు.
తలకొండపల్లిలో శుక్రవారం నకిలీ మెసేజ్ చూపించి కిరాణా దుకాణం నుంచి రూ.2,000 కాజేసిన ముగ్గురు నిందితులను శనివారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. నిందితులు చుక్కాపూర్ గ్రామానికి చెందిన మహేశ్, నాని, ఆమనగల్లుకు చెందిన పవన్ అని తెలిపారు. వీరు కొన్ని రోజులుగా గూగుల్ పేలో ఫేక్ ట్రాన్సాక్షన్ చూపించి, కిరాణా దుకాణాల యజమానులను మోసం చేసినట్లు వివరించారు.
రంగారెడ్డి జిల్లాలో పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ నారాయణ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆమనగల్లు తహశీల్దార్‌గా మహమ్మద్ ఫయీం ఖాద్రీ, తలకొండపల్లి తహశీల్దార్‌గా రమేశ్, ఫరూఖ్‌నగర్‌కు నాగయ్య, నందిగామ తహశీల్దార్‌గా సైదులు, మహేశ్వరం తహసీల్దార్‌గా చిన్న అప్పలనాయుడు, కొందుర్గు తహశీల్దార్‌గా రాజేందర్‌రెడ్డిని నియమించారు.
ఆమనగల్లుకు కొందరు నార్త్ ఇండియా నుంచి వచ్చి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని స్థానిక వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. మార్వాడీలు అన్ని వ్యాపారాలకు విస్తరిస్తున్నారని, వాళ్ల మనుషులకే ఉద్యోగాలు ఇస్తుండటంతో స్థానికులకు ఉపాధి లభించట్లేదంటున్నారు. ఇందుకు వ్యతిరేకంగా రేపు ఆమనగల్లు బంద్‌కు స్థానిక వ్యాపారులు పిలుపునిచ్చారు.
GHMCలో నేటి నుంచి ఈ నెల 25 వరకు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు GHMC కమిషనర్ కర్ణన్ తెలిపారు. వర్షాకాలంలో వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను నివారించడానికి పరిసరాల పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. వాతావరణశాఖ సూచనల ప్రకారం రాబోయే రోజుల్లో వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉండడంతో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాల తొలగింపునకు ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.
కొందుర్గు మండలం చెరుకుపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జిల్లా కలెక్టర్, డీఈఓకు లేఖ రాశారు. తమ పాఠశాలలో పనిచేస్తున్న సుష్మ అనే టీచర్ గండిపేట పాఠశాలకు డిప్యూటేషన్‌పై వెళ్లారని, దీంతో తమ పాఠశాలలో శివారెడ్డి అనే టీచర్ ఒకరే ఉండడంతో చదువు బోధించడం ఇబ్బందిగా మారిందని, వెంటనే సుష్మ టీచర్‌ను తమ పాఠశాలకు పంపించాలని విద్యార్థులు కోరారు.
రంగారెడ్డి జిల్లాకు కొత్తగా వచ్చిన అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డిని భూమికి సంబంధించిన ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయంటూ బాధితులు వచ్చి కలుస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అడిషనల్ కలెక్టర్ ఆఫీస్ గోడపై బోర్డులు ఏర్పాటు చేశారు. ‘నా వద్ద 4,600 పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి.. వీటిని క్లియర్ చేయడానికి నాకు సమయం పడుతుంది.. దయచేసి సహకరించండి’ అంటూ ఇలా నోటీస్ అంటించి బాధితులని కోరుతున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో HYD- తిరుపతి అలియాన్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. 67 మంది ప్రయాణికులు బోర్డింగ్ అయిన తర్వాత సాంకేతిక లోపాన్నీ పైలెట్ గుర్తించారు. తిరిగి ప్రయాణికులను దింపేసి సాంకేతిక లోపాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. కాగా.. తిరుపతి వెళ్లాల్సిన 67 మంది ప్రయాణికులు హోల్డింగ్‌లొనే ఉన్నారు.
జాతీయస్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు అందులోనూ రాణించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని బేస్ బాల్ సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు కలాల శ్రీనివాస్ అన్నారు. ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీలు సోమవారంతో ముగిశాయి. పురుషుల విభాగంలో HYD, RR జాయింట్ విన్నర్లుగా, NZB తృతీయ స్థానంలో నిలిచింది. మహిళల విభాగంలో HYD, NZB జాయింట్ విన్నర్లుగా నిలిచాయి.
తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో గంటల ప్రతిపాదికన విధులు నిర్వహిస్తున్న బోధన సిబ్బంది పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గత మూడు నెలలుగా వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నామని, కుటుంబ పోషణ భారంగా మరి అప్పుల పాలవుతున్నామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పొరుగు సేవల సిబ్బంది కంప్యూటర్ ఆపరేటర్, పీడీ, నైట్ వాచ్మెన్, ఆఫీస్ సబార్డినేట్లకు సైతం 5నెలలకు పైగానే వేతనాలు రాలేదు.
Sorry, no posts matched your criteria.