India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మైనర్లు బైకర్స్, కార్లు నడపడం తగదని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకునేందుకు HYD బండ్లగూడలోని ఆర్టీఏ కార్యాలయానికి మంగళవారం ఒవైసీ వచ్చారు. ఈ సందర్భంగా రెన్యువల్‌కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం ఒవైసీ మీడియాతో మాట్లాడారు. మైనర్లు వాహనాలు నడపడం తగదని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
HYD అశోక్ నగర్‌లోని హాస్టల్‌లో ఉంటూ గ్రూప్-2, రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న గుగులోతు సురేఖ(22) ఆత్మహత్య చేసుకుంది. ఆమె బంధువులు తెలిపిన వివరాలు.. కామారెడ్డి(D) గాంధారి(M) సోమారం తండాకు చెందిన సురేఖకు నిజామాబాద్‌కు చెందిన అబ్బాయితో గత నెలలో ఎంగేజ్మెంట్ అయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న పెళ్లి కూడా నిశ్చయమైంది. కుటుంబ సమస్యలతో నిన్న సూసైడ్ చేసుకోగా గాంధీ ఆస్పత్రిలో ఈరోజు పోస్ట్‌మార్టం జరిగింది.
జీహెచ్‌ఎంసీలో కుక్కల బెడదను తగ్గించేందుకు వెటర్నరీ విభాగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 332వీధి కుక్కలను పట్టుకున్నారు. వాటికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌లు వేసినట్లు వెటర్నరీ అధికారులు వెల్లడించారు. AWBI నిబంధనల ప్రకారం 189వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేశారు. వీధికుక్కల వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని GHMC పేర్కొంది. మీప్రాంతంలో కుక్కలున్నాయా కామెంట్ చేయండి.
రాయదుర్గం PS పరిధిలో శివాని అనే యువతి రోడ్డుప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే.పోలీసులు తెలిపిన వివరాలు..CBITలో బీటెక్ 4వ ఏడాది చదువుతున్న శివాని నిజాంసాగర్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లి వచ్చింది. కాగా హాస్టల్‌కు వెళ్లేందుకు స్నేహితుడు వెంకట్ రెడ్డి బైక్ పై ఎక్కి నార్సింగి సర్వీస్ రోడ్డులో వెళ్తుండగా కారు ఢీకొట్టింది.దీంతో శివాని మృతిచెందగా వెంకట్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
HYD సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి బేగంపేట కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, కళ్లు తెరిచి చూస్తున్నాడని, కానీ ఎవరినీ గుర్తుపట్టలేకపోతున్నాడని డాక్టర్లు మేయర్‌కు వివరించారు. త్వరగా అతను కోలుకోవాలని మేయర్ ఆకాంక్షించారు.
మొన్నటి వరకు ట్రాన్స్‌జెండర్స్ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. నేడు గౌరవ వృత్తిలోకి వచ్చారు. ఏకంగా ఖాకీ చొక్కా ధరించి, HYD ట్రాఫిక్ విధుల్లో ఉన్నారు. వీరిని ట్రాఫిక్ విధుల్లోకి తీసుకోవాలన్న ఆలోచన మాత్రం సీఎం రేవంత్ దే. వాహనంలో వెళ్లే సమయంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భిక్షాటన చేయడం గమనించానని సీఎం ప్రకటించారు. ట్రాఫిక్‌పై పట్టు ఉండే వీరికి ట్రాఫిక్ జాబ్ ఇవ్వాలని ఆరోజే సీఎం భావించారట.
హైదరాబాద్‌లో ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపు విధానం అమలవుతోంది. జిల్లాలో దాదాపు 130 ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని రవాణా శాఖ తెలిపింది. రూ.25 లక్షలపై మినహాయింపు లభించినట్లుగా HYD జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేశ్ వివరాలను వెల్లడించారు.
శీతాకాల విడిది కోసం మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శనివారం హకీంపేట్ విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు వేణుగోపాల్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, మేడ్చల్ జిల్లా కలెక్టరు గౌతమ్ తదితరులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘనంగా వీడ్కోలు పలికారు.
ఉమ్మడి RR జిల్లాలో 52 వరకు ఎస్సీ వసతి గృహాల్లో 8 నెలలుగా జీతాలు లేవని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.160 మంది అవుట్ సోర్సింగ్, 44 మంది దినసరి కూలీలు పనిచేస్తున్నారు. ఇంటిదగ్గర కుటుంబాన్ని పోషించడం భారంగా మారుతుందని, అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు జీతాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ చికిత్సకు స్పందిస్తున్నాడు. వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉండగా.. అప్పుడప్పుడు జ్వరం వస్తోంది. నాడీ వ్యవస్థ ప్రస్తుతానికి స్థిరంగా పనిచేస్తుందని.. నిన్నటి కంటే ఈరోజు శ్రీతేజ ఆరోగ్యం మెరుగైందని శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
Sorry, no posts matched your criteria.