RangaReddy

News December 21, 2024

HYD: నేడు ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు

image

ఎల్బీ స్టేడియంలో నేడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సాయంత్రం క్రిస్మస్ వేడుకలను నిర్వహించనుంది. ఈ క్రిస్మస్ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సీఎంతో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరుకాన్నారు. ప్రభుత్వం తరఫున క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తుండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

News December 21, 2024

రాష్ట్రపతి నిలయానికి వారికి స్పెషల్ ఎంట్రీ

image

రాష్ట్రపతి నిలయం సందర్శనకు వసతి గృహాల విద్యార్థులకు ప్రత్యేక ప్రవేశం కల్పించనున్నారు. పిక్నిక్ స్పాట్‌లా ఉండేలా పిల్లలకు ప్లే ఏరియా, ఉద్యాన ఉత్సవాన్ని తిలకించేందుకు వసతి గృహాల విద్యార్థులను రాష్ట్రపతి నిలయానికి తీసుకువచ్చి ఆహ్లాదకర వాతావరణంలో జ్ఞాపకాలు గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన తాగునీరు, అంబులెన్స్, మొబైల్ టాయిలెట్లు, రవాణా, లైటింగ్ వంటి మౌళిక వసతులు కల్పిస్తున్నారు.

News December 21, 2024

HYD: పిక్నిక్ స్పాట్‌లా రాష్ట్రపతి భవన్

image

ఈసారి రాష్ట్రపతి భవన్ పిక్నిక్ స్పాట్‌లా సందర్శకులను ఆకట్టుకోనుంది. ‘ఉద్యాన ఉత్సవ్’ పేరుతో ఆహ్లాదకర వాతావరణంలో వ్యవసాయ, సాంస్కృతిక, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక భౌగోళిక వ్యవసాయం, వ్యవసాయం సమీకరణ, కుటీరాలను, స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. నిర్దేశిత పంటలు, వ్యర్థాలతో ఉపయోగాల తయారీ, ఇళ్లల్లో నర్సరీ, గార్డెనింగ్‌లో మెళకువలు సహా అనేక స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

News December 21, 2024

HYDలో తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవం

image

ధ్యానం, దాని ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి ఏటా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యానదినోత్సవాన్ని నిర్వహించాలని ఇటీవల ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు HYDలోని గచ్చిబౌలి స్టేడియంలో తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పాల్గొంటారు.

News December 21, 2024

HYD: మౌంటెనీర్ యశ్వంత్‌పై రాష్ట్రపతి ప్రశంసలు

image

మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాంతానికి చెందిన పర్వతారోహుడు భూక్య యశ్వంత్ HYD బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిశారు. ఈ సందర్భంగా తన మౌంటైనింగ్ గురించి రాష్ట్రపతికి వివరించగా ప్రశంసలు కురిపించి అభినందించారు. యశ్వంత్.. కీలిమంజారో, మౌంట్ ఎల్బ్రస్ లాంటి అనేక పర్వత శిఖరాలను సులభంగా అధిరోహించారు.

News December 21, 2024

GHMC ఆస్తులు కంప్యూటరైజ్ చేయాలి: కమిషనర్

image

నగర వ్యాప్తంగా ఉన్న GHMC ఆస్తుల వివరాలు పక్కాగా నమెదు చేసి కంప్యూటరైజ్ చేయాలని GHMC కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. ఆస్తులకు సంబంధించిన లీజ్ పూర్తయిన, ఇంకా కొనసాగుతున్న వివరాలను సేకరించి వారందరికీ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. లీజుకు తీసుకున్న వ్యక్తి వినియోగించుకుంటున్నారా లేదా అని క్షేత్రస్థాయిలో నివేదిక అందజేయాలన్నారు.

News December 21, 2024

HYD: మహిళా సాధికారతకు కృషి చేయాలి: ఇలంబర్తి

image

నగరంలో మహిళలు సాధికారత సాధించేందుకు కృషి చేయాలని కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్‌లో ఎస్టేట్, అర్బన్ కమ్యూనిటీ విభాగం ఆడిషనల్ కమిషనర్లు, ప్రాజెక్టు అధికారులతో పాటు జోనల్ పీఓలు, ఆసిస్టెంట్ ఎస్టేట్ అధికారులతో అయాశాఖల ప్రగతిపై కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. దీనికి అర్హులైన మహిళలను స్వయం సహాయక సంఘాలలో చేర్పించాలన్నారు.

News December 21, 2024

HYDలో నుమాయిష్ Loading!

image

హైదరాబాద్‌లో భారీ పారిశ్రామిక ప్రదర్శనకు సమయం ఆసన్నమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నుమాయిష్‌-2025కు సర్వం సిద్ధం చేస్తున్నారు. దాదాపు 2500 స్టాళ్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, 2000పైగా స్టాళ్లు ఈ సారి ఏర్పాటు చేస్తున్నారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు నుమాయిష్‌ కొనసాగనుంది.

News December 20, 2024

HYDలో హంతకుడికి మరణ శిక్ష

image

నాంపల్లి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. పోలీసుల వివరాలు.. భార్యాభర్తల మధ్య విబేధాలు రావడంతో ఆర్తి 2వ పెళ్లి చేసుకుంది. కోపం పెంచుకున్న సాయి(మాజీ భర్త) 2022లో నారాయణగూడలో 2వ భర్త నాగరాజు, ఆర్తి(గర్భిణి), విష్ణు(కుమారుడు)పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గర్భిణితో పాటు తండ్రి, కుమారుడు చికిత్స పొందుతూ చనిపోయారు. ఈకేసులో నిందితుడు సాయికి మరణ శిక్ష, సహకరించిన రాహుల్‌కు యావజ్జీవ కారగార శిక్ష పడింది.

News December 20, 2024

HYD: KTRపై కేసు నమోదు చేయడం దుర్మార్గం: RSP

image

ఈ-ఫార్ములా కేసులో సీఎం రేవంత్‌రెడ్డి A-1అని.. KTR కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ‘X’ వేదికగా అన్నారు. కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడంపై ఆయన స్పందించారు. నేను క్రైమ్ డీసీపీగా పనిచేశా.. నా అనుభవంలో ఎఫ్ఐఆర్ కాపీ చూశా.. అందులో ఎక్కడా రూ.55 కోట్ల నుంచి ఒక్క పైసా కేటీఆర్ జేబులోకి వెళ్లినట్లు లేదన్నారు. కానీ.. కేటీఆర్‌పై కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు.