India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు మహంకాళి అమ్మవారిని భవానీ దేవిగా ఆలయ పూజారులు అలంకరించారు. అమ్మవారి దర్శనానికి రోజురోజుకు భక్తుల తాకిడి పెరుగుతుండడంతో వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ఈవో మనోహర్ రెడ్డి ఏర్పాట్లను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. వేద పండితులు నిత్యం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం RR జిల్లా మహేశ్వరం పరిధి కందుకూరు, ముచ్చర్ల, మీర్‌ఖాన్‌పేట్, బేగరికంచె ప్రాంతాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రియల్ ఎస్టేట్ సంస్థలు ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి, ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు పరుగులు పెడుతున్నాయి. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పేరుతో కొందరు కేటుగాళ్లు నకిలీ పత్రాలతో భూ అమ్మకాలకు పాల్పడుతున్నారు. జర జాగ్రత్త!
రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి HYDలో అన్ని జిల్లాల కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్త ROR చట్టం, 2024 ముసాయిదాపై అధికారుల నుంచి మంత్రి అభిప్రాయాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
HYD చందానగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా ఆదివారం రాత్రి శేరిలింగంపల్లిలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పలువురు ముస్లిం నాయకులు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. TPCC మైనార్టీ సెల్ వైస్ ఛైర్మన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. అన్ని మతాల పండుగలను గౌరవించడం భారత పౌరుడిగా మన బాధ్యత అని అన్నారు.
ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడిన కొమురం భీమ్ జిల్లా జైనూరుకు చెందిన ఆదివాసి మహిళ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పూర్తి కావడంతో డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క గాంధీ ఆసుపత్రికి వచ్చి ఆమెను పరామర్శించారు. అలాగే కొంత నగదు, దుస్తులను అందజేశారు. గాంధీ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఉన్నారు.
జీహెచ్ఎంసీ ఉద్యోగులు, కార్మికుల కోసం మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి ఒక ప్రకటనలో తెలిపారు. కిమ్స్, సైన్లైన్ హాస్పిటల్ సహకారంతో డాక్టర్ విమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సర్కిల్, జోనల్ అధికారులతో పాటు ఆయా విభాగాల హెచ్ఓడీలు, సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఆపరేషన్ ఉపలబ్ద్‌లో భాగంగా రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుంగా రైల్వే ఫేక్ టికెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.567 విలువ చేసే లైవ్ టికెట్, రూ.8,409 విలువ చేసే ఇతర టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ టికెట్లు ఆల్రెడీ ఉపయోగించినట్లు గుర్తించారు. స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. SHARE IT
తెలంగాణలో బీసీ కులగణన చేపట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కాచిగూడ మున్నూరుకాపు భవన్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలను ఆయన ప్రారంభించారు. జెల్లి సిద్ధయ్య, మణికొండ వెంకటేశ్వరరావు, మంగళారపు లక్ష్మణ్, ఆత్మకూరి ప్రీతి, పొన్న సునీత పాల్గొన్నారు.
వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన అనుబంధ యూజీ కోర్సులకు ఈనెల 14 నుంచి 19 వరకు HYD రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రఘురామిరెడ్డి తెలిపారు. ప్రతీ రోజు ఉ.9 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు. కౌన్సెలింగ్ షెడ్యూల్, ఇతర వివరాల కోసం అభ్యర్థులు www.pjtsau.edu.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.
HYD ఎల్బీ స్టేడియంలో ఈనెల 9వ తేదీన నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందిస్తున్నట్టు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. 9న సా.4 గంటలకు జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, సంబంధిత కార్యదర్శులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. 11 వేలకు పైగా ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నియామక పత్రాలు అందించనున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.