India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వర్షం కురిసింది. మల్కాజిగిరిలో అత్యధికంగా 4.45 సెం.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మారేడ్‌పల్లిలో 2.85, సీతాఫల్‌మండిలో 2.43, కూకట్‌పల్లిలో 1.60, ఉప్పల్ 1.35 సెంటీమీటర్ల వర్షం పడింది. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరో 2 రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
HYD బేగంపేట్‌లోని ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె, మల్లారెడ్డి మనుమరాలు శ్రేయారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను భట్టి విక్రమార్కకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తదితరులున్నారు.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ.100 కోట్ల వ్యయంతో 50 ప్రాంతాల్లో 10 లక్షల లీటర్ల వరద నీటి నిల్వ సామర్థ్యం కలిగిన అండర్ ట్యాంక్స్ నిర్మిస్తోంది. GHMC కమిషనర్ ఆమ్రపాలి తెలిపిన వివరాల ప్రకారం.. ముఖ్యమైన 18 చోట్ల భూగర్భ ట్యాంకులు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ నగరంలో వరద నీరు నిలిచే 141 ప్రాంతాలను 50కి తగ్గించడంలో కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
సినీ నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె శనివారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. కాగా ఆయన కుమార్తె అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. KPHB ఇందు విల్లాస్‌లో రాజేంద్రప్రసాద్‌ను సినీ, రాజకీయ ప్రముఖులు ఓదార్చి గాయత్రి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆదివారం కేపీహెచ్‌బీలోని కైలాసవాసంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
HYD మహా నగరంలో ఆన్‌లైన్ మోసాలతో రూ.కోట్లు మాయమవుతున్న ఘటనలు బయటపడ్డాయి. BHEL టౌన్షిప్ విశ్రాంత ఉద్యోగి ఖాతా నుంచి రూ.13.16 కోట్లు, KPHB వైద్యుడి నుంచి రూ.8.6 కోట్లు, నోయిడా వ్యాపారి అకౌంట్ నుంచి రూ.9.09 కోట్లు మాయమయ్యాయి. ఈ సొమ్ము ‘గోల్డెన్ ట్రయాంగిల్’గా పిలిచే థాయ్‌లాండ్ , లావోస్, మయన్మార్ దేశాల్లోని ముఠాల చేతుల్లోకి వెళ్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గుర్తించింది.
HYD మహా నగరంలో చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని పర్యావరణవేత్తలు FTL, బఫర్ జోన్లను నిర్ధారించాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హెచ్ఎండీఏలోని 3,532 చెరువుల్లో 230కి మాత్రమే బఫర్ జోన్ నిర్ధారించారు. 2,525 చెరువులకు హద్దులు ఖరారు చేశారు. కాగా మరో 1,000 చెరువులకు 3 నెలల్లో హద్దులను నిర్ధారించాల్సి ఉంది.
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ సైదులును సస్పెండ్ చేస్తూ శనివారం రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌స్పెక్టర్ గడ్డం మహేశ్ హత్య కేసులో డబ్బులు తీసుకుని ఓ వ్యక్తిని కేసు నుంచి తప్పించాడనే ఆరోపణల నేపథ్యంలో మహేశ్ తరఫు బంధువులు రెండు రోజుల క్రితం సీపీకి ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా RR, MDCL జిల్లాల్లో ప్రయోగాత్మకంగా 26 చోట్ల సర్వే ప్రారంభమైంది. ముందు కుటుంబ పెద్దగా మహిళ పేరు, వివరాలు తీసుకుని ఆ తర్వాత మిగితా వారి డీటేల్స్‌ను అధికారులు తీసుకుంటున్నారు. కాగా ఫ్యామిలీ అంగీకరిస్తేనే రేషన్ కార్డు తరహాలో అంతా కలిసి ఉన్న ఒక ఫొటో తీసుకుంటున్నారు. SHARE IT
రాష్ట్ర రవాణా శాఖ ఆదాయంలో 45 శాతం ఆదాయం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే వచ్చిందని జిల్లా ఉప రవాణా కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ పేర్కొన్నారు. మణికొండలోని రవాణా శాఖ కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మొత్తం 33 జిల్లాల నుంచి రూ.3,195 కోట్ల ఆదాయం వస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే 45 శాతం ఆదాయం రావడం జరిగిందన్నారు.
రంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. శంషాబాద్‌లో తండ్రిని కొడుకు హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రారెడ్డి కాలనీకి చెందిన రాములు తరచూ మద్యం తాగి గొడవ పడేవాడు. ఈ క్రమంలో రాములు తన కూతురు ఇంటి వద్ద గొడవ పడటంతో కోపోద్రిక్తుడైన అతడి కొడుకు శివకుమార్ గొడ్డలితో నరికి హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.