India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దసరా సందర్భంగా HCU ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు హెచ్‌సీయూ డిపో మేనేజర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక బస్సులను ఈ నెల 12వ వరకు నడుపుతామన్నారు. లింగంపల్లి నుంచి MGBS వరకు, గచ్చిబౌలి నుంచి మహబూబ్ నగర్ వైపు, లింగంపల్లి నుంచి జహీరాబాద్ వైపు బస్సులు ఉంటాయని వివరించారు. వివరాలకు ఫోన్ నంబర్ 7382814235ను సంప్రదించాలని సూచించారు.
భారత్-బంగ్లా మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈ నెల 12న ఉప్పల్‌లో జరగనుంది. మ్యాచ్ టికెట్లు ఈ రోజు నుంచి విక్రయించనున్నట్లు HCA అధ్యక్షుడు జగన్మోహన్ తెలిపారు. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి పేటీఎంలో టికెట్లను విక్రయించనున్నట్లు చెప్పారు. టికెట్ ప్రారంభ ధర రూ.750 నుంచి రూ.15 వేలు ఉందన్నారు. ఆన్లైన్‌లో బుక్ చేసుకున్న టికెట్లను ఈ నెల 8 నుంచి 12 వరకు జింఖానా స్టేడియంలో రిడంప్షన్ చేసుకోవాలన్నారు.
ఈ నెల 12న ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో భారత్ VS బంగ్లాదేశ్ మధ్య T20-2024 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. అందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను రాచకొండ CP సుధీర్ బాబు పరిశీలించారు. అనంతరం DCPలు, ACPలు, HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్‌తో సమావేశం నిర్వహించారు. క్రికెట్ అభిమానులకు అసౌకర్యం కలగవద్దని, T20 మ్యాచ్ నిర్వహణకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు CP సుధీర్ బాబు వెల్లడించారు.
HYD,ఉమ్మడి RRలోని ప్రసిద్ధ అమ్మవారి ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ మహంకాళమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మ, బల్కంపేట్ ఎల్లమ్మ, శామీర్‌పేట్ కట్ట మైసమ్మ, చార్మినార్ భాగ్యలక్ష్మీ, గోల్కొండ జగదాంబిక, లాల్‌దర్వాజ సింహవాహిని,మైసిగండి మైసమ్మ, కొత్తపేట అష్టలక్ష్మీ, బోడుప్పల్ నిమిషాంబిక ఆలయాల్లో వివిధ రూపాల్లో మాతలు దర్శనమిస్తున్నారు. మరి ఈఆలయాలకు మీరు వెళ్లారా కామెంట్ చేయండి.
మేడ్చల్ జిల్లాలో కాసేపటి క్రితం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. శామీర్‌పేట్ పరిధి మూడుచింతలపల్లి మండలం కొల్తూరు చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. దసరా సెలవుల నేపథ్యంలో హర్ష, మణికంఠ, మనోజ్ ఇంటి దగ్గర నుంచి ఆడుకుంటూ చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ ఈత కొడదామని దిగి ఊపిరాడక చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. > సెలవు రోజుల్లో పిల్లలు జర జాగ్రత్త..!
ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వహణ కమిటీ ఛైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లను, కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించినట్లు విజయలక్ష్మి చెప్పారు.
మాజీ మంత్రి KTR వెంటనే మంత్రి కొండా సురేఖకు సారీ చెప్పాలని TPCC ప్రధాన కార్యదర్శి చెకోలేకర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. HYD బషీర్‌బాగ్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. KTR తరచూ మహిళా ప్రజాప్రతినిధులను కించ పరుస్తున్నాడని మండిపడ్డారు. ఆయన తన BRS పార్టీ సోషల్ మీడియా ద్వారా కొండా సురేఖను ట్రోలింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలోనూ మంత్రి సీతక్కపై నోరు పారేసుకున్నారని ఫైర్ అయ్యారు.
ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వహణ కమిటీ ఛైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లను, కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించినట్లు విజయలక్ష్మి చెప్పారు.
నిర్మాణ్ సంస్థ, తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా ఈరోజు హైకోర్టులో మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఉస్మానియా సూపరింటెండెంట్ డా.రాకేశ్ సహాయ్ తెలిపారు. ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ముఖ్యఅతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు.
సికింద్రాబాద్ నుంచి గోవాకు ట్రైన్స్ పెంచాలని ఉన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ క్రమంలో గోవాకు వారానికి రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడవనున్నాయి. ఇవి అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి సికింద్రాబాద్ నుంచి గోవా మధ్య నడుస్తాయి. సికింద్రాబాద్- వాస్కోడగామా రైలు (17039/17040) బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి గురు, శనివారాల్లో వాస్కోడగామా నుంచి నడుస్తుంది.
Sorry, no posts matched your criteria.