India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✓క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఆన్ లైన్ బ్యాంకింగ్, కంప్యూటర్, మొబైల్ లాంటి వాటి పాస్వర్డ్ తరచుగా మార్చుకోవాలి
✓పాస్వర్డ్ పెట్టేముందు స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉండేలా చూసుకోవాలి
✓పాస్వర్డ్ వివరాలను ఎంత దగ్గర వారికైనా చెప్పొద్దు
✓ఫేక్ మెసేజ్ లింకులు, మెయిల్స్, కాల్స్ పై స్పందించకండి.
✓సైబర్ నేరంగా గుర్తిస్తే 1930కు కాల్ చేయండి
•పై సూచనలు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి చేశారు.
‘కర్ణుడి చావుకు సవాలక్ష’ కారణాలు అన్నట్టు HYDలో సైబర్ నేరాలతో రూ.కోట్లు మోసపోతున్న పరిస్థితికి అనేక కారణాలు ఉన్నాయి. అధిక వడ్డీతో ఆశ చూపటం, ట్రేడింగ్, కస్టమర్ కాల్ సెంటర్, హెల్ప్ లైన్ పేరిట, హై ప్యాకేజీ జాబ్, OTP మోసాలు, ఫేక్ లింకులు, ఫేక్ కాల్స్, ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్, ఉచిత విదేశీ ప్రయాణాలు, మ్యాట్రిమోనీ పేరిట మాయ మాటలు చెప్పి నట్టేట ముంచి రూ.కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. జర జాగ్రత్త!
✓తోపుడు బండ్ల నిర్వాహకులు చేతికి గ్లౌజులు, నెత్తిన టోపీ ధరించాలి
✓దుమ్ము అధికంగా ఉన్నచోట, మురుగు కాలువల పక్కన ఆహారం విక్రయించవద్దు
✓ఆహార పదార్థాలపై మూతలు తప్పనిసరి
✓ కవర్లలోకి గాలిని నోటితో ఊదవద్దు
✓ కూరగాయలు, ఉల్లిగడ్డలు ముందు రోజు కోసి నిల్వ ఉంచొద్దు
✓శుద్ధి చేసిన నీటిని మాత్రమే ఉపయోగించాలి
•HYD తార్నాక NIN ఈమేరకు సూచనలు చేసింది.
HYD ప్రజల క్షేమం, భద్రత కోసమే హైడ్రా, మూసీ ఆపరేషన్లు స్టార్ట్ చేశామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. తమ ప్రభుత్వం రూ.కోట్లు కొల్లగొడుతోందని KTR, హరీశ్ రావు ఆరోపణలు అర్థరాహిత్యమని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తే HYD అభివృద్ధిని అడ్డుకున్నట్టే అని వ్యాఖ్యానించారు. ఇష్టానుసారం మాట్లాడుతున్న KTR, హరీశ్ రావును KCR కంట్రోల్ చేయాలని, రాష్ట్ర భవిష్యత్తును వీళ్లు అడ్డుకుంటున్నారన్నారు.
యువత IT వైపే మొగ్గు చూపుతున్నారు. కోర్ బ్రాంచీలకు కష్టాలు ఏర్పడుతున్న తరుణంలో ఇంజనీరింగ్ కోర్ బ్రాంచ్ అభ్యసించిన వారికి ప్రత్యేక స్కాలర్షిప్ ఇచ్చేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. రాజధాని HYDలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో IT, CSE బ్రాంచుల్లో 99% సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి.అదే కోర్ బ్రాంచీల్లో అనేక ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి.
HYD, RR, MDCL, నల్గొండ, సంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట జిల్లాలకు HMDA 2031 మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. అయితే మాస్టర్ ప్లాన్ సహా, ఈ 7 జిల్లాల పరిధిలోని భూ వివరాలను ఒక్క క్లిక్‌తో ప్రజలు చూసుకునేందుకు ప్రత్యేక యాప్ రానుంది. ఇందులోనే చెరువుల FTL, బఫర్ జోన్ వివరాలు సైతం ఉంటాయి. భవన అనుమతులకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
✓HYDలోని ఆర్మీ డెంటల్ కాలేజ్ ఇండియాలో 40వ ర్యాంకు సాధించింది
✓ఉస్మానియా మెడికల్ కాలేజ్ 48వ ర్యాంకు సాధించింది
✓న్యాయవిద్యలో నల్సార్ యూనివర్సిటీకి 3వ ర్యాంకు
✓ఇన్నోవేషన్ విభాగంలో IITH మూడో ర్యాంకు
✓పరిశోధనల్లో IITH 15, HCU 18 ర్యాంకు
✓వ్యవసాయ కళాశాలల్లో జయశంకర్ యూనివర్సిటీ 37వ ర్యాంకు
✓IIIT HYD టాప్ 100 యూనివర్సిటీలో 74వ ర్యాంక్
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మతపరమైన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్ వినియోగంపై నిషేధం విధిస్తూ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనలు, ప్రభుత్వ అనుమతులను ఉల్లంఘిస్తే బీఎన్ఎస్ 223, 280, 292, 293, 324, బీఎన్ఎస్ఎస్ 152, పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 15 కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే KTRపై HYD వనస్థలిపురం PSలో కాంగ్రెస్ నేత, TPCC మీడియా & కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఈరోజు ఫిర్యాదు చేశారు. మూసీ ప్రక్షాలనకు రూ.1.50 లక్షల కోట్లు కేటాయించారని అందులో రూ.25వేల కోట్లు ఢిల్లీ పెద్దలకు దోచి పెట్టేందుకే ఈ ప్రణాళిక చేశారని ఇటీవల KTR ఆరోపించారు. సీఎంపై, కాంగ్రెస్ అధిష్ఠానంపై తప్పుడు ఆరోపణలు చేసిన KTRపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీప్తి శ్రీనగర్ సీబీఆర్ ఎస్టేట్‌లో సోమవారం జరిగిన హత్య కేసును మియాపూర్ పోలీసులు ఛేదించారు. భర్తతో విడిపోయిన స్పందన (29) అమ్మ, తమ్ముడితో కలిసి ఉంటోంది. సోమవారం హత్యకు గురి కావడంతో పోలీసులు ఆధారాలు సేకరించారు. చిన్ననాటి క్లాస్మేట్ బాలు హత్య చేసినట్లు గుర్తించారు. మృతురాలు భర్తతో విడిపోవడంతో ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించగా ఒప్పుకోకపోవడంతో హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడన్నారు.
Sorry, no posts matched your criteria.