RangaReddy

News October 2, 2024

HYD: చిన్ననాటి స్నేహితుడే చంపేశాడు!

image

దీప్తి శ్రీనగర్ సీబీఆర్ ఎస్టేట్‌లో సోమవారం జరిగిన హత్య కేసును మియాపూర్ పోలీసులు ఛేదించారు. భర్తతో విడిపోయిన స్పందన (29) అమ్మ, తమ్ముడితో కలిసి ఉంటోంది. సోమవారం హత్యకు గురి కావడంతో పోలీసులు ఆధారాలు సేకరించారు. చిన్ననాటి క్లాస్మేట్ బాలు హత్య చేసినట్లు గుర్తించారు. మృతురాలు భర్తతో విడిపోవడంతో ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించగా ఒప్పుకోకపోవడంతో హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడన్నారు.

News October 2, 2024

HYD: దుర్గామాత మండపాలు.. అనుమతి తప్పనిసరి!

image

HYDలో దుర్గామాత మండపాలు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. https://policeportal.tspolice.gov.in/index.htm లింక్ ద్వారా దరఖాస్తు చేసుకొని, సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో అప్లికేషన్ ఫారంని సబ్‌బిట్ చేయాలని స్పష్టంచేశారు. మండపం ఎత్తు, నిమజ్జనం, నిర్వాహకుల సమాచారం అందులో పొందుపర్చాలి.
SHARE IT

News October 2, 2024

HYD: ప్రపంచాన్ని మేల్కొల్పిన గొప్ప మహనీయుడు: KTR

image

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పార్టీ అగ్రనాయకులతో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీలకు తెలంగాణ భవన్లో నివాళులర్పించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, మహమూద్ అలీ, పార్టీ నాయకులు, సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్ తదితర ప్రముఖులతో కలిసి ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు.

News October 2, 2024

HYD: ‘ద‌స‌రా సెల‌వుల్లో పాఠ‌శాల‌లు నిర్వ‌హిస్తే చ‌ర్య‌లు’

image

రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు ఈ నెల 14 వ‌ర‌కు ద‌స‌రా సెలవులు ఇస్తున్న‌ట్లు విద్యాశాఖ ప్ర‌క‌టించింది. 15వ తేదీన తిరిగి పాఠ‌శాల‌లు ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ ఆదేశాలు పాటించ‌కుండా ప్రత్యేక క్లాసెస్, ట్యూషన్లు వంటివి కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ నిర్వ‌హిస్తే, అలాంటి పాఠ‌శాల‌ల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని విద్యాశాఖ అధికారులు హెచ్చ‌రించారు.

News October 2, 2024

HYD: మూసీ ప్రజలు నిశ్చింతంగా ఉండండి: మధుయాష్కి

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఇంటిని అక్రమంగా కూల్చదని దానికి నాది గ్యారెంటీ అని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అంటేనే పేదలకు ఇళ్లు ఇచ్చే ప్రభుత్వమని, ఎవరి ఇళ్లు కూలగొట్టదని పేర్కొన్నారు. ఇళ్ల పైకి ఒక్క గడ్డపార రాదని.. ఒక జేసీబీ కూడా రాకుండా చూసే బాధ్యత తమదని అన్నారు.

News October 2, 2024

HYD: పండుగల తేదీలు ఫిక్స్ చేసిన ‘శ్వాస్’

image

సనాతన ధర్మ వ్యాప్తికి, సమాజ శ్రేయస్సు దృష్ట్యా పండగలు విశేష పర్వదినాల తేదీలను సిద్ధం చేశారు. ప్రజలు ఏలాంటి గందరగోళానికి గురికాకుండా ఉండేందుకు రాబోయే ‘విశ్వావసు నామ సంవత్సరం-2025-26’లో పండుగల తేదీలను నిర్ణయించినట్లు శ్రీ వైష్ణవ ఆగమ సంప్రదాయ సేవా సమితి (శ్వాస్) ప్రకటించింది. నిర్ణయించిన పండగల తేదీలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అందజేస్తామని శ్వాస్ తెలిపింది.

News October 2, 2024

HYD: బైకు దొంగలొస్తున్నారు జాగ్రత్త!

image

HYDలో బైకులు ఎత్తుకు పోతున్నట్లు నిత్యం కేసులు నమోదవుతున్నాయి. కాగా ఘరానా దొంగలే కాకుండా జల్సాలకు అలవాటు పడ్డ కొందరు యువకులు ఈ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. ఉప్పల్, అంబర్‌పేట, ఆర్టీసీ క్రాస్‌రోడ్, ఖైరతాబాద్, సోమాజిగూడ, అఫ్జల్‌గంజ్‌, ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, యాచారం, మంచాల ఇళ్ల ముందు బైకులు ఎత్తుకెళ్లి అమ్మేస్తున్నారు. పండగలకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.

News October 1, 2024

HYD: ‘దళితుడిని వీసీగా నియమించాలి’

image

తెలుగు విశ్వవిద్యాలయానికి ఇంతవరకు దళితుడిని వీసీగా నియమించలేదని మంగళవారం దళిత బహుజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. HYDలో మాట్లాడుతూ.. బీసీ, ఓసీ, బ్రాహ్మణులు వీసీలుగా పనిచేసిన తెలుగు విశ్వవిద్యాలయానికి ఇప్పుడు తమ బహుజనులను నియమించాలని సీఎంను కోరారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమ నాయకుడు ఆచార్య బన్న అయిలయ్యను వీసీగా నియమించాలని ఈ సందర్భంగా సూచించారు.

News October 1, 2024

హైదరాబాద్‌లో STAY ALERT

image

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసింది. మరో 2 గంటలు నగరంలో కుండపోత వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా మణికొండ, మాదాపూర్, KPHB, బాలానగర్‌, నార్సింగి, అత్తాపూర్, మియాపూర్, ట్యాంక్‌బండ్ పరిసరాల్లో వర్ష సూచన ఉందన్నారు. ఇప్పటికే నార్సింగిలో వాన దంచికొడుతోంది.
SHARE IT

News October 1, 2024

HYD: దేవాలయాల్లోని ప్రసాదాలకు FOOD లైసెన్స్

image

HYDలోని పలు దేవాలయాల్లో విక్రయించే ప్రసాదాలకు ఫుడ్ లైసెన్సులు జారీ చేశారు. ఇందులో SEC-మహంకాళి టెంపుల్, బల్కంపేట-ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానం, కర్మాన్‌ఘాట్-హనుమాన్ దేవస్థానం, ఎస్పీరోడ్డు-వీర హనుమాన్ దేవస్థానం, సనత్ నగర్- హనుమాన్ దేవస్థానం, జూబ్లీహిల్స్-పెద్దమ్మ దేవాలయం, వివేక్ నగర్ హనుమాన్ దేవాలయం, RTC క్రాస్ రోడ్డు లక్ష్మీగణపతి దేవస్థానం,మినిస్టర్ రోడ్డు శ్రీసాయిబాబ సమాజం, SEC-గణేష్ టెంపుల్ ఉన్నాయి.