RangaReddy

News July 6, 2024

HYD: సూర్యుడికి దూరంగా భూమి: సంచాలకులు శ్రీరఘునందన్

image

సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకారంలో పరిభ్రమిస్తోన్న భూమి శుక్రవారం అత్యంత దూరంగా వెళ్లిందని HYDలోని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సంచాలకులు, అంతరిక్ష పరిశోధన నిపుణులు N.శ్రీరఘునందన్ తెలిపారు.HYDలో ఆయన మాట్లాడుతూ.. సూర్యుడికి దగ్గరగా ఉన్న రోజు (JAN 3, 2024)తో పోలిస్తే 50 లక్షల కిలో మీటర్ల దూరంగా ఉందన్నారు. సూర్యుడు భూమికి దగ్గరగా ఉంటే వేడి ఎక్కువ ఉంటుందనే భావన ఉందని, ఇందుకు విరుద్ధంగా JANలో ఉందన్నారు.

News July 6, 2024

HYD: చేతులు లేకున్నా సత్తాచాటాడు!

image

నగరంలో లింగప్ప అనే పారా అథ్లెట్ రెండు చేతులు లేకున్నా సత్తా చాటాడు. తెలంగాణ రాష్ట్ర పారా అథ్లెటిక్స్ 100 మీటర్ల పోటీలో ఏకంగా బంగారు పతకం సాధించాడు. ఈ నెల 15 నుంచి 17 వరకు బెంగళూర్‌లో జరిగే జాతీయ పారా అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు RR జిల్లా అథ్లెటిక్స్ కోచ్ సాయి రెడ్డి తెలిపారు. నిరుపేద అయిన లింగప్ప టాలెంట్ ముందుకు వెళ్లాలంటే సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోచ్ పిలుపునిచ్చారు.

News July 6, 2024

HYD: ఏ జిల్లాలో.. ఎన్ని చెరువులు..?

image

చెరువుల రక్షణ, సుందరీకరణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. HYD జిల్లా పరిధిలో 28, రంగారెడ్డి జిల్లా పరిధిలో 1078, మేడ్చల్ జిల్లాలో 620, మెదక్ జిల్లాలో 589, సంగారెడ్డి జిల్లాలో 603, సిద్దిపేట 347, యాదాద్రి భువనగిరి జిల్లాలో 267 చెరువులు ఉన్నాయి. చెరువులను అభివృద్ధి చేసేందుకు HMDA కసరత్తు చేస్తున్నట్లుగా తెలిపింది.

News July 6, 2024

HYD: రూ.498 కోట్లతో GI సబ్ స్టేషన్ కోసం గ్రీన్ సిగ్నల్

image

ORR లోపలి ప్రాంతాన్ని GHMCగా విస్తరించటంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిన నేపథ్యంలో దానికి తగ్గట్లుగా విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు కోకాపేటలో 220/132/33KV సామర్థ్యం కలిగిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్(GISS) నిర్మించడం పై అధికారులు ఫోకస్ పెట్టారు. దీనిని ఏకంగా రూ.498 కోట్లతో నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రాన్స్ కో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సీఎండీ రజ్వి తెలిపారు.

News July 6, 2024

HYD: వివాదంలో ఉన్న HMDA భూముల ప్రాంతాలు!

image

HMDA పరిధి జవహర్‌నగర్‌లో 2000‌ ఎకరాలకు పైగా, మియాపూర్‌లో 445 ఎకరాల భూములు వివాదంలో ఉన్నాయి. కోకాపేట, బుద్వేల్, శంషాబాద్, ఉప్పల్ భగాయత్, పుప్పాలగూడ, జూబ్లీహిల్స్, మూసాపేట, సరూర్‌నగర్, బాటసింగారం, మంగళపల్లి, తుర్కయంజాల్, తొర్రూరు, మేడిపల్లి, షాబాద్, బహదూర్‌పల్లి, బాచుపల్లి, కోహెడ, పెద్ద అంబర్‌పేట, కుర్మాల్‌‌గూడ, తెల్లాపూర్, పటాన్‌చెరు, కందిలోనూ HMDA భూములు వివాదంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News July 6, 2024

HYD: లష్కర్‌ బోనాలు.. రేపు ఘటోత్సవం

image

రేపటి నుంచి లష్కర్‌లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభమవుతుందని ఆలయ EO గుత్తా మనోహర్ రెడ్డి తెలిపారు. నూతన కమిటీ సభ్యులతో కలిసి శుక్రవారం‌ పలు విషయాలు వెల్లడించారు. జులై 7న ఘటోత్సవం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 21న సికింద్రాబాద్ బోనాలు. ఆ రోజు ఉ. 3:30కి CM రేవంత్ అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారన్నారు. 22న రగం(భవిష్యవాణి) ఉంటుంది. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

News July 6, 2024

HYD: వేగంగా HMDA భూముల డిజిటలైజేషన్!

image

HMDA భూములకు సంబంధించి GIS డిజిటల్ మ్యాపింగ్ చేసే ప్రక్రియ దాదాపు 70 శాతానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. మొబైల్‌లో యాప్ ఓపెన్ చేస్తే చాలు అరచేతిలో భూముల వివరాలు, హద్దులతో సహా కనిపించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. HMDAకు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం 8,260 ఎకరాలను కేటాయించింది. నగర శివారు జిల్లాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం కోసం ప్రభుత్వం భూముల కేటాయింపు నిర్ణయం తీసుకుంది.

News July 6, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓బేగంపేటలో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం✓HYDలో క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌ రోడ్‌ షో ✓నాగోల్: మతిస్థిమితం లేని MBBS యువతి ఆత్మహత్య  ✓కోఠి: గంజాయి కేసులో జూనియర్ డాక్టర్లు అరెస్ట్  ✓నాంపల్లి:HYD నగరంలో నిరుద్యోగుల ఆందోళనలు  ✓HYD: నిరుద్యోగుల ధర్నా.. బర్రెలక్క(శిరీష) అరెస్టు ✓కోకాపేట: కొనసాగుతున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్ పనులు 

News July 5, 2024

హైదరాబాద్‌లో వాచ్‌మెన్ దారుణ హత్య

image

మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో వాచ్​మెన్​ దారుణ హత్యకు గురయ్యాడు. చిలకలగూడ CI అనుదీప్​ కథనం ప్రకారం.. ఉప్పరిబస్తీలో నిర్మాణంలో ఉన్న భవనంలో కుమ్మరి రామచంద్రయ్య (40) వాచ్​మెన్‌గా పనిచేస్తున్నాడు. రాళ్ల పనిచేసే సలీమ్​‌తో కలిసి నిన్న రాత్రి 10 గంటలకు మద్యం సేవించారు. మద్యం మత్తులో గొడవ జరిగింది. క్షణికావేశంలో సలీమ్​ రామచంద్రయ్యను ఇనుప రాడ్‌తో తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావమై రామచంద్రయ్య చనిపోయాడు.

News July 5, 2024

HYD: ICAR ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ సెంటర్లో ఉద్యోగాలు!

image

HYD నగర శివారు రాజేంద్రనగర్ ICAR ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ సంస్థలో పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం 12 పోస్టులు ఉండగా.. జూనియర్ రీసెర్చ్ ఫెలో, యంగ్ ప్రొఫెషనల్ ఉన్నట్లు పేర్కొన్నారు. జులై 8 దరఖాస్తుకు చివరి తేదీగా అధికారులు తెలిపారు. వెబ్ సైట్ https://icar-iior.org.in ద్వారా మిగతా వివరాలు పొంది, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.