India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సహయం, రుణమాఫీ, పంటలకు బోనస్ రాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని KTR తెలిపారు. ప్రభుత్వం హమీ ఇచ్చిన విధంగా రైతులకు ఈ యాసంగికి వానకాలంతో కలిపి ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలని, అన్ని పంటలకు బోనస్ వెంటనే చెల్లించాలని కోరుతూ ఈరోజు అసెంబ్లీలో చర్చకు కేటీఆర్ వాయిదా ప్రతిపాదనను ప్రవేశపెట్టనున్నారు.

గ్రేటర్ HYDలో ఉన్న 3 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో రోజురోజుకు రద్దీ పెరుగుతుంది. ప్రజల అవగాహన లేమితో అందరూ అమీర్‌పేట్, బేగంపేట, టోలిచౌకి కేంద్రాలను ఎంచుకుంటున్నట్లు పాస్‌పోర్ట్ అధికారులు తెలిపారు. వాస్తవానికి మేడ్చల్ జిల్లాతో పాటు, వికారాబాద్ ప్రాంతంలోనూ 80 స్లాట్స్ వరకు అందుబాటులో ఉన్నాయని ఆయా జిల్లాల్లో ఒకటి, రెండు రోజుల్లోనే పనులు జరుగుతున్నట్లు పేర్కొంది.

రంగారెడ్డి జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. రెడ్డిపల్లిలో 10.8, చందనవెల్లి 11.7, HCU 11.8, కేతిరెడ్డిపల్లి 12.1, రాజేంద్రనగర్ 12.2, అమీర్‌పేట, తాళ్లపల్లి 12.3, ఎలిమినేడు 12.5, కాసులాబాద్ 12.6, ధర్మసాగర్ 12.9, రచూలూరు 13 మీర్‌ఖాన్‌పేట, మంగళపల్లె 13.3, పసుమాముల, షాబాద్, శంకర్పల్లి 13.4 ప్రొద్దుటూరు 13.6, మొయినాబాద్ 13.7, ఆరుట్ల, దండుమైలారం 13.9, శివరాంపల్లి 14.1, గచ్చిబౌలిలో 14.3℃గా నమోదైంది.

HYD-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పూర్తి చేసేందుకు 3-4 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉందని కేంద్రం వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ కారిడార్ పూర్తయితే 45 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్ స్థాయిలో చర్యలు వేగవంతంగా జరుగుతున్నట్లు వెల్లడించారు.

గ్రేటర్ HYD పరిధిలోని 3 కమిషనరేట్లలో ఏటా 2,500 మందికిపైగా రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నట్లుగా రిపోర్టులో తెలిసింది. సిగ్నల్ జంపింగ్ కేసులు ఈ ఏడాదిలో HYD పరిధిలో 2.6 లక్షలు, సైబరాబాద్ పరిధిలో 75,000 రాచకొండ పరిధిలో 54 వేలకు పైగా నమోదయ్యాయి. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల మధ్య ఇష్టారాజ్యంగా సిగ్నల్స్ పాటించకుండా దాటేస్తుండటంతోనే ప్రమాదాలకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని వివరించారు.

వెస్ట్ మారేడ్‌పల్లిలో 13.8℃, గోల్కొండ 14.8, సులేమాన్‌నగర్ 15.2, లంగర్‌హౌస్ 15.4, మోండామార్కెట్ 15.9, ముషీరాబాద్ 16.3, ఆసిఫ్‌నగర్ 16.4, చాంద్రయాణగుట్ట, జూబ్లీహిల్స్ 16.5, రియాసత్‌నగర్ 16.7, తిరుమలగిరి 16.8, షేక్‌పేట 17, కంటోన్మెంట్ 17.1, ఖైరతాబాద్ 17.2, అంబర్‌పేట్, కొత్త మెట్టుగూడ 17.4, వెంగళ్‌రావునగర్, రహ్మత్‌నగర్ 17.6, బౌద్ధనగర్, బోరబండలో 17.8℃గా నమోదైంది.

రెండు పడకల గదులకు సంబంధించి 2024-25కు GHMC పద్దులో రూ.300 కోట్లు చూపిన అధికారులు, 2025-26లోనూ రూ.300 కోట్ల వ్యయాన్ని చూపారు. ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్ ఇస్తే ఖర్చు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే మొత్తం జీహెచ్ఎంసీ పద్దు రూ.8340 కోట్లుగా ఉంది. ఆదాయం పెంచే మార్గాలపై జీహెచ్ఎంసీ దృష్టి పెట్టాలని కౌన్సిల్ సభ్యులు కోరుతున్నారు.

సికింద్రాబాద్‌లోని వెస్లీ డిగ్రీ కళాశాల మైదానంలో 46వ యునైటెడ్ క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురికి గవర్నర్ క్రిస్మస్ కానుకలను అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రార్థనలు, నృత్యం, నాటకాలతో క్రిస్మస్ వేడుకలు ఆకట్టుకున్నాయి.

ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిపించాలని కోరుతూ స్పీకర్‌కు బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతలు వినతిపత్రం అందజేశారు. ఫార్ములా ఈ రేసింగ్‌పై KTRపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, శాసనసభలో ఈ అంశంపై చర్చ జరిగితేనే నిజానిజాలు బయటకు వస్తాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. కేటీఆర్, బీఆర్ఎస్‌పై ప్రభుత్వం అనవసరంగా దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.

రాచకొండ పోలీసులు పాస్‌వర్డ్ భద్రతపై అవగాహన కల్పిస్తూ ముఖ్య సూచనలు చేశారు. ఇటీవల HYDలో పలు సైబర్ క్రైమ్‌లు పాస్‌వర్డ్‌ల కారణంగా జరిగినట్లు తేల్చారు. తరచూ మార్చడం, సులభమైన పాస్వర్డ్‌లను (123456) ఉపయోగించకపోవడం, ఇతరులతో పాస్‌వర్డ్ పంచుకోకపోవడం, ఫ్రీ వైఫై నెట్‌వర్క్‌లలో లాగిన్ అవ్వకపోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. భద్రతను మరింత మెరుగుపర్చేందుకు టూ స్టెప్ వెరిఫికేషన్ ఉపయోగించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.