Warangal

News August 2, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి టాప్ న్యూస్..

image

> WGL: ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం > WGL: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పర్వతగిరి ఎస్సై > MHBD: భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కి వీఆర్ఏ హల్చల్ > WGL: మార్కెట్లో తగ్గిన పత్తి ధర, పెరిగిన WH మిర్చి ధర > JN: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు > HNK: కేయూలో ఘనంగా తీజ్ ఉత్సవాలు > JN: మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి: ఎమ్మెల్యే పల్లా

News August 2, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్..

image

> BHPL: గోపాలపురం గ్రామంలో వ్యక్తి మృతి
> WGL: ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరికి తీవ్ర గాయాలు
> JN: స్కూల్ బస్ కింద పడి విద్యార్థి మృతి
> WGL: అన్న గొంతు కోసిన తమ్ముడు
> JN: గుండెపోటుతో పురోహితుడు మృతి
> MHBD: విద్యుత్ షాక్ తో మహిళా మృతి
> BHPL: గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
> MLG: విద్యార్థులకు అస్వస్థత.

News August 2, 2024

జనగామ: స్కూల్ బస్సు కింద పడి విద్యార్థి మృతి

image

స్కూల్ బస్సు కింద పడి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. జనగామ మండలం అడవి కేశవాపూర్‌కు చెందిన విద్యార్థి బానోతు వరుణ్ స్కూల్ బస్సుకు బ్యాగ్ తట్టుకొని వెనుక టైర్ కింద పడిపోయాడు. దీంతో బస్సు టైరు విద్యార్థి తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థి బంధువులు బస్సు అద్దాలను ధ్వంసం చేశారు.

News August 2, 2024

ట్రాన్స్‌ఫార్మర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి: సీఎండీ

image

TGNPDCL హనుమకొండ కార్పొరేట్ కార్యాలయంలో సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్ఈలు, డీఈలు, నోడల్ ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. అంతరాయాలు, బ్రేక్ డౌన్స్, ట్రిప్పింగ్స్ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News August 2, 2024

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అసత్య ప్రచారాలు: రామ్మోహన్ రెడ్డి

image

పాలకుర్తి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి లేగ రామ్మోహన్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి రిజర్వాయర్‌కు రీటెండర్ వేసి రూ.370 కోట్ల నుంచి రూ. 470 కోట్లకు పెంచారని ఆరోపించారు. 30 కి.మీ మేర కెనాల్ కాలువలను తవ్వించారని ఎమ్మెల్యే అసత్య ప్రచారం చేసుకుంటున్నారన్నారు. బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

News August 2, 2024

వరంగల్: అన్న గొంతు కోసిన తమ్ముడు

image

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. భూ వివాదంలో ఘర్షణ ఏర్పడి అన్న గొంతును తమ్ముడు బ్లేడుతో కోశాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. రంగశాయిపేటలోని గవిచర్ల క్రాస్ రోడ్డు వద్ద భూ వివాదంలో అన్న రాజుపై తమ్ముడు రాజేశ్ బ్లేడుతో దాడి చేశాడు. ఈ క్రమంలో రాజు గొంతుకు తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం అతడిని ఎంజీఎం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 2, 2024

విద్యుత్తును అవసరం ఉన్నంత వరకు వాడుకోవాలి: కలెక్టర్

image

విద్యుత్తును అవసరం ఉన్నంత వరకు వాడుకొని, అనవసరంగా వాడకుండా ఉండటమే విద్యుత్తును ఉత్పత్తి చేసినంత విలువని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం ప్రభుత్వ మర్కాజి ఉన్నత పాఠశాలలో హిటాచి ఎనర్జీ కంపెనీ వారు సామాజిక బాధ్యతలో భాగంగా ఏర్పాటు చేసిన సోలార్ పవర్ సిస్టంను ప్రారంభించి, కలెక్టర్ మాట్లాడారు.

News August 2, 2024

FLASH.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పర్వతగిరి ఎస్సై

image

వరంగల్ జిల్లా పర్వతగిరి పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు.
రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా SI వెంకన్నను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సై గుగులోతు వెంకన్నపై అన్నారం పెద్ద తండా బెల్లం వ్యాపారుల ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రైడ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 2, 2024

వరంగల్ మార్కెట్లో భారీగా తగ్గిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గత మూడు రోజులుగా పత్తి ధరలు అమాంతం పడిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రూ.7,130 పలికిన క్వింటా పత్తి ధర.. నిన్న రూ.7,080కి చేరింది. నేడు మరింత పతనమై రూ.7,030కి పడిపోయింది. రోజురోజుకు పత్తి ధరలు తగ్గిపోవడం రైతులకు తీవ్ర నిరాశ కలిగించే విషయం.

News August 2, 2024

వరంగల్: రూ.1500 పెరిగిన WH మిర్చి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో తేజ మిర్చి నిన్నటితో పోలిస్తే ఈరోజు తగ్గింది. నిన్న క్వింటాకు రూ.18,500 పలకగా.. ఈరోజు రూ.18,000 పలికింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.15 వేలు ధర రాగా.. నేడు రూ.15,500 వచ్చింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చి ధర పెరిగింది. నిన్న రూ.13,500 ధర పలకగా.. నేడు రూ.15,000కి చేరింది.