Warangal

News August 2, 2024

వరంగల్: సరిహద్దులు దాటి వస్తున్న ‘శీలావతి’!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గంజాయి విక్రయాలు యథేచ్చగా సాగుతున్నాయి. అయితే ఆంధ్ర-ఒడిశాలో దొరికే శీలావతి పేరు కలిగిన గంజాయికి డిమాండ్ ఎక్కువ. అక్రమార్కులు దీన్ని చాకచక్యంగా సరిహద్దులు దాటిస్తున్నారు. ఒడిశా నుంచి APలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మీదుగా భద్రాద్రి కొత్తగూడెం దాటుకుని తీసుకువస్తున్నట్లు సమాచారం. MHBD, WGLకు ఒడిశా నుంచి వచ్చే రైలులో తీసుకువస్తుండగా ఈ ఏడాది పోలీసులు 3సార్లు పట్టుకున్నారు.

News August 2, 2024

వరంగల్: పెరుగుతున్న డెంగ్యూ కేసులు

image

ఉమ్మడి WGL వ్యాప్తంగా <<13756149>>డెంగ్యూ<<>>తో పాటు.. వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. రెండ్రోజుల క్రితం చెన్నారావుపేట మండలంలోని ఓ బాలుడు డెంగ్యూతో మృతి చెందగా.. గురువారం నిండు గర్భిణితో పాటు ఆమె కడుపులోని కవల పిల్లలూ మృతి చెందారు. దీంతో జిల్లాలో జ్వరం బారిన పడినవారు MGM బాట పడుతున్నారు. గత వారం రోజులుగా చూస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజులో దాదాపు 50-55 మందికి డెంగ్యూ నిర్ధారణవుతోందని వైద్యులు చెబుతున్నారు.

News August 2, 2024

హనుమకొండ: ఈనెల 3న అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

image

హన్మకొండ జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి సారంగపాణి తెలిపారు. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 3న అండర్ 14, 16, 18, 20 బాల బాలికలు, మహిళ, పురుషులకు జావెలిన్ త్రో, 100 మీటర్ల పరుగు ఉంటుందన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న జిల్లా అథ్లెట్లు శనివారం ఉదయం 10 గంటలకు JNS స్టేడియంలో హాజరు కావాలని కోరారు.

News August 2, 2024

గ్రేటర్ వరంగల్‌లో పెరిగిన కాంగ్రెస్ బలం

image

వరంగల్ మహానగర పాలకసంస్థ పాలకవర్గంలో అధికార కాంగ్రెస్ బలం పెరిగింది. గురువారం తూర్పు నియోజకవర్గానికి చెందిన BRS కార్పొరేటర్లు పల్లం పద్మ, సోమిశెట్టి ప్రవీణ్, జోగి సువర్ణ హస్తం గూటికి చేరారు. దీంతో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య 7 నుంచి 39కి పెరిగింది. BRS బలం 39 నుంచి 17కు తగ్గింది. BJP 10 నుంచి 11కు పెరిగింది. కాగా, తూర్పులో BRS కార్పొరేటర్ల చేరికలపై కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News August 2, 2024

కలెక్టర్‌తో సమావేశాన్ని నిర్వహించిన హుస్సేన్ నాయక్

image

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌తో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ నేడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ఉన్నతాధికారులతో పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News August 2, 2024

కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

హన్మకొండ బాలసముద్రంలో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కాళోజీ కళాక్షేత్ర నిర్మాణ పనులను కలెక్టర్ ప్రావీణ్య వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డితో కలిసి పరిశీలించారు.

News August 1, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

image

> WGL: అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం, పటిక స్వాధీనం
> NSPT: ఆర్టీసీ బస్సు ఢీకొని గేదె మృతి
> HNK: ఇంటర్ విద్యార్థిని మృతి.. తల్లి ఆవేదన
> WGL: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
> JN: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
> HNK: మత్తు పదార్థాల వినియోగం పట్ల కలిగే అనర్ధాలపై అవగాహన సదస్సు
> MLG: విద్యుత్ షాక్‌తో దుక్కిటెద్దు మృతి
> HNK: విషాదం.. డెంగ్యూతో నిండు గర్భిణీ మృతి

News August 1, 2024

వరంగల్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఎస్సైల బదిలీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడుగురు సబ్ ఇన్‌స్పెక్టర్లను సీపీ అంబర్ కిషోర్ ఝా గురువారం బదిలీ చేశారు. కొత్తగా పోస్టింగ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి. లింగాల గణపురం-శ్రావణ్ కుమార్, ఇంతేజార్ గంజ్-రాజు, జఫర్ గడ్-బానోతు రాంచరణ్, వేలేరు-సురేష్, సుబేదారి-హరిత, చిల్పూర్-నవీన్ కుమార్, కేయూసీకి రాజేందర్ బదిలీ అయ్యారు.

News August 1, 2024

HNK: విషాదం.. డెంగ్యూతో నిండు గర్భిణి మృతి

image

డెంగ్యూ జ్వరంతో నిండు గర్భిణి మృతి చెందిన ఘటన HNK జిల్లా శాయంపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. గట్లకానిపర్తికి చెందిన శిరీష 9 నెలల గర్భవతి. శిరీషకు డెంగ్యూ జ్వరం రావడంతో 3 రోజుల క్రితం HNKలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. ఆమె కడుపులో ఉన్న కవల శిశువులను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం వృథా అయింది. తల్లి, బిడ్డలు మృతి చెందారు.

News August 1, 2024

వరంగల్ మార్కెట్‌లో మళ్లీ తగ్గిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు రైతన్నలను కంట నీరు తెప్పిస్తున్నాయి. ధరలు ఏ రోజు పెరుగుతున్నాయో, ఏరోజు తగ్గుతున్నాయో తెలియక అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. మంగళవారం రూ.7,060 పలికిన క్వింటా పత్తి ధర.. నిన్న రూ.7,130కి పెరిగింది. ఈరోజు మళ్లీ తగ్గి రూ.7,080 కి పడిపోయింది. దీంతో రైతులు నిరాశ చెందుతున్నారు.