Warangal

News March 19, 2024

WGL: బలవంతంగా వ్యభిచారంలోకి..

image

యువతితో బలవంతంగా వ్యభిచారం చేయించేందుకు యత్నించిన ఘటన హసన్పర్తిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. గద్వాల జిల్లాకు చెందిన ఓ యువతి టెలీకాలర్ ఉద్యోగం కోసం ఈనెల 10న HYD వచ్చి MGBS బస్టాండ్‌లో వేచి చూస్తోంది. ఈక్రమంలో ఇద్దరు యువకులు ఆమెకు మాయమాటలు చెప్పి తమ ఇంటికి తీసుకెళ్లారు. తిరిగి వంగపహాడ్‌కు తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారం చేయాలంటూ దాడికి పాల్పడ్డారు. ఆమె చాకచక్యంగా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.

News March 19, 2024

HNK: నా చావుకు వైద్యుడు కారణం.. యువకుడి SUICIDE నోట్

image

వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే తాను చనిపోతున్నానని ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన HNK జిల్లాలో చోటుచేసుకుంది. KU SI రాజ్‌కుమార్ వివరాల ప్రకారం.. పలివేల్పులకు చెందిన దేవేందర్(28) మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఓ వైద్యుడిని గతేడాది సంప్రదించగా.. తానిచ్చిన మందులు 6 నెలలు వాడినా తగ్గలేదు. దీంతో సర్జరీ చేశారు. అయినా తగ్గకపోవడంతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

News March 19, 2024

జనగాం: బాలికపై ముగ్గురు బాలుర అత్యాచారం

image

నర్మెట్ట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై కె.శ్రీకాంత్ వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై ముగ్గురు మైనర్ బాలురు జనవరిలో అత్యాచారం చేశారు. అయితే బాధితురాలి తల్లి.. నిందితుల తల్లిదండ్రులతో జరిపిన చర్చలు విఫలమవడంతో సోమవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

News March 19, 2024

వరంగల్‌: మాజీ MLA రాజీనామా! BRSకు బాధ్యులెవరు?

image

వర్ధన్నపేట మాజీ MLA ఆరూరి రమేశ్ రాజీనామాతో WGL BRSకు సారథి లేకుండా పోయింది. WGL తూర్పు నియోగజకవర్గంలోని పలువురు కీలక నేతలు, కార్పొరేటర్లు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. మాజీ MLA నరేందర్ సైతం ఎన్నికల అనంతరం స్తబ్దుగా ఉండిపోవడంతో జిల్లాలో సమస్యలు వస్తే చెప్పుకోవడానికి నాయకుడికోసం వారంతా ఎదురు చూస్తున్నారు. దీంతో మాజీ MLAలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి వైపు అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

News March 19, 2024

ములుగు: డీఎల్ఎస్ఏలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ములుగు జిల్లాలోని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ( డిఎల్ఎస్ఎ)లో మూడు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆఫీస్ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్, ఆఫీస్ ప్యూన్ ఉద్యోగాలకు జిల్లాలోని నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని, ఏదేని డిగ్రీతో పాటు టైపింగ్‌లో అనుభవం ఉండాలన్నారు.

News March 18, 2024

జనగాం: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

image

జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దూల్మిట్ట మండలంలో జరిగింది. మద్దూరు ఎస్సై షేక్ యూనస్ అహ్మద్ అలీ తెలిపిన వివరిలిలా.. కూటిగల్ గ్రామానికి చెందిన తిగుళ్ల రమేశ్ (21) జీవితంపై విరక్తి చెంది వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ దవాఖానాకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఆయన తెలిపారు.

News March 18, 2024

వరంగల్: గుండెపోటుతో వ్యక్తి మృతి

image

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కోమట్లగూడెం గ్రామానికి చెందిన BRS గ్రామ కమిటీ నాయకుడు జనగాం నారాయణ గుండెపోటుతో మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. పని నిమిత్తం బయటకు వస్తున్న నారాయణ రోడ్డుపై అకస్మాతుగా కుప్పకులాడు. అది గమనించిన గ్రామస్థులు అతనికి ఫిట్స్ వచ్చిందేమొనని తాళాల గుత్తి అతని చేతిలో పెట్టారు. కాగా అప్పటికే నారాయణ మృతిచెందినట్లు వారు గుర్తించారు.

News March 18, 2024

వరంగల్ : విదేశాల్లో ఉద్యోగావకాశాలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి మాధవి సోమవారం తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు ప్లాస్టరింగ్ పనులకు జర్మనీలో డిమాండ్ ఉందన్నారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆసక్తిగలవారు ఉపాధి కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

News March 18, 2024

వరంగల్: ఓటరు నమోదుకు అవకాశం

image

లోకసభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 15 వరకు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని 18 ఏళ్లు నిండిన అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానిక BLOలను సంప్రదించాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో http:///ceotelangana.nic.in లేదా http:///voters.eci.gov.in అనే వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

News March 18, 2024

భూపాలపల్లి: ఆస్కార్‌ గుర్తుగా.. గ్రంథాలయం

image

ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ తన సొంతూరు చల్లగరిగేలో గ్రంథాలయం నిర్మాణం చేపట్టారు. పురస్కారానికి గుర్తుగా తన సతీమణి సుచిత్ర ఆలోచన మేరకు గ్రామంలోని గ్రంథాలయాన్ని ఆంగ్ల అక్షరం ‘O’ ఆకారంలో రెండంతస్తుల్లో నిర్మిస్తున్నారు. 80శాతం పనులు పూర్తి అయ్యాయి. మరికొద్ది రోజుల్లో గ్రంథాలయాన్ని ప్రారంభించనున్నారు.