India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సెలవు ప్రకటించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు మంత్రి సీతక్క నేడు ట్వీట్ చేశారు. అనంతరం ఆదివాసీలకు సంబంధించిన పలు సమస్యలను సీఎంకు మంత్రి, ఎమ్మెల్యేలు వివరించారు. ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, వెంకటరావు, జాడి ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. ఓ పరిపాలన అధికారి బదిలీ అయి వెళ్లినందుకు పీడపోయిందంటూ తెల్లవారుజామున ఎంజీఎం గేట్‌కు ఫ్లెక్సీలు కట్టారు. ఆ పరిపాలన అధికారి ఎవరు? ఎవరికోసం పెట్టారు? అనేది ఇప్పుడు ఎంజీఎం ఆస్పత్రిలో పెద్ద చర్చనీయాంశమైంది. ఇంతకీ ఎవరు కట్టారనేది కూడా తెలియాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం ఎంజీఎంలో ఏం జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.
ప్రజలు మార్కెట్‌కు వెళ్లకుండా కొందరు వ్యాపారులు ఇంటి వద్దకే తోపుడు బండ్లు, బుట్టల్లో కూరగాయలను తీసుకువచ్చి అమ్ముతుంటారు. కానీ, ఓ వ్యాపారి కారులోనే కూరగాయలు విక్రయిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. హన్మకొండ నగరంలోని ఎక్సైజ్ కాలనీలో కారులో వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలను తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. వెనుక డిక్కీలో వేయింగ్ మిషన్‌ను ఏర్పాటు చేశాడు. దీన్ని చూసిన పలువురు ఆలోచన బాగుందని కితాబిస్తున్నారు.
ప్రజలు మార్కెట్‌కు వెళ్లకుండా కొందరు వ్యాపారులు ఇంటి వద్దకే తోపుడు బండ్లు, బుట్టల్లో కూరగాయలను తీసుకువచ్చి అమ్ముతుంటారు. కానీ, ఓ వ్యాపారి కారులోనే కూరగాయలు విక్రయిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు. హన్మకొండ నగరంలోని ఎక్సైజ్ కాలనీలో కారులో వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలను తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. వెనుక డిక్కీలో వేయింగ్ మిషన్‌ను ఏర్పాటు చేశాడు. దీన్ని చూసిన పలువురు ఆలోచన బాగుందని కితాబిస్తున్నారు.
వరంగల్ రైల్వేస్టేషన్ వద్ద రైల్వే ట్రాక్‌పై పడుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు యువకుడి మీద నుంచి వెళ్లగా, తల, శరీర భాగం ఛిద్రమయ్యాయి. అందరూ చూస్తున్నప్పటికీ ఎవరూ కాపాడడానికి ముందుకు రాలేదు. రైలు అతని మీద నుంచి వెళ్లిన వెంటనే స్థానికంగా ఉన్న వారందరూ కేకలు వేశారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రేబిస్ వ్యాధితో ఓ మహిళ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. ఏడ్చెర్ల గ్రామానికి చెందిన పూలమ్మ అనే మహిళపై ఇటీవల ఓ వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. మహబూబాబాద్ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందినా నయం కాకపోవడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. ఆరు జిల్లాల్లో తలసరి ఆదాయాన్ని పరిశీలిస్తే వరంగల్ వాసుల ఆదాయం తక్కువగా ఉంది. ఈ విషయంలో హనుమకొండ జిల్లా అట్టడుగునా ఉంది. ఆదాయంలో భూపాలపల్లి, ములుగు కొంత మెరుగ్గా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాలో సగటున నెలకు రూ.22,629 సంపాదిస్తే.. హనుమకొండలో రూ.15,563 మాత్రమే సంపాదిస్తున్నారు.
> MLG: సారలమ్మ పూజారి మృతి
> MHBD: తోడేళ్లగూడెంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
> WGL: శతాధిక వృద్ధురాలు మృతి
> WGL: సూసైడ్ చేసుకున్న ఉపాధ్యాయుడు
> MHBD: సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు
> MHBD: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి
> WGL: రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్
> BHPL: మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన BRS నేతల బృందం
> WGL: గ్యాస్ సిలిండర్లో నీరు!
> BHPL: పలువురు తహసీల్దారుల బదిలీ
> MLG: తల్లిదండ్రులు దూరం.. పట్టుదలతో ఉద్యోగం
> WGL: మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు
> JN: బ్యాంక్ అధికారులకు ఎమ్మెల్యే కడియం వార్నింగ్
> MLG: ఉదృతంగా గోదావరి.. రెండవ హెచ్చరిక జారి
> WGL: ఎన్కౌంటర్‌కు సీఎం బాధ్యత వహించాలి
రేణుక ఎల్లమ్మతల్లి ఆలయ నిర్మాణ టెండర్ అంశంపై రాష్ట్ర దేవాలయ శాఖ మంత్రి కొండా సురేఖను భూపాలపల్లి నియోజకవర్గ నేతలు కలిశారు. అనంతరం నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, తదితరు అంశాలపై మంత్రితో నేతలు చర్చించారు. కాంగ్రెస్ నేత మూల శంకర్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు నారాయణ గౌడ్, కిరణ్ గౌడ్, రఘు గౌడ్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.