India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని డోర్నకల్, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు రామచంద్రనాయక్, నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రాజెక్టులు, చెక్ డ్యాములు, ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన అంశాలపై మంత్రితో ఎమ్మెల్యేలు చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అత్యంత సన్నిహితుడు, దళిత రత్న అవార్డు గ్రహీత, రూరల్ డెవలప్‌మెంట్ స్టేట్ డైరెక్టర్ అందె యాకయ్య నేడు BRSకు రాజీనామా చేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు వారు తెలిపారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ తన కష్టాన్ని గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రకులాలకు మాత్రమే బీఆర్ఎస్ పెద్దపీట వేసిందని ఆరోపించారు.
జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల పథకంలో భాగంగా మొదటి దశలో పాఠశాలలకు మంజూరైన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మాట్లాడుతూ.. మండల ప్రత్యేక అధికారులు మొదటి దశలో ఏవైనా పనులు పెండింగ్‌లో ఉన్నది లేనిది తెలుసుకొని వాటిని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
వరంగల్-కాజీపేట స్టేషన్ల మీదుగా ప్రయాణించే పలు రైళ్లను ఆగస్టు 5 -10వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గోల్కొండ, శాతవాహన రైళ్ళను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా ఐదు రోజులపాటు రద్దు చేసినట్లు చెప్పారు. కావున ప్రయాణికులు విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గతవారం రికార్డు ధర పలికిన మొక్కజొన్న ధరలు ఈ వారం క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గతవారం క్వింటా మక్కలు రూ.2,780 పలకగా.. ఈ వారం మూడు రోజులు రూ.2,750 పలికాయి. నిన్న కాస్త తగ్గి రూ.2,715 అయిన మొక్కజొన్న నేడు రూ.2705కి తగ్గిందని రైతులు తెలిపారు.
చెట్టు మీద పడడంతో జహంగీర్ <<13705294>>మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. ఎస్సై తాజుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన ఎస్కే జహంగీర్ బీటెక్ చదువుకొని గ్రామంలో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. మందుల కోసం ఏటూరునాగారం వెళ్తుండగా చెట్టు కూలి అక్కడికక్కడే మరణించారు. కాగా, ఆగస్టులో జహంగీర్‌కు పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు అనుకోగా అంతలోగా విధి చెట్టు రూపంలో కాటేసింది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. గురువారం రూ.7025 పలికిన క్వింటా పత్తి ధర నేడు రూ.7,150 కి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
హనుమకొండలోని నయీమ్ నగర్‌కు చెందిన కామ మాధవి హాసన్‌పర్తి మండలం మడిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో భర్త వెంకటేశ్‌తో కలిసి లక్ష్మి సాయి చిట్స్ పేరుతో చిట్టీలు నడిపారు. గడువు ముగిసినా పలువురికి చిట్టి డబ్బులు చెల్లించకపోవడంతో కృష్ణ అనే ఉపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు మాధవి, ఆమె భర్తను రిమాండ్‌కు తరలించారు.
ముల్కలపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సత్తి ముత్తయ్య(86) కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి మరణించాడు. గురువారం ముత్తయ్య అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమవుతుండగా ఆయన మరణాన్ని తట్టుకోలేక భార్య యశోదమ్మ(80) గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే స్థానికులు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కేయూ పీజీ (MA/M.Com/M.Sc) రెండవ సెమిస్టర్ పరీక్షా టైం టేబుల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్. నరసింహచారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ బీఎస్‌ఎల్. సౌజన్య విడుదల చేశారు. ఆగస్టు 7న మొదటి పేపర్, 9న రెండవ పేపర్, 12న మూడవ పేపర్, 14న నాల్గవ పేపర్, 16న ఐదవ పేపర్, 19న ఆరవ పేపర్ పరీక్ష ఉన్నట్లు పేర్కొన్నారు. పరీక్షలు మధ్యాహ్నం 2.00 – 5 గంటల వరకు జరుగుతాయన్నారు.
Sorry, no posts matched your criteria.