India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
> HNK: ఏసీబీకి చెక్కిన పరకాల సబ్ రిజిస్ట్రార్..
> WGL: భార్యకు గుడి కట్టిన భర్త.
> BHPL: కాళేశ్వరంలో తగ్గుముఖం పట్టిన గోదావరి ప్రవాహం.
> MLG: ఎకో టూరిజం అభివృద్ధికి ఎంపికైన ఏటూరునాగారం- పాకాల సర్క్యూట్..
> HNK: బడ్జెట్లో వరంగల్ కు ప్రాధాన్యత ఇవ్వలేదని బీజేపీ నేతల నిరసన..
> WGL: పతనమైన పత్తి, మిర్చి ధర.
> MLG: మేడారం జాతరకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు: కావ్య..
సచివాలయంలో నిర్వహించిన నల్ల పోచమ్మ బోనాల ఉత్సవ వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొని బోనం ఎత్తుకొని సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని, బోనాల పండుగ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు.
ఏటూరు నాగారంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్నబోయినపల్లి సమీపంలో 163 జాతీయ రహదారిపై గురువారం భారీ వృక్షం కూలింది. అటు వైపు వెళుతున్న బైక్పై వృక్షం పడడంతో వ్యక్తి అక్కడి కక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కాగా మృతుడు చిన్నబోయినపల్లి జహంగీర్గా స్థానికులు గుర్తించారు.
హన్మకొండ జిల్లా పరకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పరకాల సబ్ రిజిస్ట్రార్ సునీత రూ.80వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. పరకాల మున్సిపాలిటీ సీతారాంపురానికి చెందిన 9గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేయగా.. మధ్యవర్తి ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం.
భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. నిన్నటి వరకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి, ప్రాణహిత నదులు కొంత శాంతించాయని, పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికి వర్షాలు పడుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన వెంకటనారాయణ భార్య సుజాత గుండెపోటుతో మృతి చెందింది. భార్య మరణాంతరం ఆమె గుర్తుగా పొలం వద్ద వెంకటనారాయణ గుడి కట్టించి భార్య విగ్రహం ఏర్పాటు చేశారు. భార్య జ్ఞాపకార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వెంకటనారాయణను గ్రామస్థులు అభినందిస్తున్నారు.
వరంగల్ నగరంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ మూడు రోజులు బంద్ ఉంటుందని మార్కెట్ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. 27 శనివారం వారంతపు యార్డు, 28 ఆదివారం వారంతపు సెలవు, 29 సోమవారం బోనాల పండుగ సందర్భంగా బంద్ ఉంటుందన్నారు. కావున శనివారం నుంచి సోమవారం వరకు వరసగా(3) రోజులు మార్కెట్ తెరిచి ఉండదన్నారు. తిరిగి ఈనెల 30న మంగళవారం రోజున పునఃప్రారంభం అవుతుందన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా గత వారం రూ. 2,780 పలికిన మక్కల ధర.. ఈ వారం స్వల్పంగా తగ్గాయి. గత మూడు రోజులు రూ. 2,750 పలికిన మక్కలు, ఈరోజు మరింత తగ్గి రూ.2,715 అయినట్లు రైతులు తెలిపారు. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
నక్కలపల్లిలోని ఓ బార్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కుళ్లిపోయిన మటన్, చికెన్ ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బార్లోని వంటగదికి అనుమతులు లేకుండానే బార్ నిర్వహిస్తున్నారని, సరైన శుభ్రత లేకుండా కస్టమర్లకు ఆహారాన్ని అందిస్తున్న విషయాన్ని ఫుడ్ సెక్యూరిటీ అధికారుల దాడులతో బయటపడ్డాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు బార్ యజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి బుధవారం క్వింటాకు రూ.17,200 పలకగా.. నేడు రూ.18,000కి పెరిగింది. అలాగే 341 రకం మిర్చి నిన్నటి లాగే నేడు కూడా రూ.13,300 పలికింది. ఐతే వండర్ హాట్ (WH) మిర్చి మాత్రం భారీగా తగ్గింది. నిన్న రూ.16,000 వచ్చిన ధర.. ఈరోజు రూ.13,500కి పతనమైంది.
Sorry, no posts matched your criteria.