India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర భారీగా పతనమైంది. గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన పత్తి ఈరోజు భారీగా పడి పోయింది. సోమవారం రూ.7,150 పలికిన క్వింటా పత్తి మంగళవారం రూ.7,180, బుధవారం రూ.7,230 అయింది. ఈ క్రమంలో నేడు దారుణంగా పతనమై రూ.7,025కి చేరింది. దీంతో మార్కెట్‌కు పత్తి తీసుకుని వచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
లింగాల ఘనపురం మండలం వనపర్తి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఎస్ఓటీగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీదేవిపై సస్పెన్షన్ వేటు పడింది. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశానుసారం సస్పెండ్ చేస్తూ డీఈఓ రాము బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు మండల నోడల్ అధికారి పడాల విష్ణుమూర్తి తెలిపారు. ఎలాంటి సమాచారం లేకుండా గత నెల 4 నుంచి విధులకు గైర్హాజరు కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు కౌన్సెలింగ్ పద్ధతిలో ఎంపిక చేసుకున్న పోలీస్ స్టేషన్లకు బుధవారం బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లకు బదిలీ చేసిన వారిలో నలుగురు కానిస్టేబుల్స్, 40మంది హెడ్ కానిస్టేబుల్స్, 13 మంది ఎఎస్సైలు ఉన్నారు.
కేంద్ర బడ్జెట్‌లో బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన వర్సిటీ లాంటి విభజన హామీల ఊసే లేకపోవడంతో ఓరుగల్లుకు నిరాశే ఎదురైంది. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతుండగా ఇందులోనైనా ప్రాధాన్యం దక్కుతుందని జిల్లా ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి, కేయూ అభివృద్ధి, పర్యాటక ప్రాంతాల డెవలప్ చేయాల్సి ఉంది. వరంగల్ కాకతీయ మెగా జౌళి పార్కుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
* WGL: బాలుడిపై వీధి కుక్కల దాడి..
* MLG: జగన్నాథపురంలో రోడ్డు ప్రమాదం..
* MLG: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి..
* MHBD: ఇద్దరి ప్రాణాలు తీసిన తప్పుడు మార్గం
* WGL: గుండె పోటుతో వ్యక్తి మృతి..
* WGL: గ్రామ పంచాయితీ ట్రాక్టర్ డ్రైవర్ మృతి
* MLG: మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన సదస్సు.
> WGL: పార్లమెంటు వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు కావ్య, బలరాంనాయక్ > MLG: తండాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తాం: సీతక్క > HNK: జిల్లా కేంద్రంలో ప్రభాస్ బుజ్జి కారు సందడి > JN: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు > MLG: బొగత జలపాతం సందర్శన బంద్ > BHPL: మొక్కలతోనే భవిష్యత్తు తరాలకు భరోసా: ఎస్పీ > MHBD: రైతు భరోసా నిధులు విడుదల చేయాలి: ఎమ్మెల్సీ
కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీలు ఈరోజు ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో తోటి ఎంపీలతో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య పాల్గొన్నారు. బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని కావ్య మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులతో నిరసన తెలిపారు.
ములుగు జిల్లా కన్నాయిగూడెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు యాట సాంబయ్య(66) లక్నవరం చెరువులో చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. చేపల వేటకు వలలు వేస్తున్న క్రమంలో కాళ్లకు వల చుట్టుకుని ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతదేహాన్ని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ములుగు జిల్లా కన్నాయిగూడెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు యాట సాంబయ్య(66) లక్నవరం చెరువులో చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. చేపల వేటకు వలలు వేస్తున్న క్రమంలో కాళ్లకు వల చుట్టుకుని ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతదేహాన్ని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు మిర్చి ధరలు తగ్గాయి. తేజ మిర్చి మంగళవారం క్వింటాకు రూ.17,500 పలకగా.. నేడు రూ.17,200కి పడిపోయింది. 341 రకం మిర్చి నిన్న రూ.14,500 పలకగా.. నేడు రూ.13,300కి పడిపోయింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చి మాత్రం నిన్నటి లాగే రూ.16,000 ధర వచ్చింది.
Sorry, no posts matched your criteria.