Warangal

News November 14, 2024

నర్సంపేట: పారా మెడికల్ కోర్సుల ప్రవేశానికి గడువు పెంపు

image

నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పారా మెడికల్ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తు గడువును పెంచినట్లు ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. నవంబర్ 11న దరఖాస్తు చివర తేదీ కాగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 20 వరకు గడువు పెంచినట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత, దరఖాస్తు విధానం తదితర వివరాలకు ఆన్లైన్‌లో చూసుకోవాలని తెలిపారు.

News November 14, 2024

వరంగల్ మార్కెట్‌లో చిరుధాన్యాల ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల చిరు ధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయకు సోమవారం రూ.5,510 ధర రాగా.. మంగళవారం రూ.5,900, బుధవారం రూ.5550 రాగా నేడు రూ.6870 ధర వచ్చింది. అలాగే మక్కలు బిల్టి క్వింటాకి మంగళవారం రూ.2,465 ధర, బుధవారం రూ.2,480 ధర రాగా గురువారం రూ. 2440 కి పడిపోయింది. మరోవైపు పసుపు క్వింటాకి రూ.12,059 ధర పలికింది.

News November 14, 2024

పరీక్ష రాసే అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలి: జనగామ కలెక్టర్

image

జనగామ జిల్లాలో గ్రూప్- 3 పరీక్ష నిర్వహణకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం గ్రూప్ – 3 పరీక్ష నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, రూట్ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష రాసే అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని, అర గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు.

News November 14, 2024

గ్రూప్‌3 పరీక్ష ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ సత్య శారద

image

ఈ నెల 17, 18న  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్ -3 పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రూప్-3 పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News November 14, 2024

ఆగిన అభివృద్ధిని కొనసాగించే బాధ్యత నాది: MLA నాయిని

image

ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఆగిన అభివృద్ధిని కొనసాగించే బాధ్యత నాది అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ట్వీట్ చేశారు. నిత్యం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తూ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామని, నగర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారని చెప్పారు.

News November 14, 2024

మార్చి నెలలో బ్రిడ్జి అందుబాటులో వస్తుంది: ఎంపీ కావ్య

image

ఎన్నో ఏళ్ల కళగా ఉన్న కాజిపేట బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నాయని, మార్చి నెలలో బ్రిడ్జి అందుబాటులో వస్తుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. కాజీపేటలో కావ్య మాట్లాడుతూ.. ఈనెల 21న రైల్వే జీఎంని కలిసి పెండింగ్‌లో ఉన్న రైల్వే సమస్యలతో పాటు కాజీపేట రైల్వే బస్టాండ్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.

News November 14, 2024

వరంగల్: తరలివచ్చిన మిర్చి.. తేజ మిర్చి క్వింటాకు రూ.16,500

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి నేడు మిర్చి తరలివచ్చింది. ఈ క్రమంలో తేజ మిర్చి క్వింటాకు మంగళవారం రూ.16,500 రాగా.. నేడు రూ.16వేలకు పడిపోయింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు నిన్నటిలాగే రూ.15వేలు పలికింది. మరోవైపు వండర్ హాట్ మిర్చి నిన్నటితో పోలిస్తే ఈరోజు రూ.300 ధర పెరిగింది. నిన్న రూ.13,200 ధర రాగా.. నేడు రూ.13,500కి పెరిగింది.

News November 14, 2024

బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క

image

నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణలోని బాలబాలికలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి బాలలే రేపటి పౌరులని దేశ భవిష్యత్తు బాలల చేతుల్లో ఉందని సీతక్క అన్నారు. బాలల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు.

News November 14, 2024

BREAKING.. జనగామ జిల్లాలో అర్ధరాత్రి హత్య

image

జనగాం జిల్లాలో దారుణం జరిగింది. స్థానికుల వివరాలు.. రఘునాథ్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి పర్వత యోగేందర్ అనే వ్యక్తి గంపల పరశరాములుపై గొడ్డలితో దాడి చేయడంతో మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 14, 2024

వరంగల్ జిల్లాలో పెరుగుతున్న చలి

image

ఉమ్మడి WGL జిల్లా వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. జిల్లాలో ఉదయం, రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలితో ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్నారు. అలాగే, పొగమంచు సైతం ప్రయాణికులను తీవ్ర ఇబ్బంది పెడుతోంది. చలి నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడేవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.