India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని.. దేశానికి వారు అందించిన సేవలను, త్యాగాలను మంత్రి కొండా సురేఖ స్మరించుకున్నారు. పిల్లలే ఈ దేశ భవిష్యత్తు అని గట్టిగా నమ్మిన వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ అని మంత్రి అన్నారు. పిల్లలకు సరైన విద్య, శిక్షణ, సంరక్షణ ఉంటే వారు దేశానికి మూలస్తంభాలుగా నిలుస్తారని భావించి ఆ దిశగా కార్యాచరణను అమలుచేసిన దార్శనికుడు నెహ్రూ అని మంత్రి తెలిపారు.
HYD నుంచి సీఎస్ శాంతి కుమారి నేడు ధాన్యం కొనుగోలు, పత్తి పంట కొనుగోలు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, గ్రూప్-3 పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై HNK జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 12.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా 7.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించామని, మరో 5.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉందని అధికారులన్నారు.
రాష్ట్రంలోని పిల్లలకు మంత్రి సీతక్క బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డా ఆనందంగా ఉండాలనే నెహ్రూ ఆకాంక్ష రూపమే బాలల దినోత్సవమని పేర్కొన్నారు. దేశాన్ని వెనకబాటుతనం నుంచి వికాసం వైపు నడిపించిన దార్శనికుడిగా నెహ్రూను చిరకాలం ప్రజలు గుర్తు పెట్టుకుంటారని, నెహ్రూ చలవతోనే ప్రపంచ పటంలో దేశానికి ప్రత్యేక స్థానం దక్కిందన్నారు.
ఈనెల 17, 18వ తేదీల్లో జరిగే గ్రూప్-3 పరీక్షలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పరీక్షా కేంద్రాల చీఫ్ సూపర్నెంట్లు, రీజనల్ కోఆర్డినేటర్లు, రూట్ ఆఫీసర్లు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు పలికాయ తరలివచ్చింది. అయితే మంగళవారంతో పోలిస్తే నేడు పల్లికాయ ధర తగ్గింది. సూక పల్లికాయకు సోమవారం రూ.5,510 ధర రాగా.. మంగళవారం రూ.5,900 ధర వచ్చింది. నేడు రూ.5550 పలికింది. అలాగే మక్కలు బిల్టి క్వింటాకి నిన్న రూ.2,465 ధర పలకగా నేడు రూ.2,480కి పెరిగిందని అధికారులు తెలిపారు.
హనుమకొండలోని ప్రాచీన ఆలయమైన సిద్దేశ్వరాలయంలో కార్తీక మాసం బుధవారం సాయంత్రం ప్రదోష సమయాన ఆకాశ దీపం వెలిగించారు. ఆలయ ప్రధాన అర్చకులు సిద్దేశ్వరుని రవికుమార్, సురేష్ కుమార్ బుధవారం ఉదయం సిద్దేశ్వర స్వామికి పూజలు నిర్వహించి సాయంత్రం ఆకాశదీపం భక్తుల దర్శనానికి వెలిగించామని అన్నారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయానికి వచ్చి ఆకాశ దీపాన్ని దర్శించుకున్నారని తెలిపారు.
హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధ్యక్షతన నేడు జిల్లా అభివృద్ధి సమన్వయ & పర్యవేక్షణ-దిశా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కడియం కావ్య, MLAలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విద్యా వ్యవస్థ, మహిళా రక్షణ, మున్సిపల్ అభివృద్ధి, శానిటేషన్, తాగునీరు తదితర అభివృద్ధి అంశాలపై వారు చర్చించారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు ఈరోజు తీవ్ర నిరాశ ఎదురైంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర భారీగా పతనమైంది. సోమవారం రూ. 6,960 పలికిన క్వింటా కొత్త పత్తి ధర, మంగళవారం రూ.7,000కి పెరిగింది. అయితే ఈరోజు ఎవరూ ఊహించని విధంగా దారుణంగా పతనమై రూ.6,860కి పడిపోయింది. దీంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించారు. ఈ నెల 15న గురునానక్ జయంతి, 16న వారాంతపు సెలవు, 17 ఆదివారం సెలవు దినాలని మార్కెటింగ్ ఉన్నత శ్రేణి కార్యదర్శి నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి ఈ నెల 18న సోమవారం మార్కెట్ పునః ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కావున రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన HNK జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన గడ్డం శరణ్య (15) ఇంటర్ చదువుతోంది. దీపావళి సెలవులకు ఇంటికి వచ్చింది. మంగళవారం కాలేజీకి వెళ్లాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.