India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మానసిక స్థితి సరిగా లేని యువకుడు బావిలో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటకు చెందిన ఎర్ర వంశీ (24) HYDలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చిన అతడు ఈ నెల 19న HYD వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి బయల్దేరాడు. ఆదివారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో వంశీ మృతదేహం కనిపించడంతో రైతులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వరంగల్ జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో చెరువుల్లో జలకళ సంతరించుకుంటోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 816 సాగునీటి చెరువులున్నాయి. వాటిలో 20 పూర్తిగా నిండగా.. 61 చెరువుల్లో 75 నుంచి 100 శాతం వరకు నీరు చేరింది. 273 చెరువుల్లో 50 నుంచి 75 శాతం, 400 చెరువుల్లో 25 శాతం మేరకు నీరు చేరింది. మరో రెండు రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు ప్రకటించారు.
రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు పున: ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. రైతులు నాణ్యమైన, తేమలేని సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
వరంగల్ జిల్లా ఆదివారం సాయంత్రం 4గంటల వరకు జిల్లావ్యాప్తంగా 267MM ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దుగ్గొండి మండలంలో 29.8 MM కురిసింది. నల్లబెల్లి-29.7, ఖిలా వరంగల్-27, ఖానాపురం-26.8, గీసుకొండ-26.7, చెన్నారావుపేట-24.3, వరంగల్-23.4, వర్ధన్నపేట-19.3, నెక్కొండ-18.3, నర్సంపేట-18.3, రాయపర్తి-11.3, పర్వతగిరి-7.2, సంగెం-5.6ల వర్షపాతం నమోదు అయ్యింది.
ఏటూరునాగారం మండలం దొడ్ల- మల్యాల గ్రామాల మధ్య జంపన్నవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపిలేని కుండపోత వర్షాలతో వాగుకు వరద పోటెత్తింది. దీంతో లోతట్టు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కాగా ఇప్పటికే అధికారులు సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలిస్తున్నారు. గతేడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు వాగు పొంగి 8 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండం చెరువులో ఓ మత్స్యకారుడి వలకు 32 కిలోల భారీ చేప చిక్కింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు చెరువు నుంచి పెద్ద చేపలు వాగులోకి ఎదురు వెళ్తున్నాయి. పిల్లి సతీష్ అనే మత్స్యకారుడు చెరువులోకి వాగు నీరు చేరే చోట వల ఏర్పాటు చేశాడు. వల ఎంతకూ రాకపోవడంతో ఇతరుల సాయంతో వలను ఒడ్డుకు తీసుకొచ్చారు. అందులో 32 కిలోల పెద్ద చేప చిక్కడంతో సతీశ్ ఆనందం వ్యక్తం చేశారు.
శ్రీ భద్రకాళీ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఆదివారం భద్రకాళి అమ్మవారు శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కాగా, అమ్మవారిని శాకాంబరి అవతారంలో దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు.
భద్రకాళి అమ్మ వారి శాకంబరి ఉత్సవం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 3.50టన్నుల కూరగాయలు, 400కిలోల పండ్లు, 200కిలోల ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించనున్నారు. నేడు శ్రీభద్రకాళి అమ్మవారి శాకంబరి విశ్వరూప దర్శనం ఉంటుందని కార్యనిర్వహణ అధికారిణి శేషుభారతి, ప్రధానార్చకుడు శేషు తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బీ-ఫార్మసీ మొదటి, ఏడో సెమిస్టర్ షెడ్యూల్‌ను శనివారం కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్. నరసింహాచారి విడుదల చేశారు. ఈ నెల 26న పేపర్ 1, 27న పేపర్ 2, 30న పేపర్ 3, 31న పేపర్ 4 పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని తెలిపారు.
తల్లిదండ్రులు చనిపోయారని మనస్తాపం చెందిన ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం.. హసనపర్తి మండలం పెగడపల్లికి గ్రామానికి చెందిన పిన్నింటి హరీశ్(30) తల్లిదండ్రులు కొంత కాలం క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి ఇంటిలో ఒక్కడే ఉంటూ మానసిక వేదనకు గురవుతున్నాడు. ఈనెల 18న పురుగు మందు తాగాడు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.