India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలోని నూతన ప్రాంతాల్లో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడుతూ ఎప్పటికప్పుడూ గోదావరి వరద పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందస్తు ఏర్పాటు చేసిందని తెలిపారు. వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీతక్క పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతిచెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ వద్ద జరిగింది. మృతురాలు కలకోట్ల స్వప్న (40)గా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కెజిబివి) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులను జారీచేశారు. ఉత్తర్వులకు అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం నుంచి 6, 7 తరగతులకు ఆంగ్ల మాధ్యమంలో అడ్మిషన్లను ప్రారంభించినట్లు డీఈఓ రామారావు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపిన నేపథ్యంలో కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సత్య శారదా దేవి తెలిపారు. వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, ఫిర్యాదులుంటే టోల్ ఫ్రీ నంబర్ 1800 425 3434, 9154252936 లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కంట్రోల్ రూమ్‌లో 24 గంటలు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.
సికింద్రాబాద్ నుంచి కాజీపేట మీదుగా పట్నా, దానాపూర్ నడుస్తున్న రెండు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 03253 పట్నా-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 30 వరకు, 07255 హైదరాబాద్- పట్నా ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 2 వరకు, 03225/26 దానాపూర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 29 వరకు పొడిగించారు. రైళ్లలో రద్దీ అధికంగా ఉండటం వల్ల రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ప్రారంభించి రేవంత్ రెడ్డి దేశంలోనే నంబర్-1 సీఎం అయ్యారని కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, రఘురాంరెడ్డి అన్నారు. HYD గాంధీభవన్‌లో వారు మాట్లాడుతూ.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ రైతులపై తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని కొనియాడారు. BRSపదేళ్లు అధికారంలో ఉన్నా రైతులు, నిరుద్యోగుల కోసం ఏం చేయలేదని మండిపడ్డారు. కేవలం 7నెలల్లోనే ప్రజల కోసం ఎన్నో పనులు చేశామన్నారు.
కాకతీయ యూనివర్సిటీలో జులై 26 నుంచి ఇంజినీరింగ్ బీటెక్ రెండో, మూడో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామని కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ శ్రీరామోజు నరసింహాచారి తెలిపారు. జులై 26, 30, ఆగస్టు 1,3,5 తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 2, 3 సెమిస్టర్లకు చెందిన రెగ్యులర్, సప్లమెంటరీ, ఇంప్రూవ్మెంట్ అభ్యర్థులు హాజరు కావాలని తెలిపారు.
Way2Newsలో ప్రచురితమైన <<13641008>>కథనానికి <<>>స్పందన లభించింది. గార్ల మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలు గాడిపెల్లి నర్సమ్మను తన కొడుకులు ఆలనా పాలనా చూసుకోకపోవడంతో రోడ్ల పైనే తిరుగుతూ, భిక్షమెత్తుకుంటూ జీవిస్తోంది. ఈ విషయపై ఈ నెల 16న Way2Newsలో ‘బుక్కెడు బువ్వ పెట్టడం లేదని తల్లి కన్నీటి ఆవేదన’ కథనం ప్రచురితమైంది. దీనిపై గార్ల MRO రవీందర్ స్పందించి నర్సమ్మ కొడుకులకు శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఐదేళ్లుగా విధులు నిర్వహిస్తున్న 113 మంది కానిస్టేబుళ్లు కౌన్సిలింగ్ పద్దతిలో బదిలీ అయ్యారు. ఈ మేరకు వారు కమిషనరేట్ పరిధిలో ఎంపిక చేసుకున్న పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ సీపీ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు. డీఆర్డీఓ, డీపీఓలతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని, వైద్య సిబ్బంది గ్రామాల్లో సర్వేలు నిర్వహించాలని మంత్రి సీతక్క కోరారు.
Sorry, no posts matched your criteria.